ETV Bharat / opinion

ఆ దేశాల నుంచి భారత్​ నేర్వాల్సిన పాఠాలివే... - corona latest nes

కరోనా మహమ్మారి దాదాపు అన్ని దేశాలపై తన ప్రభావాన్ని చూపించింది. మహమ్మారిని నియంత్రించడంలో విజయవంతమైన అనేక దేశాలు భారత్​కు కొన్ని పాఠాలు బోధిస్తున్నాయి. వాటి గురించి విశ్లేషించారు పబ్లిక్​ హెల్త్​ ఫౌండేషన్​ ఆఫ్​ ఇండియా(పీహెచ్​ఎఫ్​ఐ) సీనియర్​ శాస్త్రవేత్త ప్రియా బాలసుబ్రమణ్యం.

COVID-19 Management lessons in health system preparedness for India from its regional neighbours
ప్రపంచం నుంచి భారత్​ నేర్చుకోవాల్సిన పాఠాలివే...!
author img

By

Published : Aug 21, 2020, 4:12 PM IST

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రతి దేశం వైద్య వ్యవస్థ సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందనే నిజాన్ని తెలుసుకున్నాయి. కొవిడ్​-19ను గుర్తించాక ఆ వ్యాధిని ఎదుర్కోవడం కోసం ఒక్కో దేశం ఒక్కో రకమైన ప్రణాళికతో ముందుకెళ్లాయి. అంతర్జాతీయ, దేశీయ ప్రయాణాలపై ఆంక్షలు, విద్యాసంస్థల మూసివేత, బహిరంగ సభలపై నిషేధం, క్వారంటైన్​ అమలు, చేతులు కడుక్కోవడం, మాస్క్​ ధరించడం వంటి నిబంధలు పాటించాయి. వీటితో పాటు అనేక దేశాలు గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఆచరించడం వల్ల తొందరగా వైరస్​ నుంచి బయటపడ్డాయి. ఫలితంగా పాఠాలు నేర్వని దేశాలతో పోలిస్తే వీటిల్లో కరోనా సంక్రమణ రేటులో మార్పులు, మహమ్మారి పెరుగుదలలో వ్యత్యాసం, సామాజిక, ఆర్థిక వ్యయాలలో తేడాలు కనిపించాయి.

స్వల్ప, దీర్ఘకాలంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆరు సూత్రాలను సిఫార్సు చేసింది.

1. ప్రజారోగ్య ఆరోగ్య సంరక్షణ కోసం శిక్షణ ద్వారా శ్రామిక శక్తిని పెంచుకోవాలి.

2. ప్రతి అనుమానాస్పద కేసును కమ్యూనిటీ స్థాయిలోనే గుర్తించేలా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి.

3. వైద్య పరీక్షలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు టెస్టింగ్​ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

4. రోగులకు చికిత్స, ఐసోలేట్​ చేయడానికి సదుపాయాలు కల్పించుకోవాలి.

5. కాంటాక్ట్​లను క్వారంటైన్​ చేయడానికి పక్కా ప్రణాళిక, ప్రక్రియ ఉండాలి.

6. మరణాలను తగ్గించడానికి అత్యవసర ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి.

ఈ సూత్రాలను పాటించడమే కాకుండా స్వప్రణాళికలతో దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని చాలా దేశాలు కొవిడ్-19 నియంత్రణలో బాగా విజయవంతం అయ్యాయి. ఆయా దేశాలు భారత్ లాంటి పెద్ద దేశాలకు కొన్ని పాఠాలను సూచిస్తున్నాయి. ఓసారి వాటి గురించి చూద్దాం.

సింగపూర్​ అద్భుత పోరాటం...

పట్టణ ప్రాంతాల్లో కరోనా కట్టడిలో సింగపూర్​ మనకు మార్గనిర్దేశం చేస్తోంది. కొవిడ్-19 కేసు రాగానే వెంటనే తేరుకున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఫిబ్రవరి ఆరంభంలోనే మొదట కేసు రాగా.. మే-జూన్ నాటికి ఆసియాలో ఎక్కువ కేసులు ఉన్న దేశంగా నిలిచింది. అయితే ఇటీవలే పాజిటివ్​ కేసులు 55 వేలకు దాటగా.. వాటిల్లో 51వేల మందికి పైగా కోలుకోవడం విశేషం. 27 మంది మాత్రమే చనిపోయారు. అయితే కరోనాను అద్భుతంగా కట్టడి చేయడంలో ఈ దేశం పాటించిన కొన్ని అంశాలు కీలకపాత్ర పోషించాయి. అవేంటంటే..

ప్రభుత్వ ప్రతిస్పందన:

గతంలో సార్స్​ సమయంలో నేర్చుకున్న అనుభవాలు ఇప్పుడు బాగా పనిచేశాయి. ఫలితంగానే కొవిడ్​ నియంత్రణలో వెంటనే ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారీగా నిధులు వెచ్చించింది అక్కడి ప్రభుత్వం. ఆరోగ్య కార్యకర్తలను సిద్ధం చేయడం, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం భారీ మొత్తాలను ఖర్చుచేసింది.

శాఖల మధ్య సహకారం...

కరోనాపై పోరాటంలో సింగపూర్​ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పోలీస్ విభాగాలు సంయుక్తంగా పనిచేశాయి. కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరం అమలు, చేతులు కడుక్కోవడం, మాస్క్​ ధరించడం వంటి వాటిపై పర్యవేక్షణ చేశాయి.

కరోనా టెస్టులు పెంచేందుకు పబ్లిక్​ హెల్త్​ క్లినిక్​లను ఉపయోగించుకుంది ప్రభుత్వం. అలా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంది. ప్రతి పౌరుడిని పరీక్షించడం సాధ్యం కాదు. అలా చేస్తే ల్యాబ్​లపై భారం పడుతందని గమనించిన ఆ దేశం.. వ్యాధి తీవ్రత ఎక్కువగా రోగులను త్వరగా గుర్తించడం, పరీక్షించడంపై దృష్టి పెట్టింది. తొలుత దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ప్రొవైడర్లతో ఏర్పాటైన 1000 ప్రజారోగ్య క్లినిక్​లను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక సంరక్షణ వైద్యులకు అదనపు శిక్షణ ఇచ్చి వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించింది. దూకుడుగా మహమ్మారిపై పోరాడుతూనే... క్వారంటైన్​ లక్ష్యాలను పక్కాగా అమలు చేసింది.

ముప్పును తట్టుకొని...

భారత్​లాగే సింగపూర్​కు విదేశీ వలసకూలీల ముప్పు ఏర్పడింది. వారి కారణంగా భారీగా కరోనా పాజిటివ్​ కేసులు వచ్చాయి. తొలుత వారందరినీ ఐసోలేట్​ చేయలేకపోయింది. అప్పుడు పరీక్షల సంఖ్య పెంచి, వారందరి కోసం ప్రత్యేకమైన క్వారంటైన్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వైరస్​ నిర్ధరణ అయిన వారినే కాకుండా వారిని కలిసిన వారందరినీ ఐసోలేషన్​లో ఉంచింది. అలా కరోనా వైరస్​ వ్యాప్తిని నియంత్రించింది. ప్రజా వైద్య వ్యవస్థ సాయంతో పారదర్శకంగా సేవలు అందించింది. జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన వాట్సాప్​ గ్రూప్​లను ఏర్పాటు చేసి.. వాటి సాయంతో ప్రజలకు నిరంతరం కచ్చితమైన సమాచారాన్ని అందించింది.

ఫ్రంట్​లైన్​ వర్కర్లకు మద్దతుగా ఉండేందుకు కార్మికులు, ఇతర సిబ్బంది, ఆరోగ్యేతర రంగాలకు చెందిన వలంటీర్ల సాయాన్ని తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఫ్రంట్‌లైన్ సిబ్బందిని ఒకతాటిపైకి తెచ్చింది. అలా ఆరోగ్య సంరక్షణ కోసం శ్రామిక శక్తిని విపరీతంగా పెంచుకోగలిగింది.

వియత్నాం పెద్ద దేశాలకు ధీటుగా..

కరోనా వైరస్​పై వేగంగా స్పందించడంలో పెద్ద దేశాల కంటే విజయవంతమైంది వియత్నాం. ఏప్రిల్ మధ్యలో కేవలం దేశంలోకి వస్తోన్న విదేశీ ప్రయాణికుల నుంచి తప్ప కేసులు నమోదుకాలేదు. అంత బాగా కరోనాను గుర్తించి, నియంత్రించగలిగింది. అయితే ఇటీవలే స్థానికుల్లోనూ ఈ వైరస్​ లక్షణాలు మళ్లీ కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వియత్నాం కరోనా కట్టడి వ్యూహంలో మాత్రం ప్రజాసహకారంతో బాగా విజయం సాధించింది.

కేసులు నమోదైన ప్రారంభంలోనే ఆర్థిక సమస్యల కంటే ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం అని చెప్పారు ఆ దేశ ప్రధానమంత్రి. వియత్నాంలో కరోనా నివారణపై జాతీయ స్టీరింగ్ కమిటీ సాయంతో జాతీయ ప్రతిస్పందన ప్రణాళికనూ తక్షణమే విడుదల చేశారు. వైరస్​కు వ్యతిరేకంగా పౌరులను ఏకం చేయడంలో ప్రభుత్వం సఫలమైంది. సైనిక, ప్రజా భద్రతా సేవలు, స్థానిక సంస్థల సహాయంతో నియంత్రణ, ఉపశమనం చర్యలను వేగంగా అమలు చేసింది.

ర్యాపిడ్ కంటెయిన్​మెంట్​:

కఠినమైన ఆంక్షలతో పాటు విమానాశ్రయంలో ఆరోగ్య పరీక్షలు, భౌతిక దూరం, విదేశీ సందర్శకులపై ప్రయాణ నిషేధాలు, అంతర్జాతీయ రాకపోకలకు 14 రోజుల నిర్బంధ కాలం, పాఠశాలలు బంద్, ప్రజావేడుకలు రద్దు చేయడంపై వెంటనే నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పకముందు నుంచే బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో మాస్క్​లు ధరించడం, శానిటైజర్లు వాడటాన్ని తప్పనిసరి చేశారు. దేశవ్యాప్తంగా అత్యవసరం కాని సేవలన్నీ రద్దు చేశారు. షట్​డౌన్​ ప్రకటించడమే కాకుండా జనసంచారంపై కఠిన ఆంక్షలు విధించారు.

ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే నియంత్రణ:

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలన్నీ ఖరీదైన సామూహిక పరీక్షా వ్యూహాలను ప్రయత్నిస్తే.. వియత్నాం అత్యవసర, అనుమానాస్పద కేసులపై దృష్టి సారించింది. వైద్య పరీక్షల సామర్థ్యాన్ని పెంచింది. సార్స్​ వ్యాప్తి నుంచి నేర్చుకున్న అనుభవాల ఆధారంగా హాట్​స్పాట్లలో సామూహిక నిర్బంధాన్ని అమలు చేసింది. ప్రతి పాజిటివ్​​ నిర్ధరణ కేసుకు దాదాపు 1,000 మందిని పరీక్షించారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక నిష్పత్తి.

వైరస్​ సోకిన వ్యక్తిని గుర్తించిన వెంటనే, అతన్ని లేదా ఆమెను విశ్వవిద్యాలయ వసతిగృహం, సైనిక బ్యారక్స్​లలో ఉంచారు. వారిపై ప్రభుత్వ వర్గాలే పర్యవేక్షణ చేశాయి. వైరస్​ సోకిన వ్యక్తితో పాటు వారి సన్నిహితులను క్వారంటైన్​కు తరలించారు. ఆ సమయంలో వారిలో లక్షణాలు కనిపించనప్పటికీ ఆయా కేంద్రాల్లోనే నిర్బంధంలో ఉండేలా ఆదేశాలిచ్చారు. కాంటాక్ట్​ ట్రేసింగ్​, ఐసోలేషన్​, క్వారంటైన్​ను దాదాపు మూడో లెవల్​ కాంటాక్ట్​ల వరకు పరీక్షించేవారు. సామాజిక సంక్రమణను అడ్డుకునేందుకు కేసులు వచ్చిన వీధి, గ్రామం, ప్రాంతంపై ఆంక్షలు పెట్టారు. ఆ సమయంలో అందరికీ టెస్టులు నిర్వహించారు.

దాదాపు దేశవ్యాప్తంగా 4,50,000 మందిని క్వారంటైన్​ చేశారు. ఆసుపత్రులు, ప్రభుత్వం నిర్వహించిన క్వారంటైన్​ కేంద్రాలు, సెల్ఫ్​ ఐసోలేషన్​ ద్వారా వీరంతా నిర్బంధంలో ఉన్నారు. ఎప్పటికప్పుడు వైరస్​ గురించి పక్కా సమాచారం ప్రజలకు అందించేవారు.

ప్రారంభ దశ నుంచే వైరస్ గురించి సమాచారం వెల్లడి పారదర్శకంగా ఉండేది. కరోనా సోకిన వారి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టెస్టింగ్ కేంద్రాల గురించి సమాచారాన్ని మీడియా, ప్రభుత్వ వెబ్‌సైట్లు, ప్రభుత్వ స్థానిక సంస్థలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, మార్కెట్లలో ప్రకటనలు చేసేవారు. మొబైల్ ఫోన్‌ల సంక్షిప్త సందేశాలు చేరవేయడం వల్ల సమాచారంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. సమాజంలో రక్షణ, నియంత్రణ చర్యలకు ప్రజలంతా కట్టుబడి ఉండటానికి సహాయపడింది. ప్రతి పౌరుడు మాస్క్​ వేసుకోవడం, అనుమానిత లక్షణాలు ఉంటే స్వీయ నిర్బంధం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించారు.

శ్రీలంక భళా...

భారత్​కు బాగా దగ్గరగా ఉన్న దేశం శ్రీలంక. చాలా చిన్న ద్వీపం అయినా పెద్ద మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయగలిగింది. శ్రీలంకలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆసియా ఖండంలో మెరుగైన స్థానంలోనే ఉంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, అర్హత కలిగిన వైద్య సిబ్బంది, స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేసే ప్రజారోగ్య ఇన్స్పెక్టర్ల సహాయంతో ఈ వైరస్​పై అద్భుతమైన పోరాటం చేసిందీ దేశం.

సామూహిక వ్యాప్తి నియంత్రణకు సంస్థాగత సామర్థ్యం లేకపోవటం వల్ల దేశ సైన్యం రంగంలోకి దిగింది. క్వారంటైన్​ కేంద్రాల పర్యవేక్షణ, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి కీలకమైన బాధ్యతలను భుజాలకెత్తుకుంది. పోలీసులు కర్ఫ్యూను అమలు చేస్తూ, ఉల్లంఘనలకు పాల్పడేవారిని అరెస్టు చేసేవారు.

కరోనా కేసులు వచ్చాక విదేశీ విమాన సర్వీసులను నిలిపివేసిన లంక ప్రభుత్వం.. మార్కెట్లు, ప్రజా రవాణా స్టేషన్లలో క్రమం తప్పకుండా శానిటైజేషన్​ చేయడం వంటి చర్యలు చేపట్టింది.

శ్రీలంక నుంచి భారత్​ నేర్చుకోవాల్సిన రెండు పాఠాలున్నాయి.

వ్యాధిపై పర్యవేక్షణ కోసం వ్యవస్థ.

గతంలో వచ్చిన పలు వ్యాధుల నుంచి శ్రీలంక పాఠాలు నేర్చుకుంది. అందుకే బలమైన ప్రజారోగ్య పర్యవేక్షణ వ్యవస్థలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలో మంచి ఫలితాలను రాబట్టింది. 2020 ప్రారంభంలోనే ఓపెన్ సోర్స్ DHIS2 ప్లాట్‌ఫాం ఆధారంగా ఒక నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసింది లంక. జనవరిలో మొదటి కేసును గుర్తించిన వెంటనే ఈ వ్యవస్థ ఆధారంగా మహమ్మారి కదలికను నిశితంగా పరిశీలించింది. దీని సాయంతో కరోనా అనుమానితులను కచ్చితంగా గుర్తించగలిగింది.

శ్వాసకోశ అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రజారోగ్య పర్యవేక్షణను పటిష్ఠం చేసింది. ఒకసారి కేసును గుర్తించిన తర్వాత దానికి సంబంధించిన వైద్య పరీక్షలు, ఇతర అంశాలను ప్రభుత్వమే చూసుకుంది. అలా కరోనా నియంత్రణలో పట్టు సాధించింది.

ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థపైనే ఆధారపడటం..

భారత్​ నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఇదే. కరోనా సమయంలో లంక ప్రభుత్వం ఎక్కువగా ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను ఉపయోగించుకుంది. క్లినిక్​లను మూసివేసింది. బాధితులు ఉన్న ఇళ్లకే వెళ్లి పరీక్షించి, వెంటనే మందులు పంపిణీ చేసేవారు. కొవిడ్​-19 లేని రోగుల కోసం ప్రత్యేకమైన హాట్​లైన్​ను పారంభించింది అక్కడి ప్రభుత్వం. ఏదైనా వైద్య సహాయం అవసరమైనతే వారికి ఈ వేదిక ద్వారా పరిష్కారం సూచించేవారు హెల్త్​కేర్​ వర్కర్లు.

కొవిడ్​-19 సమయంలో ఆరోగ్య సంరక్షణ, వ్యాధి సంబంధిత సవాళ్లను గుర్తించడం, వాటికి ప్రతిస్పందించడానికి చాలా మంది అవసరం. అందుకు కరోనాపై అవగాహన, సమన్వయం కలిగిన బృందాలతో వ్యాధి వ్యాప్తిని ఎదుర్కోవడమే సులభమని లంక గుర్తించింది. వాళ్ల సాయంతోనే జనాలకు ఆరోగ్య సేవలను అందించేందుకు పకడ్బందీ వ్యూహాలను రూపొందించింది. ప్రాథమిక స్థాయిలోనే వ్యవస్థ ఉండటం వల్ల వైద్యులు, నర్సులు వంటి వైద్య సంరక్షణ వ్యవస్థపై భారం తగ్గింది.

ఈ మూడు దేశాల విధానాలను భారతీయ రాష్ట్రాలు తదుపరి దశల్లో పాటిస్తే.. మరింత వేగంగా వైరస్​ ముప్పు నుంచి తప్పించుకోగలం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.