ETV Bharat / opinion

'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిలో అదే కీలకం' - AGRICULTURE INFRASTRUCTURE FUND

'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి'పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని ద్వారా రైతు ఉత్పత్తి సంఘా(ఎఫ్‌పీఓ)లకు కీలక భాగస్వామ్యం కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మరి ఈ నిధి చిన్నకారు రైతులకు మంచి చేస్తుందా? రైతు ఉత్పత్తి సంఘాల భాగస్వామ్యం కీలకం కానుందా? పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి.

Editorial on Agriculture  Infrastructure Fund
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిలో అదే కీలకం
author img

By

Published : Aug 30, 2020, 8:11 AM IST

క్ష కోట్ల రూపాయల మౌలిక నిధితో వ్యవసాయానికి అండగా నిలవనున్నట్లు ప్రధానమంత్రి మోదీ ఇటీవల చేసిన ప్రకటన ఆసక్తిగొలిపింది. సేద్యానంతరం పంటను మెరుగ్గా నిల్వ చేసుకునేందుకు, శుద్ధి పరచి మార్కెటింగ్‌ చేసుకునేందుకు అన్నదాతలకు అక్కరకొచ్చేలా ప్రాథమిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధిని వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రైతు ఉత్పత్తి సంఘా(ఎఫ్‌పీఓ)లకు కీలక భాగస్వామ్యం కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నిధిని ఉపయోగించి ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల ద్వారా రైతులకు రాయితీలు, తక్కువ వడ్డీకి రుణాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నాబార్డు ఆర్థిక తోడ్పాటుతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పట్టాలకెక్కించాలని నిర్ణయించారు.

చిన్న కమతాలకు సవాళ్లు

దేశంలో పదివేల 'ఎఫ్‌పీఓ'లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను పంచుకుంటున్న 'నాబార్డు'- ఈ రైతు సంఘాలకు తాము పండించిన పంటకు మెరుగైన ధర పొందే విధంగా ఓ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తే మంచిది. పెద్ద సంఖ్యలో, మెరుగైన నిల్వ సదుపాయాలు ఉంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. కానీ, చిన్న రైతులు దీర్ఘకాలంపాటు పంటను అట్టిపెట్టుకోలేరు. కుటుంబ ఖర్చులు, ఇతర అవసరాలకోసం వారికి సాధారణంగా పంట కోసిన తక్షణం డబ్బులు కావలసి ఉంటుంది. దేశంలో 12.6 కోట్ల సన్న, చిన్నకారు రైతులు- మొత్తం 7.4 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలోని వ్యవసాయ భూమిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అంటే సగటున ఒక్కొక్కరికి 0.58 హెక్టార్ల వ్యవసాయ భూమి అందుబాటులో ఉందన్న మాట! ఇంత చిన్న పరిమాణంలో వ్యవసాయ భూమి ఉన్న బడుగు రైతులకు ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. నిల్వ సదుపాయాలు కల్పించడంతోపాటు రైతు ఉత్పత్తి సంఘాల స్థాయిలో వాటి అవసరాన్ని, ప్రయోజనాన్ని మరింత పెంచేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. పరిస్థితులను మదింపు వేసి అవసరం మేరకు మార్పులు చేసుకోవడానికి వీలుగా రైతులు గిడ్డంగుల్లో నిల్వ చేసిన ధాన్యానికి గాను వారికి ఒక ధ్రువీకృత రసీదును (నెగోషియబుల్‌ వేర్‌హౌస్‌ రిసీట్‌ సిస్టమ్‌) ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాలి. ఈ విధానం ద్వారా ఎఫ్‌పీఓలు రైతులు నిల్వ చేసిన ధాన్యానికి అప్పటికి ఉన్న ధరలో 75-80శాతాన్ని ముందస్తుగా చెల్లించాలి. రైతుల ఉత్పత్తిని పూచీకత్తుగా ఉంచుకొని వారికి అడ్వాన్సు మొత్తాలు చెల్లించాలంటే ఎఫ్‌పీఓల వద్ద భారీగా రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు అవసరపడే మూలధనం ఉండాలి. రైతులు పంట రుణాలు పొందినట్లుగానే, ఎఫ్‌పీఓలకు 4-7 శాతం వడ్డీరేట్లకు నాబార్డ్‌ రుణాలు ఇస్తేనే ఇది సాధ్యం. ఇప్పుడు చాలావరకు ఎఫ్‌పీఓలు సూక్ష్మ రుణ సంస్థల ద్వారా 18-22శాతం వార్షిక వడ్డీరేట్ల వద్ద అప్పులు తెచ్చుకొని మూలధనం సమకూర్చుకుంటున్నాయి. ఇంత భారీ వడ్డీరేట్లకు రుణాలు తెచ్చుకొని- గిడ్డంగులు నిర్వహించి, రైతులకు అడ్వాన్సు మొత్తాలను చెల్లించడం సాధ్యమయ్యే పనికాదు. పంట కోతల తరవాత మార్కెట్లో అనూహ్యంగా ఉత్పత్తుల ధరలు పెరిగితే తప్ప ఎఫ్‌పీఓలకు ఈ వ్యవహారం గిట్టుబాటు కాదు. పంట ఉత్పత్తిని పూచీకత్తుగా ఉంచుకొని ముందస్తుగా అడ్వాన్సు చెల్లించే విధానానికి సంబంధించి 'నాబార్డు' ఎఫ్‌పీఓలకు నిర్దిష్ట శిక్షణ ఇవ్వాలి.

అన్నదాతకు భరోసా

పంట కోతల తరవాత నిల్వ, ప్రాసెసింగ్‌ సౌకర్యాలు లేక ఈ దేశంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతల గిడ్డంగులు, ప్యాకింగ్‌ కేంద్రాలు, నాణ్యతను బట్టి ఉత్పత్తిని వేరుపరచే 'గ్రేడింగ్‌' కేంద్రాలు, ఉత్పత్తి ఫలదీకరణ ఛాంబర్లు, ఇ-విపణి వేదికలు వంటివాటిని ఏర్పాటు చేసేందుకు తీసుకునే రుణాలకు నేరుగా మూడు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. సేద్య విపణులకు చురుకు పుట్టించే క్రమంలో మౌలిక నిధి ఏర్పాటును సరైన ముందడుగుగా అభివర్ణించవచ్ఛు సేద్య విపణుల ఏర్పాటు వ్యవహారాన్ని సరళీకరించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం మూడు ఆర్డినెన్సులు జారీ చేసింది. అత్యవసర వస్తువుల చట్టంలో సవరణలు, ఏపీఎంసీ విపణులకు ఆవల రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునే వెసెులుబాటు; రైతులు, సేద్య ఉత్పత్తి శుద్ధి కేంద్రాల నిర్వాహకులు, ఎగుమతిదారులు, రీటెయిలర్ల మధ్య వ్యవసాయ ఒప్పందాలకు వీలు కల్పించే ఆర్డినెన్సులవి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సంస్కరణలను రాష్ట్రాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, ఔత్సాహికవేత్తలు అందిపుచ్చుకొని; సమర్థంగా అమలు చేసినప్పుడే సానుకూల ఫలితాలు సాధ్యమవుతాయి.

సాధికార సమూహాలుగా ఎఫ్‌పీఓలు

వస్తూత్పత్తుల విపణిలో రకరకాల ప్రయోగాలు చేస్తున్న ఎఫ్‌సీఐ, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌), ఎస్‌టీసీ వంటి సంస్థలు సేద్య ఉత్పత్తులకు సంబంధించిన అంచనా వాణిజ్యంలో తమ పాత్రను మరింత విస్తరించుకోవాలి. వ్యవసాయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో చైనా ఇప్పటికే ఎంతో ముందుంది. ఎఫ్‌పీఓలకు, వ్యవసాయ విపణిదారులకు రుణాలు సమకూర్చే బ్యాంకులు సేద్య ఉత్పత్తులకు సంబంధించిన అంచనా వాణిజ్యంలో చురుగ్గా వ్యవహరించాలి. గిడ్డంగుల్లో నిల్వ చేసే సేద్య ఉత్పత్తులకు ‘పునః బీమా’ వంటివి కల్పించి వ్యవసాయ మార్కెట్ల ఆరోగ్యకరమైన విస్తరణకు దోహదపడాలి. ప్రభుత్వ విధానాలు వ్యవసాయ విపణులను మరింత సుస్థిరపరచేలా ఉండాలి. గతంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగిన ప్రతి సందర్భంలోనూ 'అగ్రి ఫ్యూచర్స్‌'పై ప్రభుత్వాలు వేటువేశాయి. కానీ ఇవి మనుగడలో ఉంటే భవిష్యత్తులో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎలా ఉండబోతున్నాయన్న అంచనా దొరుకుతుంది. విపణులను ఏకం చేయడంతోపాటు- స్పాట్‌, ఫ్యూచర్స్‌ మార్కెట్లను తాత్కాలికంగానైనా ఏకతాటిపైకి తీసుకురావడం తప్పనిసరి. అప్పుడే భారతీయ రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల అత్యుత్తమ ధర తెలుస్తుంది. భవిష్యత్తులో సంభవించబోయే మార్కెట్‌ ఒడుదొడుకులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలు చిక్కుతుంది. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా అన్నదాతలందరినీ ఎఫ్‌పీఓల పేరిట సమూహ సంఘాలు ఏర్పాటు చేసి; ఈ గ్రూపులను సమీకృత విలువ ఆధారిత మార్కెట్‌ శక్తులతో అనుసంధానించారు. ఇప్పటివరకు వివిధ సంస్థల ద్వారా దేశంలో సుమారు ఏడువేల రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేశారు. ఒక జిల్లా... ఒక వ్యవసాయ ఉత్పత్తి లక్ష్యంతో కొలువుతీరనున్న పదివేల ఎఫ్‌పీఓలను సుస్థిర, సాధికార సమూహాలుగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి జరగాలి. రైతులపై జరుగుతున్న దోపిడిని అడ్డుకుని వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం వారికి నాణ్యమైన వనరులు తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలి. దీనికితోడు కృత్రిమ మేధ, సేద్య రోబోలు, ఆటో పైలట్‌ విధానంలో నడిచే ట్రాక్టర్లు వంటి అత్యధునాతన సాధనాలను సమకూర్చి- దిగుబడులను పెంచేందుకు ప్రయత్నించాలి!

- పరిటాల పురుషోత్తం (రచయిత- సామాజిక ఆర్థిక విశ్లేషకులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.