ETV Bharat / opinion

గడ్డు పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యమేనా? - కరోనా వైరస్​

విద్యా సంవత్సరానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందంటూ సెప్టెంబరు ఒకటి నుంచి ప్రవేశ పరీక్షల కాల పట్టికను ప్రకటించింది జాతీయ పరీక్షా సంస్థ. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే లాక్​డౌన్​ అమల్లో ఉండటం, వరదలతో అనేక రాష్ట్రాలు చిన్నాభిన్నమవడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లు తప్పవు. మరి కొవిడ్‌ కాటు పడకుండా, దేశ భవిష్యత్‌ నిర్మాణ క్రతువు సాఫీగా సాగేలా చూడటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద పరీక్ష కానుంది!

Editorial on conducting JEE, NEET exams
గడ్డు పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యమేనా?
author img

By

Published : Aug 29, 2020, 5:59 AM IST

జాతీయ స్థాయి పోటీ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటుకుని, పేరెన్నికగన్న విద్యాసంస్థల్లో సీటు సంపాదించి, మేలిమి వైద్యులూ ఇంజినీర్లుగా పట్టా పొంది రావాలన్నది దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల కల. కరోనా మహమ్మారి నిశ్శబ్ద మృత్యుపాశాలు విసరుతూ భయానక వాతావరణం సృష్టించిన వేళ- విద్యార్థుల క్షేమానికి భరోసా ఇచ్చేలా ప్రవేశ పరీక్షల్ని నిర్వహించడం ఎలా? మొన్న ఏప్రిల్‌లోనే నిర్వహించాల్సిన జేఈఈ (మెయిన్‌), ఎన్‌ఈఈటీలను కొవిడ్‌ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌ఏటీ)- విద్యా సంవత్సరానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందంటూ సెప్టెంబరు ఒకటి నుంచి ప్రవేశ పరీక్షల కాల పట్టికను ప్రకటించింది. 8.58లక్షల మంది ఇంజినీరింగ్‌ అభ్యర్థులు హాజరయ్యే జేఈఈ (మెయిన్‌) పరీక్షా కేంద్రాల్ని 660కి, భౌతిక దూరం సాధ్యపడేలా షిఫ్టుల సంఖ్యను ఎనిమిది నుంచి పన్నెండుకు పెంచామని; పది లక్షల మాస్కులు, మరో పది లక్షల జతల చేతి తొడుగులు, వందల సంఖ్యలో ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్లు, వేల లీటర్ల శానిటైజర్‌ సిద్ధం చేశామని ఎన్‌ఏటీ చెబుతోంది. ఈ పరీక్షల్ని వాయిదా వేస్తే విద్యార్థుల 'కెరీర్' బుగ్గిపాలవుతుందంటూ సంబంధిత వ్యాజ్యాల్ని సుప్రీంకోర్టు పదిరోజులక్రితం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం తెలిసిందే. క్షేత్రస్థాయి వాస్తవాల్ని విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదంటూ 'సుప్రీం'ను ఆశ్రయించిన ఆరు రాష్ట్రాల మంత్రుల తాజా వ్యాజ్యం- దేశవ్యాప్త ఆందోళనలకు ప్రతిధ్వనే! దేశీయంగా 345 జిల్లాల్లో ఏదో ఒక స్థాయిలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండటంతో పరీక్షా కేంద్రాలకు రాకపోకలు కష్టమని, భారీ వరదలు ముంచెత్తిన బిహార్‌, గుజరాత్‌, అసోమ్‌లతోపాటు, కుంభవృష్టితో కుదేలైన కేరళ, జమ్మూకశ్మీర్‌లలో అంతర్జాల సమస్యలు వేధిస్తున్నాయన్న ఆందోళనల్ని తోసిపుచ్చే వీల్లేదు. ముందు నుయ్యి వెనక గొయ్యిలాంటి సంకటస్థితిలో ఉన్న విద్యార్థి లోకానికి సహేతుక పరిష్కారాల్ని అన్వేషించాలిప్పుడు!

దేశార్థిక సామాజిక రంగాలపై దారుణ దుష్ప్రభావం చూపుతున్న కొవిడ్‌ మహమ్మారి- విద్యావ్యవస్థనూ అతలాకుతలం చేస్తోంది. ఆయా తరగతుల్లో అంతక్రితం సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థుల్ని ఉత్తీర్ణులుగా ప్రకటించడం విపత్తుల నిభాయక చట్టం పరిధిలోకి రాదంటూ సుప్రీంకోర్టు నిన్న కీలక తీర్పు వెలువరించింది. తుది వార్షిక పరీక్షలు పెట్టకుండా ఎవరికీ పట్టాలిచ్చేది లేదన్న యూజీసీ వాదనకే వత్తాసు పలుకుతూ- కావాలంటే ఆయా రాష్ట్రాలు కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షల వాయిదా కోసం యూజీసీని కోరవచ్చనీ సూచించింది. అదే నియమం ఎన్‌ఈఈటీ, జేఈఈలకూ వర్తించడం న్యాయం. కొవిడ్‌ కారణంగానే లోగడ రెండుసార్లు వాయిదాపడిన ప్రవేశ పరీక్షల్ని, ఆ మహమ్మారి భయానకంగా ఉరుముతున్న వేళ 'తప్పనిసరి' అంటూ నిర్వహించడం ఏమిటన్న ప్రశ్న అర్థవంతం. వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ఆశిస్తున్న దాదాపు 16 లక్షలమంది 155 నగరాలకు వచ్చి పరీక్షలు రాయాలి. లోతట్టు గ్రామాల విద్యార్థులకు అనేకచోట్ల పరీక్షా కేంద్రాలు వంద కిలోమీటర్లపైనే దూరం ఉన్నాయని, రవాణా, వసతి సౌకర్యాల లోటు వెక్కిరిస్తున్న సమయంలో వారు ఆశలు వదులుకోవాల్సి వస్తుందని విశ్లేషణలు చాటుతున్నాయి. మొత్తంగా విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందంటూ సత్వర ప్రవేశ పరీక్షల నిర్వహణకే పలువురు విద్యావేత్తలూ ఓటేస్తున్న తరుణంలో- పరీక్షా కేంద్రాల్ని మరింత విస్తృతం చేయడం నుంచి, ప్రతిభావంతులకు అన్యాయం జరగకుండా సమర్థ ప్రత్యామ్నాయాలు ఏమిటో మేధామథనం సాగాలి. కొవిడ్‌ కాటు పడకుండా, దేశ భవిష్యత్‌ నిర్మాణ క్రతువు సాఫీగా సాగేలా చూడటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద పరీక్ష కానుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.