ETV Bharat / opinion

ఆరు దశాబ్దాల నాటి ప్లాన్​తోనే భారత్​పై చైనా గురి! - ఆరు దశాబ్దాల నాటి వ్యూహాన్నే అమలు చేస్తున్న చైనా!

1962 అక్టోబర్.. ఓ వైపు అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలోనే చైనా అదను చూసి భారత్​పై దాడి చేసింది. దిగ్గజ దేశాల మధ్య పోరు సమసిపోగానే కాల్పుల విరమణ అంటూ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కూడా తన విస్తరణవాదాన్ని కొనసాగించడానికి డ్రాగన్ దేశం ఇదే వ్యూహాన్ని పాటిస్తోంది. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే.. పొరుగుదేశాలపై కుయుక్తులు పన్నుతోంది. అయితే ఇదంతా చైనా ఒక్కరోజులో చేసింది కాదని నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రణాళికల్లోనే మునిగితేలుతోందని స్పష్టం చేస్తున్నారు.

China exploiting global war against coronavirus to harass India, others
ఆరు దశాబ్దాల నాటి వ్యూహాన్నే అమలు చేస్తున్న చైనా!
author img

By

Published : Jun 17, 2020, 4:29 PM IST

కరోనాపై సమరం... ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటి తొలి ప్రాధాన్యాంశం ఇదే. చైనా విషయంలో మాత్రం భిన్నం. 'ఆధిపత్యం' ఆకాంక్షలకే అగ్రాసనం వేస్తూ దురాక్రమణ అజెండా అమలు చేస్తోంది ఆ దేశం. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్నీ ఇందుకు అనువుగా మార్చుకుంటోంది. దేశీయ సమస్యలతో అగ్రరాజ్యం అమెరికా సతమతమం అవుతున్న వేళ... మరింత దూకుడు పెంచింది. భారత సరిహద్దులో ఉన్న పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కుయుక్తులు సాగిస్తోంది.

1962 వ్యూహం

సరిగ్గా 1962లో అవలంబించిన వ్యూహాన్నే చైనా తాజాగా అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో అమెరికా, రష్యా మధ్య క్యూబా సంక్షోభం తలెత్తిన సమయంలోనూ చైనా ఈ దుందుడుకు వైఖరే ప్రదర్శించింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద అణ్వాయుధ దేశాలు సంఘర్షణలో ఉంటే.. చైనా తన ప్రాదేశిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు కుటిల ప్రణాళికలు రచించింది.

క్యూబాలో క్షిపణుల మోహరింపు విషయమై అమెరికా, సోవియట్ యూనియన్​ల మధ్య ప్రారంభమైన వివాదం 1962 అక్టోబర్ 16న పూర్తి స్థాయి ప్రతిష్టంభనగా మారింది. ఇదే అదనుగా భావించి సరిగ్గా నాలుగు రోజుల తర్వాత భారత్​పై దాడికి పాల్పడింది చైనా. దీంతో అటు అమెరికా గానీ.. ఇటు సోవియట్​ గానీ భారత్- చైనా యుద్ధంలో జోక్యం చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి.

క్యూబాను నావికా దళంతో దిగ్బంధించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ 1962 అక్టోబర్ 22న ఆదేశాలు జారీ చేశారు. సోవియట్​ యూనియన్​తో జరిగిన విస్తృతమైన చర్చల ఫలితంగా అదే ఏడాది నవంబర్ 21న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ సమయంలోనే చైనా తన ప్రణాళికలను అమలు చేసింది. అక్టోబర్ 20న యుద్ధం ప్రారంభించిన డ్రాగన్​... నవంబర్​ 21న కాల్పుల విరమణ ప్రకటించింది.

అధ్యక్షుడి ఆదేశాలతోనే...!

ప్రస్తుత పరిణామాలన్నీ పరిశీలిస్తే ఇవన్నీ ఒక్కసారిగా జరిగినవి కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉన్నత స్థాయి నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి పక్కా ప్రణాళికతో చైనా సైన్యం రూపొందించిన ఎత్తుగడ అని చెబుతున్నారు.

"ఈ చొరబాట్లు, ప్రతిష్టంభన, ఘర్షణలు, ప్రాణనష్టం... ఇవన్నీ యాదృచ్ఛికంగా సంభవించినవి కాదు. ఉద్రిక్తతల స్థాయి, సమయం సహా ఇతర అంశాలు పరిశీలిస్తే.. పక్కా సమన్వయంతో చేసిన పని అని అర్థమవుతోంది. ఇది సరిహద్దులో జరుగుతున్న స్థానిక వివాదం కాదు. పైనుంచి సమ్మతి లేకుండా ఇంత భారీ స్థాయిలో ఘర్షణలు జరిగే అవకాశమే లేదు."

-విష్ణు ప్రకాశ్, భారత మాజీ రాయబారి

ఈ ఏడాది కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి పొరుగున ఉన్న అన్ని దేశాలతో చైనా అతిక్రమణలకు పాల్పడుతోందని గుర్తు చేశారు ప్రకాశ్.

అదను చూసి..

ఇలాంటి ఘర్షణలు రాజేయడానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయం చూస్తారని విశ్రాంత సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ దీపేంద్ర సింగ్ హుడా పేర్కొన్నారు. భారత్​లో నెలకొన్న కొవిడ్ సంక్షోభాన్నే చైనా అవకాశంగా మలచుకుందని అన్నారు.

"ఇంతటి భారీ ప్రణాళిక రచించినప్పుడు ప్రతి ఒక్కరు సరైన సమయం కోసం ఎదురుచూస్తారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులను సమీక్షిస్తారు. ప్రస్తుతం కరోనాతో పాటు, ఆర్థిక మందగమనానికి వ్యతిరేకంగా భారత్​ పోరాడుతోంది. కాబట్టి ఇదే మంచి సమయమని వారు భావించారు."

-లెఫ్టినెంట్ జనరల్(విశ్రాంత) డీఎస్ హుడా

భారతదేశం మాత్రమే కాకుండా చైనా విస్తరణవాద విధానం వల్ల పొరుగున ఉన్న చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు హుడా.

"చైనా ఎప్పుడూ రెండడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కి వేస్తూ వస్తోంది. ఇదే వారి ప్రధాన వ్యూహం. విస్తరణ వాదం విషయంలో చైనీయులు సుప్రసిద్ధులు. దక్షిణ చైనా సముద్రంతో పాటు ఆస్ట్రేలియా వంటి దేశాలతో వారు ప్రవర్తించిన విధానం ఇదే స్పష్టం చేస్తోంది."

-లెఫ్టినెంట్ జనరల్(విశ్రాంత) డీఎస్ హుడా

ఒక్కరోజులో జరిగింది కాదు

గత 5- 6 ఏళ్లుగా చైనా వ్యూహాత్మకంగా తన సాయుధ సంపత్తిని పెంచుకుంటోందని న్యూక్లియర్, స్పేస్ పాలసీ ఇనీషియేటివ్ హెడ్ డాక్టర్ రాజేశ్వరీ రాజగోపాలన్ పేర్కొన్నారు. పొరుగుదేశాలతో ఉన్న యథాతథ స్థితిని మార్చేందుకు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"వారు ఇదంతా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. గత 5- 7 ఏళ్లుగా టిబెట్​ సహా, భారత్- చైనా సరిహద్దులో 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ' సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. సమన్వయం పెంచుకోవడానికి ఎత్తైన ప్రదేశాల్లో ఎయిర్​ఫోర్స్​తో సంయుక్త విన్యాసాలు చేపట్టింది. చాలా కాలం నుంచే చైనా ఈ కసరత్తులు చేస్తోంది. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే ఇదే సరైన సమయం అని భావించింది. అమెరికా ప్రస్తుతం బలహీన దశలో ఉందని చైనా విశ్వసిస్తోంది. కాబట్టి వారిలో అతివిశ్వాసం, అహంకారం ఎక్కువైంది."

-డా.రాజేశ్వరీ రాజగోపాలన్, న్యూక్లియర్, స్పేస్ పాలసీ ఇనీషియేటివ్ హెడ్

ఈ సంవత్సర ప్రారంభం నుంచే తైవాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాలను చైనా లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు రాజేశ్వరి. అయితే ప్రతి ఒక్క దేశం చైనా విధానాల గురించి పూర్తి అవగాహనకు వచ్చాయని... వారికి గట్టి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

(రచయిత- కృష్ణానంద్ త్రిపాఠి)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.