ETV Bharat / opinion

కరోనాపై పోరు: ప్రజల ప్రాణాలా? ఆర్థిక వ్యవస్థా? - కరోనా తెలుగు

కరోనా కట్టడి కోసమని లాక్​డౌన్​ విధిస్తే ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. అలాగని ఆంక్షలు సడలిస్తే వైరస్​ విజృంభిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న సవాలు ఇది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ప్రగతి రథం ప్రయాణం ఆగకుండానే ప్రజారోగ్యాన్ని కాపాడడం ఎలా?

Covid-19: A hard choice between saving lives and saving economy
'ప్రజల ప్రాణాలా? ఆర్థిక వ్యవస్థా? సమన్వయమే ప్రధానం!'
author img

By

Published : Jul 3, 2020, 1:22 PM IST

లాక్​డౌన్... కరోనా నియంత్రణకు దాదాపు అన్ని దేశాలు ఎంచుకున్న మార్గం. కానీ... జనజీవనాన్నే స్తంభింపచేసిన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. విధిలేని పరిస్థితుల్లో మళ్లీ ఈ నిబంధనలను సడలించాయి ఆయా దేశాలు. ఇక అప్పటినుంచి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం భారత్​లోనూ ఇదే పరిస్థితి. ఐదు విడతల లాక్​డౌన్ తర్వాత జూన్ 8 నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే విధంగా సడలింపులు ఇచ్చింది మోదీ ప్రభుత్వం. అన్​లాక్​ వల్ల ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభమై, ఆదాయాలు పెరిగాయి. జూన్​లో జీఎస్టీ వసూళ్లు కరోనాకు ముందున్న స్థాయిలో నమోదయ్యాయి. కానీ... అదే సమయంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల నుంచి ఆరు లక్షలకు ఎగబాకింది.

అన్​లాక్​ ప్రభావమెంత?

లాక్​డౌన్ ఎత్తివేయడం వల్ల ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగే అవగాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా విషయంలో ఏదైనా ఉపాయం ఆలోచించనిదే ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించలేమని కొంత మంది ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో అన్​లాక్​ చర్యలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

"కరోనాకు శాస్త్రీయ సమాధానాలు కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ లోగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్​ వ్యాప్తి నియంత్రణ, ప్రజల జీవనోపాధి పరిరక్షణ మధ్య సమతుల్యమే అసలు సవాలు."

-ఆర్ గాంధీ, ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్

కరోనా కేసులు వందల్లో ఉన్నప్పుడే మోదీ ప్రభుత్వం దేశంలో కఠినమైన లాక్​డౌన్​ను విధించింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ఈ సమయంలో వ్యాపారాలు అపార నష్టాన్ని మూటగట్టుకున్నాయని జీఎస్టీ వసూళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 ఏప్రిల్​లో జీఎస్టీ వసూళ్లు రూ.1,13,866 కోట్లుగా ఉంటే ఈ సంవత్సరం ఏప్రిల్​లో ఈ సంఖ్య రూ.32,294 కోట్లకు పడిపోయింది. అంటే గతేడాదితో పోలిస్తే 72 శాతం(రూ. 81,572 కోట్లు) తగ్గుదల నమోదైంది.

అయితే తర్వాత ప్రభుత్వం క్రమంగా నిషేధాలను సడలించడం వల్ల వసూళ్లు పెరిగాయి. మే నెలలో రూ. 62,009 కోట్లు, జూన్​లో రూ. 90,917 కోట్ల వస్తుసేవల పన్ను వసూలైంది. గతేడాది జూన్​తో పోలిస్తే ఈ సంఖ్య 9 శాతం తక్కువ. దీన్ని బట్టి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కొవిడ్ పూర్వ స్థితికి వచ్చినట్లు అర్థమవుతోంది.

పంజా విసిరిన కరోనా

ఆర్థిక వ్యవస్థ ఎలాగున్నా... ఈ సమయంలో కరోనా కేసులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. వరల్డ్​ఓమీటర్​ ప్రకారం జూన్ 1న దేశంలో 1,98,370 యాక్టివ్ కేసులు ఉండగా.. ఈ సంఖ్య జూన్ 15 నాటికి 3,43,026కి పెరిగింది. 15 రోజుల్లోనే 1,44,656 కేసులు అదనంగా నమోదయ్యాయి.

జూన్ 26న దేశంలో 5 లక్షల మార్క్​ను దాటిన కేసులు జులై 1 నాటికి 6 లక్షలకు చేరుకున్నాయి. జూన్ 1 నుంచి జులై 1 మధ్య ఏకంగా నాలుగు లక్షల కేసులు నమోదయ్యాయి. అత్యధిక కరోనా కేసులున్న ప్రపంచదేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

దీర్ఘకాల వ్యూహాలు

అన్​లాక్​ ప్రారంభమైన తర్వాత ప్రజల్లో కాస్త అజాగ్రత్త పెరిగిందని, సామాజిక దూరం తప్పకుండా పాటించాలని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్​ వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి దీర్ఘకాలం పాటు ఈ మహమ్మారి కొనసాగే అవకాశం ఉందని ప్రభుత్వం సైతం అంచనాలు వేసుకుంటోందని అర్థమవుతోంది.

జూన్​ వరకు దేశంలోని మూడింత రెండొంతుల జనాభాకు ప్రయోజనం కలిగేలా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్చిలో సంక్షేమ పథకాలు ప్రకటించారు. జూన్​ నాటికి కరోనాను అదుపు చేయగలుగుతామని ప్రభుత్వం తొలుత భావించినట్లుంది. కానీ ప్రస్తుతం నవంబర్​ వరకు ఉచిత రేషన్​ను అందిస్తామని ప్రకటించడాన్ని బట్టి చూస్తే కరోనాపై దీర్ఘకాల పోరుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది.

సమన్వయమే ముఖ్యం

ఈ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటమే కాకుండా జీవనోపాధిపై ప్రభావం పడకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండింటి మధ్య సమన్వయం పాటించాలని స్పష్టం చేస్తున్నారు.

"ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే కొందరు అడ్డుచెప్పవచ్చు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. కానీ ప్రస్తుతమనున్న సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం లేదు కాబట్టి ఇవేవీ సరైన విధానాలు కావు. ప్రజల ఆరోగ్యం, జీవనోపాధిని కాపాడేందుకు అధికారులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాం. ఆ నిర్ణయాలను మనమంతా అంగీకరించాలి."

-ఆర్​ గాంధీ, ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్

(రచయిత-కృష్ణానంద్ త్రిపాఠీ)

ఇదీ చదవండి- ఈ విషయాల్లో మౌనమే ట్రంప్ కొంప ముంచుతోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.