ETV Bharat / opinion

'ఒకే సరిహద్దు- ఒకే సైన్యం విధానం మనకూ అవసరం'

author img

By

Published : Jun 17, 2020, 6:55 PM IST

భారత్​- చైనా వివాదం పరిష్కారం కోసం రెండు దేశాలు కలిసి సరిహద్దు నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై సమీక్ష నిర్వహించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్​ హుడా. మరోవైపు సరిహద్దులో లోపాలను భారత్​ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. నియంత్రణ రేఖ వద్ద కొనసాగుతున్న విధానాన్నే... వాస్తవాధీన రేఖ వద్దా ప్రవేశపెట్టాలని చెబుతున్నారు.

how to deal with china
'ఒకే సరిహద్దు- ఒకే సైన్యం విధానం మనకూ అవసరం'

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యం.. భారత జవానులతో హింసాత్మకంగా తలపడటం వల్ల సరిహద్దులో పరిస్థితి వేడెక్కింది. ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా ఈ విషయంపైనే ఉంది.

సరిహద్దులో పరిస్థితిపై చాలా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే దీని పరిష్కారానికి సరిహద్దు నిర్వహణకు సంబంధించిన విధానాలపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి దిద్దుబాటు చర్యలు చేపడితేనే ఫలితం లభిస్తుంది.

అతిక్రమణలతో సంక్షోభం

సరిహద్దులో చైనా అతిక్రమణలకు పాల్పడటం కొత్తేం కాదు. 2019లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యం మొత్తం 663 సార్లు అతిక్రమణలకు పాల్పడింది. ఈ సంఖ్య 2018(404)తో పోలిస్తే ఎక్కువ. 1975 నుంచి ఈ ప్రాంతంలో ఒక్క తూటా పేలలేదని చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. ఇటీవలి కాలంలో సరిహద్దులో పెరిగిన సంఘర్షణలు ఇరుదేశాల సంయమనంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో అనాలోచిత సంక్షోభ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.

ఒకే సరిహద్దు-ఒకే సైన్యం

ఇటు.. భారత్​ విషయానికొస్తే రెండు భద్రతా దళాలు ఒకే సరిహద్దులో విధులు నిర్వర్తించడం వల్ల పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. జాతీయ భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి కీలక విషయాలపై కార్గిల్ సమీక్ష కమిటీ తర్వాత ఏర్పాటైన మంత్రివర్గ బృందం సైతం ఇదే విషయం స్పష్టం చేసింది. మంత్రివర్గం నిర్వహించిన అధ్యయన ఫలితాలను ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.

"ప్రస్తుతం రెండు భద్రతా దళాలు ఒకే సరిహద్దు వద్ద పనిచేస్తున్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో నియంత్రణ, అధికారం కోసం ఘర్షణ తలెత్తుతోంది. ఒకే సరిహద్దులో బహుళ సైన్యం ఉండటం వల్ల భద్రతా దళాల్లో జవాబుదారీతనం లోపిస్తోంది. జవాబుదారీతనం తీసుకురావడానికి సరిహద్దు వద్ద దళాలను మోహరించేటప్పుడు 'ఒకే సరిహద్దు-ఒకే సైన్యం' సూత్రాన్ని అవలంబించాలి."

-మంత్రివర్గ బృందం సిఫార్సులు

ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యంతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) దళాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. గస్తీ, నిఘా, చొరబాట్లను అడ్డుకోవడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సరిహద్దు నియంత్రణ బాధ్యతలను ఐటీబీపీకి అప్పగించినప్పటికీ.. చొరబాట్లను అడ్డుకునే విషయాల్లో సైన్యం ముందుంటోంది. గతంలో జరిగిన డెప్సాంగ్​, చూమర్, డోక్లాం సహా తాజాగా నెలకొన్న ప్రతిష్టంభనలో సైన్యమే ప్రధానంగా వ్యవహరించింది. వివాదాల పరిష్కారమైనా, వేడుకలైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఏ సమావేశం జరిగినా.. భారత్​ తరపున సైనిక అధికారులే పాల్గొంటున్నారు.

సైన్యం నియంత్రణలోనే ఐటీబీపీ

ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంట ఉన్న ఈ రెండు బృందాలు వేర్వేరు మంత్రిత్వ శాఖలకు నివేదిస్తాయి. ఐటీబీపీ హోంశాఖ అధీనంలో ఉండగా.. సైన్యం రక్షణ శాఖ అధీనంలో ఉంటుంది. రెండు బలగాలకు వేర్వేరు ప్రణాళికలు ఉంటాయి.

అయితే... సమస్యాత్మక సరిహద్దు బాధ్యతలు ఎప్పుడూ సైన్యం చేతిలోనే ఉండాలి. కఠినమైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం సైన్యానికి ఉంటుంది. ఐటీబీపీని సైన్యం నియంత్రణలో ఉంచాలి. నియంత్రణ రేఖ వద్ద ఎప్పటినుంచో ఇలాంటి వ్యవస్థే కొనసాగుతోంది. ప్రధాన విధులను సైన్యం నిర్వరిస్తే.. సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) సైన్యం నియంత్రణలో పనిచేస్తూ వస్తోంది.

నిఘా కష్టం

వాస్తవాధీన రేఖ ప్రాంతంలో ఉన్న కఠిన పరిస్థితులు, రహదారులు లేకపోవడం వల్ల ఇక్కడ నిరంతరం నిఘా ఉంచడం కష్టమైపోతోంది. ఉదాహరణకు... అరుణాచల్ ​ప్రదేశ్​లోని టుటింగ్ ప్రాంతంలో చైనా 1.25 కిలోమీటర్ల రహదారి నిర్మించినట్లు 2018 జనవరిలో ప్రభుత్వానికి సమాచారం అందింది. అదీ స్థానిక యువత చెప్పడం వల్లే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దుపై సమగ్ర నిఘా ఉండేలా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి.

సరిహద్దు దాటకుండా చూడాలి

రాడార్లు, విస్తృత పరిధి ఉన్న కెమెరాలు, రేడియో పర్యవేక్షణ పరికరాలను ఉపయోగించి సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయాలి. గగనతలంలో మానవ సహిత, మానవ రహిత విహంగాలతో వైమానిక నిఘా ఉండేలా చూడాలి. శాటిలైట్​ ఇమేజింగ్​ను ఉపయోగించి వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక దళాల కదలికలను నిరంతరం గమనించాలి. తద్వారా శత్రు దేశాల చర్యలను గుర్తించి ప్రతిస్పందించే సమయం దొరుకుతుంది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటి వచ్చాయంటే ప్రస్తుతం పాంగొంగ్ సో ప్రాంతంలో నెలకొన్నట్లు కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి.

సమీక్ష అవసరం

ఈ సమయంలోనే సరిహద్దు నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను సమీక్షించుకోవడం అత్యవసరం. సరిహద్దులో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించి భారత్​- చైనా నూతన విధివిధానాలు రూపొందించుకోవాలి. వాస్తవాధీన ప్రాముఖ్యాన్ని కాపాడుకుంటూనే.. ఘర్షణాత్మక ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి. ఇరుదేశాల మధ్య ఇప్పటికే చాలా ఒప్పందాలు జరిగాయి. నిగ్రహం పాటించడం, సైన్యాన్ని ఉపయోగించకపోవడం, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండటమే వీటన్నింటి సారాంశం. ఇవన్నీ పూర్తిగా విఫలం కాకపోయినా.. ఈ ఒప్పందాలను విస్మరించే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. సైనిక విధానాల్లో కాకుండా.. ఒకరినొకరు దూషించుకోవడం, పరస్పరం దాడులు చేసుకోవడం వంటి అనాలోచిత వైఖరి ఎక్కువైంది.

లోపాలపై భారత్ దృష్టిపెట్టాలి

ఈ నేపథ్యంలో వివాదాస్పద ప్రాంతాల్లో గస్తీకి సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించుకునే దిశగా ఇరుదేశాలు అడుగులు వేయాలి. కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడిగా పెట్రోలింగ్ నిర్వహించడం, మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్​ను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి విధానాలు పాటించాలి. ఇరుదేశాలు అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన నిర్ణయానికి రాకపోవచ్చు. కానీ, రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తగ్గితే.. వాస్తవాధీన రేఖ వద్ద శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది.

సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఉంటే రెండు దేశాలకు నష్టమే. అయితే చైనా సైన్యం మన సరిహద్దు నిర్వహణలో లోపాలను సొమ్ము చేసుకోకుండా ఉండలేదు. అందువల్ల ఈ లోపాలను భారత్ సాధ్యమైనంత త్వరగా సవరించుకోవాలి.

(రచయిత- విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా, ఉత్తర ఆర్మీ మాజీ కమాండర్)

ఇదీ చదవండి: ఆరు దశాబ్దాల నాటి ప్లాన్​తోనే భారత్​పై చైనా గురి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.