ETV Bharat / opinion

మానవత్వానికి ఎసరు - corona news

కలి ప్రభావంతో మనిషి స్వభావం మారుతుందని భాగవతం చేసిన హెచ్చరిక నేడు నిజం అవుతోంది. ‘స్నేహపూరంబుతో ప్రకాశించి, మించె... మానవులు నిల్పికొన్న సమాజదీపము అది చెదరి చింది పంకిలమయినది’ అని రాయప్రోలు భయపడినట్లే జరుగుతోంది.

Declining humanity in humans
మానవత్వానికి ఎసరు
author img

By

Published : May 3, 2020, 9:31 AM IST

‘మీ నాగరీకులు ఒకపక్కనుండి ఆకాసాన్ని, సూరిచెంద్రులను సమస్త జీవరాసులను, వంకలను, వాగులను మాయం చేసుకొంటా పోతా ఉండారు. అడివికి ఆ పక్కనుండి నేను సంజీవినీ పుల్లతోని వాటిని బతికించుకొంటా వస్తా ఉండాను...’ అంటుంది గోపిని కరుణాకర్‌ ‘కళ్లేటి వంక’ కథలో ఓ పాత్ర. వ్యవస్థ విధ్వంసమే అసురశక్తుల ప్రవృత్తి. జీవం పోయడంపట్లే అమృతహస్తాలకు ఆసక్తి. కులం, మతం, ప్రాంతం, జెండా, అజెండా... ఆఖరికి ఒంటిరంగులు సైతం ఆయుధాలుగా ఈ సమాజాన్ని చీలికలు పేలికలు చేస్తూపోతాయి విఛ్చిన్నశక్తులు. మరోవైపునుంచి ‘మంచిచెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండె కులములు’ అన్న దృఢ నిశ్చయంతో ‘వర్ణభేదము లెల్లకల్లయి ఎల్లలోకము ఒక్క ఇల్లయి మేలం ఎరుగని ప్రేమబంధం’ వెల్లివిరియాలన్న స్ఫూర్తిని ప్రబోధిస్తారు వైతాళికులు. కత్తెర మాదిరి విడగొట్టడం మొదటిశక్తుల వృత్తి. సూదిలా కలిపి కుట్టడం రెండోవారికి తృప్తి. సమాజంలో ఈ రెండు ప్రవాహాలూ ఎప్పుడూ సమాంతరంగా పారుతూనే ఉంటాయి. మనం దేనిలో మునిగి ఉన్నామన్నది ప్రశ్న. ఆ రెండు శక్తుల్లో దేనితో చేతులు కలిపామన్నదే- మన వ్యక్తిత్వానికి గీటురాయి; మన సంస్కారాన్ని లోకానికి తేటపరచే ఇండుపకాయి. మనలో ఆ తేడాను తేల్చుకోవడం చాలా తేలిక. ‘కవితావధూటి వదనమ్మున కమనీయ రూపురేఖా విలాసాదులు’ గమనించి మురిసిపోవడం సహృదయ లక్షణం. అది రసజ్ఞతా గుణం. మరుక్షణంలో ‘రమ్యత తోచెగానినిది వ్రాసినవానిది యేకులమ్మొ’ అన్న ప్రశ్న బుర్రలో తొలిచిందా... సందేహం లేదు- అది కరోనా పాజిటివ్‌ లాంటిది. అలా కాకుండా మధునాపంతుల వారిలా ‘తత్‌ సుకవీశుండు ఒక వంశ హీనుడగుబో, జోడింతును అవ్వానికి, ఉత్సుకతన్‌ కేల్గవ’ అని అనిపిస్తే మాత్రం- తప్పుడు ఆలోచనలు లోనికి చొరబడలేదని అర్థం. మన దగ్గర సంజీవినీ పుల్ల ఉందని గుర్తు.

అలాంటి వైతాళికులతోను, ఆ సంజీవినీ పుల్లలతోను ప్రస్తుతం లోకానికి చాలా పని ఉంది. కలి ప్రభావంతో మనిషి స్వభావం మారుతుందని భాగవతం చేసిన హెచ్చరిక నేడు నిజం అవుతోంది. ‘స్నేహపూరంబుతో ప్రకాశించి, మించె... మానవులు నిల్పికొన్న సమాజదీపము అది చెదరి చింది పంకిలమయినది’ అని రాయప్రోలు భయపడినట్లే జరుగుతోంది. మతం ఏదైనా మంచితనాన్నే ప్రబోధించింది. మానవత్వాన్నే ప్రశంసించింది. పోనుపోను మతమౌఢ్యాలు కులదురభిమానాలు, ప్రాంతీయ భేదాలు సమాజాన్ని కలుషితం చేశాయి. బుద్ధి బురదలోకి ఈడ్చింది. ‘మనసు ఒకటై మనుషులుండి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్‌’ అన్న మహాకవుల ఆకాంక్ష మట్టిలో కలిసిపోయింది. బిహార్‌లోని ఖద్దు గ్రామంలోని అమానవీయ ఘటనే దీనికి తాజా ఉదాహరణ. అక్కడ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించేవారు కరోనా భయంతో తప్పుకొన్నారు. ఆ ఊరి మహిళా సర్పంచి మానవతా దృక్పథంతో ముందుకొచ్చి తానే స్వయంగా వండి క్వారంటైన్‌లో ఉన్న పిల్లలకు తెచ్చి పెట్టబోయింది. ఆకలితో మాడి చస్తాంగాని ఆమె వండినది తినమని కొందరు మొండికేశారట. కారణం... ఆమె దళిత మహిళ! తిరస్కరించినవారు పాఠశాల విద్యార్థులు. ఆ పసి గుండెల్లోనే ఇలాంటి విషబీజాలున్నాయంటే వాటి మూలాలెంత లోతైనవో మనం ఊహించుకోవచ్చు. ‘మతములన్నియు మాసిపోవును. మంచియన్నది నిల్చివెలుగును’ అన్నారు గురజాడ. మంచితనం, మానవత్వం ఆ మహిళ రూపంలో వెలుగులీనాయి. పిల్లల మూర్ఖత్వం వాటిని రాహువులా కమ్మేసింది. అన్నానికి ఆకలికి కూడా కులాన్ని ఆపాదించిన ఆ కుర్రాళ్లను చూసి కలిపురుషుడు సైతం విస్తుపోయుంటాడు. మంచితనమే కాదు, మనిషితనమూ కనుమరుగవుతోంది ఇప్పుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.