ETV Bharat / opinion

మోహన్​దాస్​ను మహాత్ముడిని చేసి.. సత్యాగ్రహానికి స్ఫూర్తిగా నిలిచి.. - కస్తూర్బా గాంధీ బయోగ్రఫీ

Azadi Ka Amrit Mahotsav: ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే నిర్బంధం... అడగకుండా ఎటు వెళ్లావనే గద్దింపు... ఎటు వెళ్లినా అనుమతి తీసుకోవాలనే షరతు... ఇలా అహంకార మోహన్‌దాస్‌ నుంచి అసాధారణ మహాత్ముడయ్యే దాకా.. ఎన్నో అవతారాల్ని చూసి, భరించి, సహించి.. అర్థం చేసుకొని ఎన్నో త్యాగాలతో తన వెనకాల ధైర్యంగా నిలబడిన ఆమె నుంచి ఆయన నేర్చుకున్నదే సత్యాగ్రహం! అలా నేర్చుకున్న శిష్యుడు గాంధీజీ... మౌనంగా నేర్పిన గురూజీ కస్తూర్బా!

KASTURBA GANDHI
KASTURBA GANDHI
author img

By

Published : Aug 9, 2022, 4:55 PM IST

Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులపై పోరాటంలో గాంధీజీ గురించి, ఆయన పడ్డ కష్టాలు, చేసిన ప్రయోగాలు, వినూత్న ఉద్యమాల గురించి విని జేజేలు కొట్టింది...కొడుతోందీ ప్రపంచం. కానీ ఇవన్నీ సజావుగా సాగటానికి సహకరించి... దక్షిణాఫ్రికా నుంచి భారత్‌లోని జైళ్ల దాకా అన్నింటా అండగా నిలిచిన అసాధారణ మహాత్మురాలు కస్తూర్బా! మోహన్‌దాస్‌ నుంచి మహాత్ముడి దాకా గాంధీ పరిణామక్రమంలో ఆమె పాత్ర అద్వితీయమైంది. గాంధీజీ చేసిన ఎన్నో సామాజిక ప్రయోగాల ఫలితాలను ఆమె అనుభవించారు. ఆయనకు స్ఫూర్తిగా నిలిచారు.

Kasturba Gandhi biography
కస్తూర్‌ కపాడియాగా 1869 ఏప్రిల్‌ 11న పోర్‌బందర్‌లో సుసంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆమె గాంధీజీని పెళ్లాడిన తర్వాత కస్తూర్బా అయ్యారు. ఏడేళ్ల వయసులో వీరి నిశ్చితార్థం, 13 ఏళ్లకు పెళ్లి జరిగింది. వయసులో గాంధీజీ కంటే కొన్ని నెలలు పెద్దే అయినా.. ఆ కాలం నాటి చాలా ఇళ్లలో ఉన్నట్లే పురుషస్వామ్యమే నడిచేది. వారిద్దరి సంసారసాగరంలోనూ ఎన్నో అలలు. ఎందుకంటే మహాత్ముడిగా మారక ముందు... ఆయనా భార్యను చెప్పుచేతుల్లో ఉంచుకోవటమే పురుష లక్షణం అనుకున్నవాడే. ఆమె ఇంట్లోంచి బయట అడుగుపెట్టాలంటే తన అనుమతి తీసుకోవాలని షరతు పెట్టాడు.

కానీ కస్తూర్బా అత్తగారితో కలసి రోజూ గుడికి వెళ్లి వచ్చేది. తన అనుమతి తీసుకోవటం లేదని అభిజాత్యాన్ని ప్రదర్శించారు మోహన్‌ గాంధీ! 'మీ అమ్మగారి మాట కాకుండా మీ మాట వినాలని అనుకుంటున్నారా?' అన్న ఒకే ఒక్క ప్రశ్నతో ఆయన్ను ఆలోచనలో పడేసింది కస్తూర్బా. అలా.. ఆమెను నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఎన్నడూ ఫలించలేదు. కారణం తనకిష్టం లేని పనిని ఆమెతో చేయించటం గాంధీకి కూడా సాధ్యమయ్యేది కాదు. అలాగని నిత్యం గొడవలు పడేది కాదు. మౌనంగానే సత్యాగ్రహంతో, సహనంతో సాధించుకునేది. గాంధీజీ మహాత్ముడిగా మారి... జాతిపితగా ఎదిగినా... కస్తూర్బా ఆ పేరుప్రతిష్ఠలను తలకెక్కించుకోలేదు.

Kasturba Gandhi life history
'వివిధ సందర్భాల్లో మా తాతగారి పురుషాహంకారాన్ని కస్తూర్బా ఎదుర్కొన్న తీరు ఆయన్ను ఎంతో ఆశ్చర్యపరచింది. ఆయన రాజకీయ సత్యాగ్రహానికి ఆమెలోని సహనమే స్ఫూర్తిగా నిలిచింది'' అన్నది గాంధీ మనవడు అరుణ్‌గాంధీ విశ్లేషణ. అందుకే మహాత్ముడు తన 37వ ఏటనే సంసార సుఖాన్ని త్యజించి బ్రహ్మచర్యానికి కట్టుబడతానంటే... పల్లెత్తు మాటైనా ఎదురు చెప్పకుండా అంగీకరించి ఆయనకు సహకరించారు కస్తూర్బా! ''మొదట్లో ఎంతో పట్టుదలతో ఉండేది. నేనేం చెప్పినా తనకిష్టమైతేనే చేసేది. ఇది మా ఇద్దరి మధ్యా చాలా సందర్భాల్లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. కానీ నా ప్రజాజీవితం విస్తరించిన కొద్దీ... ఆమె తనను తాను కోల్పోయి నాలో కరిగిపోయింది'' అని రాశారు గాంధీజీ.

Gandhiji Kasturba
ఆయన సత్యాన్వేషణలో ఆమె దీపమయ్యారు. దక్షిణాఫ్రికాలోనే కాకుండా భారత్‌కు తిరిగి వచ్చాక చంపారన్‌, బర్దోలి, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా... ఇలా ఉద్యమాల్లో నూ ఆయన అర్ధాంగిగా ఉంటూ నాలుగుసార్లు జైలు పాలయ్యారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో గాంధీజీని అరెస్టు చేస్తే తాను రోడెక్కి మహిళలందరినీ సమీకరించారు కస్తూర్బా! ఫలితంగా ఆమెనూ జైలుకు పంపించింది బ్రిటిష్‌ సర్కారు. 74 సంవత్సరాల కస్తూర్బా శరీరం అలసిపోయింది. రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆమె కోరిక మేరకు ఆసుపత్రి నుంచి గాంధీజీని నిర్బంధంలో ఉంచిన పుణె ఆగాఖాన్‌ ప్యాలెస్‌కు తరలించారు. 1944 ఫిబ్రవరి 22న మహాత్ముడి ఒడిలో తలవాల్చి ఈ లోకం నుంచి నిష్క్రమించారు కస్తూర్బా! 23న అదే ప్యాలెస్‌ ఆవరణలో ఆమె అంత్యక్రియలయ్యాయి. చితిమంటలు ఆరే దాకా గాంధీజీ అక్కడి నుంచి కదల్లేదు.

"అన్నిటా ఆమె నాకంటూ ఓ అడుగు ఎత్తులోనే నిలిచింది. నా రాజకీయాల పోరాటాలన్నిటా వెన్నంటి ఉంది. ఎన్నడూ వెనకడుగు వేయలేదు. తన తోడే లేకుంటే నేను శూన్యం. సాధారణ భాషలోనైతే ఆమె నిరక్షరాస్యురాలు. కానీ నా దృష్టిలో అసలైన విద్యకు ఆమె మార్గదర్శి" అంటూ నివాళులర్పించారు గాంధీజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.