ETV Bharat / opinion

నాణ్యత లోపంతో దెబ్బతింటున్న ఇంజినీరింగ్​ విద్య - దేశంలో విద్యావ్యవస్థ

దేశంలో ఎందరో విద్యార్థులకు బీటెక్‌ పట్టా చేతిలో ఉన్నా ప్రమాణాలు లేని కళాశాలలో చదివిన కారణంగా నెగ్గుకు రాలేకపోతున్నారు. అరకొర సిబ్బంది, మౌలిక వసతుల లేమి విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల మాదిరిగా మిగిలిన కళాశాలల ప్రమాణాలు మెరుగుపరిస్తేనే ఆధునిక పారిశ్రామిక అవసరాలను తీర్చగల మానవ వనరులను సృష్టించగలమని నిపుణులు పేర్కొంటున్నారు.

technical education
నాణ్యత లోపంతో దెబ్బతింటున్న ఇంజినీరింగ్​ విద్య
author img

By

Published : Nov 22, 2021, 4:41 AM IST

దేశాన్ని సాంకేతికంగా పటిష్ఠం చేయడంలో ఇంజినీరింగ్‌ది కీలక పాత్ర. గత ఒకటిన్నర దశాబ్దాల కాలంలో బీటెక్‌ కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల పెద్ద సంఖ్యలో సీట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటివి అందుకు తోడ్పడ్డాయి. ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యత లోపించడం, సరైన ఉద్యోగాలు దక్కకపోవడం వంటి కారణాలతో పాలపొంగులా వచ్చిన ఇంజినీరింగ్‌ విద్య అంతే చప్పున చల్లారిపోతోంది. చాలా కళాశాలల్లో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో చివరి విడత కేటాయింపుల తరవాత 25శాతం సీట్లు మిగిలిపోయాయి. దేశమంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలు గత అయిదేళ్లుగా 21శాతం మేర తగ్గిపోయాయి. దాంతో ఏఐసీటీఈ 2020-21 విద్యా సంవత్సరం నుంచి కొత్త కళాశాలల ఏర్పాటుపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015-16 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ, డిప్లొమా అన్నీ కలిపి అత్యధికంగా ముప్ఫై లక్షలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ తరవాత నుంచి అవి క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది 23.6 లక్షలకు దిగి వచ్చాయి. తమిళనాడులో తాజా కౌన్సెలింగ్‌లో 62శాతం సీట్లే భర్తీ అయ్యాయి. నిరుడు పశ్చిమ్‌ బెంగాల్‌లో మూడు విడతల కౌన్సెలింగ్‌ తరవాత 60శాతం దాకా సీట్లు మిగిలిపోయాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తామర తంపరగా కొత్త విద్యాసంస్థలు పుట్టుకురావడం, కాలానుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చోటుచేసుకోకపోవడం, సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను తీర్చిదిద్దకపోవడం వంటివి భారత్‌లో ఇంజినీరింగ్‌ విద్యను దెబ్బతీస్తున్నాయి. పేరుకు బీటెక్‌ పట్టా చేతిలో ఉన్నా ప్రమాణాలు లేని కళాశాలలో చదివిన ఎందరో ఉపాధి వేటలో నెగ్గుకు రాలేకపోతున్నారు. భారత ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 80శాతానికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవని గతంలో యాస్పైరింగ్‌ మైండ్స్‌ వార్షిక ఉపాధి నివేదిక కుండబద్దలు కొట్టింది.

సివిల్‌, మెకానికల్‌ వంటి సంప్రదాయ బ్రాంచీల్లో సీట్లు పెద్ద సంఖ్యలో మిగిలిపోతుంటే- కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ), ఐటీ వంటి విభాగాల్లో మాత్రం దాదాపుగా నిండిపోతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం దేశంలో ఐటీకి విపరీతమైన డిమాండు ఏర్పడటం వల్ల సీఎస్‌ఈ బ్రాంచి విద్యార్థుల ప్రధాన ఎంపికగా మారింది. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపినా, సాఫ్ట్‌వేర్‌ కొలువులపై ఆసక్తి నేటికీ తగ్గలేదు. మరోవైపు సివిల్‌, మెకానికల్‌ వంటి శాఖల్లో చదివిన చాలామందికి అదే విభాగంలో ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేసి ఐటీ రంగం వైపు వెళ్తున్నారు. కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మౌలిక అంశాలపై పట్టుంటే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చు అన్నది నిపుణుల మాట. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరవాత సరైన ఉద్యోగాలు దొరక్క చాలామంది మేనేజ్‌మెంట్‌ కోర్సుల వైపు వెళ్తున్నారు. అందుకే గత అయిదేళ్లుగా ఆ సీట్ల సంఖ్య పెరుగుతోంది.

ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలకు మంచి ఆదరణ ఉంటోంది. సరైన ప్రమాణాలు పాటించడం, ఫీజు తక్కువగా ఉండటం వల్ల విద్యార్థుల ప్రథమ ఎంపికలో అవే నిలుస్తున్నాయి. మిగులు సీట్లలో అధిక శాతం ప్రైవేటు కళాశాలలవే. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఉన్నత ప్రమాణాలు పాటించే మరికొన్ని ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలతో పోలిస్తే మిగిలినవి తమ విద్యార్థులను ఉద్యోగాలకు అనుగుణంగా తీర్చిదిద్దలేకపోతున్నాయి. అరకొర సిబ్బంది, మౌలిక వసతుల లేమి విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. అఖిల భారత సర్వీసులకు ఎంపికవుతున్న వారిలో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు సైతం ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఆ విద్యలో అసమానతలకు ఇది నిదర్శనం. దీన్ని సరిదిద్దాలంటే జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా ఇంజినీరింగ్‌ పాఠ్య ప్రణాళికలో మార్పులు తేవాలి. కాలానుగుణంగా కొత్త కోర్సులు అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు సైతం వేలంవెర్రిగా ఒకే కోర్సువైపు వెళ్లకుండా తమ ఆసక్తికి తగిన చదువులను ఎంచుకోవాలి. ఇంజినీరింగ్‌లో సంప్రదాయ బ్రాంచీల ప్రాధాన్యాన్ని, వాటిలో ఉద్యోగ అవకాశాలను సైతం విద్యార్థులకు వివరించాలి. నిబంధనలు పాటించని అన్ని కళాశాలలపై ఏఐసీటీఈ కొరడా ఝళిపించాలి. ఐఐటీల మాదిరిగా మిగిలిన కళాశాలలూ ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిస్తేనే ఆధునిక పారిశ్రామిక అవసరాలను తీర్చగల మానవ వనరులను సృష్టించగలిగేది!

- ఎం.అక్షర

ఇదీ చూడండి : 'కాప్‌-26' సదస్సులో కానరాని పర్యావరణ స్పృహ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.