ETV Bharat / opinion

అంతులేని కథ.. గోదాముల కొరత! - కనీస ధర

గోదాముల కొరత రైతుల పాలిట శాపంగా మారుతోంది. గిట్టుబాటు ధరలేక.. నిల్వచేసుకుందామంటే వసతులు లేక రైతన్నలు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. వసతుల లేమితో కునారిల్లుతున్న మార్కెట్లు బాగుపడితే రైతులకు మేలు జరగడమే కాకుండా,  పంట ఉత్పత్తుల వృథా తగ్గి దేశానికి ఆహార భద్రత మెరుగవుతుంది.

shortage of warehouses
గోదాముల కొరత
author img

By

Published : Jul 23, 2021, 7:01 AM IST

బహిరంగ విపణిలో గిట్టుబాటు ధరలు దక్కకపోతే- రైతులు తమ పంటలను కొంతకాలం నిల్వ చేసుకొని, తరవాత మెరుగైన ధరలకు అమ్ముకోవడానికి వీలుగా గోదాములు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇవి కొంతమంది కర్షకుల అవసరాలను మాత్రమే తీరుస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నిర్మించిన గోదాముల వసతి- పదోవంతు రైతులకైనా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఎక్కువ మంది రైతులు వ్యాపారి అడిగిన ధరకే- గ్రామాలు, పొలాల వద్దే పంటలను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఇలాంటి విషమ స్థితి నుంచి గట్టెక్కించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వివిధ పథకాల కింద గిడ్డంగులు నిర్మిస్తున్నా అవెంతమాత్రం చాలడం లేదు. మార్కెట్ల అభివృద్ధి కోసం పంట ఉత్పత్తులపై ఒకశాతం సెస్సు వసూలు చేసి రైతులకు వసతులు కల్పిస్తామని చెబుతున్నారు. అయితే ఇదీ ఆచరణలో అంతంత మాత్రంగానే అమలవుతోంది.

పెరగాల్సిన సామర్థ్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల టన్నుల మేరకు వస్తున్న దిగుబడులతో పోలిస్తే నిల్వ వసతి నామమాత్రంగా ఉంది. దీన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీ మార్కెట్ యార్డుల పరిధిలోని 760 గోదాములకు 6.84లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా, తెలంగాణలోని 1,157 గోదాములకు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు గోదాములు మార్కెట్ కమిటీ కేంద్రంగానే సాగుతున్నాయి. వాటిని మండల కేంద్రాలు, రహదారి కూడలి ప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వేజంక్షన్లు ఉండే ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలి. వృథాను అరికట్టి ఉత్పత్తులు నాణ్యత కోల్పోకుండా దీర్ఘకాలం నిల్వఉంచే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. సంస్థాగతంగా మార్కెటింగ్‌ వ్యవస్థలో మాత్రం నేటికీ సంప్రదాయ గిడ్డంగులే కొనసాగుతున్నాయి. అదే సమయంలో పంట ఉత్పత్తుల శుద్ధి, ప్యాకింగ్‌, ఉప ఉత్పత్తుల తయారీ తదితర పనుల్లో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది.

పంట ఉత్పత్తుల విక్రయాలపై ఒకశాతం సొమ్మును వ్యాపారుల నుంచి సెస్సు పేరుతో మార్కెట్లు వసూలు చేస్తున్నాయి. మార్కెట్ కమిటీలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. ఏపీలో ఏడాదికి సుమారు రూ.550 కోట్లు వసూలవుతుండగా, తెలంగాణలో సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరుతోంది. సెస్సు వసూలు చేసే ఉత్పత్తుల సంఖ్యను ప్రభుత్వం ఏటా తగ్గిస్తుండటంతో ఆ ప్రభావం ఆదాయంపై పడుతోంది. సెస్సు ఆదాయాన్ని సర్వీసు కమిటీ ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు సింహభాగం వెచ్చిస్తూ- గోదాముల నిర్మాణం, రైతు సంక్షేమ కార్యక్రమాలకు కేవలం 23 శాతమే ఖర్చు చేస్తున్నట్లు గతంలో కాగ్‌ తప్పుపట్టింది. నిధుల లేమితో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేక వెనకబడుతున్నారు. చాలా శాఖల్లో ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, పింఛన్లు, కార్యాలయాల నిర్వహణను ప్రభుత్వమే భరిస్తుండగా మార్కెటింగ్‌శాఖలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. సెస్సు ద్వారా వచ్చిన సొమ్మును, యార్డుల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులను ఇతర శాఖలకు మళ్ళిస్తున్నారు. ఆ ధనం తిరిగి రాకపోవడంతో శాఖాపరమైన పనులకు నిధుల లేమి సమస్య వేధిస్తోంది.

ఆత్మనిర్భర్‌పై ఆశలు

ఆర్థిక సాంత్వన కోసం ఎదురు చూస్తున్న వ్యవసాయ మార్కెట్లకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమం కింద లక్ష కోట్ల రూపాయలను అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటన ఆశలు రేపుతోంది. దీనితో గోదాములు, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్‌, గ్రేడింగ్‌, డ్రయింగ్‌ వేదికల నిర్మాణం తదితర విపణి సౌకర్యాలు విస్తృతంగా సమకూరే అవకాశం ఉంది. వసతుల లేమితో కునారిల్లుతున్న మార్కెట్లు బాగుపడితే రైతులకు మేలు జరగడమే కాకుండా, పంట ఉత్పత్తుల వృథా తగ్గి దేశానికి ఆహార భద్రత మెరుగవుతుంది. ఈ కార్యక్రమం కింద ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వ హామీతో రెండు కోట్ల రూపాయల రుణంపై మూడు శాతం వడ్డీ రాయితీ వర్తింపజేస్తారు. కేంద్రం నిధులను గ్రాంటుగా కాకుండా రుణం రూపంలో ఇవ్వడంవల్ల మార్కెట్ కమిటీలు వడ్డీ రాయితీ పోగా మిగిలిన సొమ్మును వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇదే విధంగా తీసుకొచ్చిన పథకాలు ఆశించిన ప్రయోజనాలు అందించకపోవడంతో ఇప్పుడు కమిటీలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ప్రధానిగా వాజ్‌పేయీ హయాములో గ్రామీణ బండారణ్‌ యోజన ద్వారా గోదాముల నిర్మాణానికి రుణాలు సమకూర్చారు. అప్పట్లో రుణం తీసుకుని నిర్మించిన గోదాములకు సకాలంలో వాయిదాలు కట్టలేకపోవడంతో అసలు కంటే వడ్డీ ఎక్కువ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని రైతులకు సౌకర్యాలు కల్పించిన తరవాత నామమాత్ర రుసుములే వసూలు చేస్తే వాయిదాలు చెల్లించే పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాలూ లేకపోలేదు. రైతులు సీజన్‌లోనే పంట ఉత్పత్తులు నిల్వచేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు గోదాములు ఖాళీగా ఉంటాయి. ఆ సమయంలో వాయిదాలు ఎలా చెల్లించాలన్న వాదన తెరపైకి వస్తోంది. దీనికితోడు మార్కెట్ యార్డులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గోదాముల నిర్వహణ చేపట్టేందుకు వృత్తి నిపుణుల కొరత వెంటాడుతోంది. బ్యాంకుల నుంచి రుణాలను మార్కెట్ కమిటీలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని వాటిని చెల్లించే బాధ్యత కూడా చేపడితే కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది. భవిష్యత్తులో గోదాములే మార్కెట్ యార్డులుగా చలామణీలోకి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ వ్యవస్థను గ్రామస్థాయిలోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌ సులభతరమయ్యే అవకాశాలు మెరుగవుతాయి. అప్పుడే పంటలకు గిట్టుబాటు ధర లభించి రైతులకు లబ్ధి చేకూరుతుంది.

ఇతర అవసరాలకూ వాడేస్తారా?

ఒక మార్కెట్ యార్డు పరిధిలో సగటున మూడు మండలాలు, 50 గ్రామాలు ఉంటున్నాయి. గ్రామానికి 500 మంది రైతుల చొప్పున పాతిక వేల మంది ఉండగా, యార్డుల్లోని గోదాముల్లో సరకు నిల్వచేసుకోగలిగిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. యార్డులోని గోదాములను వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగిస్తుండటం పెరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల పనులు, సర్కారీ సామగ్రి నిల్వ తదితర అవసరాలకూ వీటిని వాడేస్తున్నారు. ఏపీలో మార్కెటింగ్‌ శాఖ ఏకంగా ప్రైవేటు వ్యక్తులకు గోదాములు లీజుకు ఇచ్చింది. ఈ పరిణామం రైతులకు నష్టం కలిగించేదే. మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పతుల నిల్వకు రైతుల నుంచి నామమాత్రం అద్దెనే వసూలు చేస్తారు. కానీ, ప్రైవేటు గిడ్డంగుల్లో రుసుములు అధికంగా ఉంటున్నాయి. యార్డులో అవకాశం లేకపోవడం, ప్రైవేటులో అధిక అద్దెలు ఉండటంతో రైతులకు రెండుచోట్లా సంకట పరిస్థితి ఎదురవుతోంది.

- పెనికలపాటి రమేష్‌

ఇవీ చదవండి:భారీ వర్షాలకు మహారాష్ట్ర విలవిల- ఠాక్రేకు ప్రధాని ఫోన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.