ETV Bharat / opinion

ఫోనులో ఇరుక్కుపోయిన చదువు.. అందరికీ అందేనా?

author img

By

Published : Sep 11, 2020, 10:01 AM IST

కరోనా తెచ్చిన కొత్త సమస్య ఏమిటంటే విద్యాభ్యాసం టెక్నాలజీకి పరిమితం కావడం. బడి అనే విశాలమైన ప్రదేశం ఇప్పుడు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ ఫోన్​లో ఇరుక్కుపోయింది. కానీ, ఆ సాంకేతికత అందరికీ అందకపోతే... ధనిక, పేద అంతరాలు పెరిగిపోవా?

difficulties in online education during corona period
ఫోనులో ఇరుక్కుపోయిన చదువు.. అందరికీ అందేనా?

కొవిడ్‌ మానవాళిపై దండెత్తి అప్పుడే ఏడు నెలలు. ఈ పోరాటంలో కొవిడ్‌ దాడికి తట్టుకోలేని వాళ్ళు మృతిచెందారు. ఈ మహమ్మారిని ఎప్పటికి పారదోలగలమో ఊహకందడంలేదు. మరోవైపు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇంతటి అనిశ్చిత పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. ఏటా జూన్‌లో పాఠశాలలు తెరుస్తారు. జూన్‌, జులై నెలల్లో పిల్లలు కొత్త పుస్తకాలు, ఏకరూప దుస్తులు కొంటారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఎంతో సందడి నెలకొంటుంది. కానీ, ఈ సంవత్సరం ఇంకా బడులే తెరవలేదు. పాఠశాలల పునఃప్రారంభంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తెరిచినా, విద్యార్థుల రక్షణకు ఎలాంటి చర్యలు చేపడతారనేది పెద్దప్రశ్న. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు ఎంతవరకు సుముఖత చూపుతారనేదీ సందేహాస్పదమే. ఆరోగ్యపరంగా పిల్లల సంరక్షణకు సంబంధించిన చింత ఒకవైపు, కాలం వృథా అవుతోందనే బాధ మరోవైపు తల్లిదండ్రులను వేధిస్తున్నాయి.

ఏకరూపం మాయమా...?

బడిలో ప్రతి విద్యార్థి సమానమేనని చాటిచెప్పేందుకే ఏకరూప దుస్తుల విధానాన్ని రూపొందించారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చినా, పేదింటి పిల్లలైనా- వారి ఆర్థిక నేపథ్యం తరగతి గదిలో వారి ఏకాగ్రతకు, చదువుకు ఆటంకం ఏర్పరచకూడదనేదే ఏకరూప దుస్తుల విధానం వెనక ఉన్న ఉద్దేశం. కరోనా సంక్షోభంతో ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. బడిలో ఎలాంటి వాతావరణం ఉందో, అది బడి అనే ప్రదేశానికి పరిమితం. అందులో ఉన్న ఆటస్థలం, తరగతి గదులు, అక్కడి వస్తువులు ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉంటాయి. కరోనా తెచ్చిన కొత్త సమస్య ఏమిటంటే విద్యాభ్యాసం టెక్నాలజీకి పరిమితం కావడం. బడి అనే విశాలమైన ప్రదేశం ఇప్పుడు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ ఫోన్‌కు పరిమితమయిపోయింది... ఆన్‌లైన్‌ వీడియో తరగతుల రూపంలో. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించే అంశాలనే కాకుండా- విద్యార్థులు మరెన్నో అంశాలను గ్రహిస్తుంటారు. ఆన్‌లైన్‌ విద్యతో అలాంటి అవకాశాలు విద్యార్థులకు మూసుకుపోయాయి.

మరో సమస్య ఏమిటంటే సాంకేతిక పరిజ్ఞానం లేదా పరికరాలు అందరికీ అందుబాటులో లేకపోవడం. సమాజంలో అందరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో లేరన్నది వాస్తవం. ఇంటి నుంచి నేర్చుకునే పాఠాలు ఎంతవరకూ చదువును నేర్పుతున్నాయో, పిల్లలు బడితో పోలిస్తే ఎలాంటి మానసిక, భావనాత్మక, శారీరక అభివృద్ధిని కోల్పోతున్నారో ఉపాధ్యాయులు, అధికారులు గమనించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి సమస్యల పర్యవసానాలపైనా అధ్యయనం చేయాలి.

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..

విద్యార్థులు తమ స్నేహితుల పెన్సిల్‌, బ్యాగ్‌, పలక, పరీక్షలు రాసే అట్టలాంటి వస్తువులపట్ల ఆకర్షితులై, వాటికోసం తల్లిదండ్రుల దగ్గర మారాం చేసి అలాంటివో, అంతకన్నా మెరుగైనవో కొనిపించుకునేవారు. ఇప్పుడు వీడియో క్లాసులవల్ల- తమ స్నేహితులకు ఉన్న ఖరీదైన పరికరాలవంటివే కొనివ్వాలని విద్యార్థులు మారాం చేస్తే అంతగా ఆర్థికస్తోమత లేనివారు ఏం చేయగలరు? ప్రస్తుతం ఈ తరహా సాంకేతిక అంతరాలతో పేద విద్యార్థులు ఆత్మన్యూనతా భావానికి గురయ్యే అవకాశాలున్నాయి. దేశంలో ఎందరో పేద విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యను అందిపుచ్చుకొనే పరిస్థితుల్లో లేరని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలకు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ బోధన చేరడమనేది ఎప్పటికి సాధ్యమవుతుందో ఊహించలేని పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌ విద్యాబోధనలో భాగంగా అన్నివర్గాల విద్యార్థులకూ సాంకేతిక పరికరాలను, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీవీల ద్వారా బోధన విస్తృతస్థాయిలో నిర్వహించాలి. దానివల్ల పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. సాంకేతికత అందరికీ అందకపోతే- ధనిక, పేద అంతరాలు మరింత ఎక్కువవుతాయి. ఈ పరిస్థితులు పసి పిల్లల మనసులపై ఒత్తిడికి, క్షోభకు కారణమవుతాయి.

సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు మేలు చేస్తుందనేది నిర్వివాదాంశం. అయితే ఇది అన్ని వర్గాలకూ సమానంగా అందినప్పుడే ఆన్‌లైన్‌ బోధన లక్ష్యాలు నెరవేరతాయని ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ కొత్త విధానం పేద విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి కారణం కాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి.

- నీలిమ దొండపాటి (మనోవిజ్ఞానశాస్త్ర నిపుణులు)

ఇదీ చదవండి: కరోనా దెబ్బతో భారీగా తగ్గిన జేఈఈ హాజరు శాతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.