ETV Bharat / opinion

జీ-7 సదస్సు: భారత్‌కు ఆహ్వానం.. అయినా ఆచితూచి.. - g7 summit plannings

జీ-7 కూటమిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కొవిడ్​ కారణంగా ఆలస్యంగా సెప్టెంబర్​లో జరగనున్న సంపన్న దేశాల సమాహారంలో భారత్​కు ఆహ్వానం దక్కడం విస్తృత స్థాయి చర్చలకు దారితీస్తోంది. అయితే దీని వెనకున్న అసలు వ్యూహమేంటనేదే ఇప్పుడు సందేహంగా మారింది.

Achievement on new alliances for G-7 Summit 2020
కొత్త కూటములపై ఆచితూచి.. జీ-7 కు భారత్‌కు ఆహ్వానం
author img

By

Published : Jun 26, 2020, 7:59 AM IST

సంపన్న దేశాల సమాహారమైన జీ-7 కూటమిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. కెనడా, ఫ్రాన్స్‌, అమెరికా, ఇటలీ, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌లతో కూడిన ఈ కూటమి జూన్‌ మొదటివారంలో నిర్వహించాల్సిన సదస్సును కొవిడ్‌ నేపథ్యంలో సెప్టెంబరుకు వాయిదా వేసినప్పటికీ- అందులో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం పంపించడమే విస్తృత చర్చకు తెరలేపింది.

రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను సైతం ఆ సదస్సుకు ఆహ్వానిస్తామని- ఆ రకంగా కూటమిని జి-10గానో లేదా జి-11గానో రూపాంతరీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నారు. ప్రపంచంలోని 11శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న జి-7 కూటమి, అంతర్జాతీయ నికర ఆదాయంలో 58శాతానికి (317 లక్షల కోట్ల డాలర్లు), ప్రపంచ స్థూలోత్పత్తిలో 46శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ దేశాల చురుకైన వాణిజ్య భాగస్వామిగా జి-7 కూటమి మూడింట ఒకవంతు ఎగుమతులకు, 35శాతం వస్తు సేవల దిగుమతులకు కేంద్రంగా ఉంది.

అసలు వ్యూహం ఏమిటి?

ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవహారాలను గణనీయంగా ప్రభావితం చేయగల ఈ కూటమిలోకి భారత్‌ను ఆహ్వానించడం వెనక మతలబు ఏమిటి అన్నదే ఇప్పుడు జవాబు వెదకాల్సిన ప్రశ్న. ఇప్పటికే భారత్‌ జి-20లో భాగస్వామిగా ఉంది. నిజానికి జి-7 కూటమికి విస్తృత రూపమే జి-20! వరస వెంబడి సంభవించిన ఆర్థిక మాంద్యాల నేపథ్యంలో చైనా, ఇండియా, టర్కీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల తోడ్పాటు లేకుండా ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ సులభ సాధ్యం కాదని గమనించిన పాశ్చాత్య ప్రపంచం జి-20కి ప్రాణప్రతిష్ఠ చేసింది. అనేక సందర్భాల్లో జి-7 సదస్సులకన్నా జి-20 సమావేశాలే ప్రపంచ పరిణామాలను గరిష్ఠంగా ప్రభావితం చేశాయి. ఒకవైపు జి-20 ఇప్పటికే ఉండగా- భారత్‌ సహా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొని దాన్ని జి-10గానో, జి-11గానో మార్చాల్సిన అగత్యమేమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. చైనాను ఏకాకిగా మార్చి జి-20లో చీలిక తీసుకురావడమే పాశ్చాత్యదేశాల అసలు వ్యూహం!

చైనాను కాదని..

అంతర్జాతీయ నిబంధనలు, వ్యవస్థలను 'బీజింగ్‌' నాయకత్వం- చైనా కమ్యూనిస్టు పార్టీ అవసరాల మేరకు దుర్వినియోగం చేస్తోందని అమెరికా విమర్శిస్తోంది. తమ వ్యూహాత్మక అవసరాలను, ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో ఎలాంటి చర్యలకైనా వెనకాడేది లేదంటూ చైనా నాయకత్వం ఏమాత్రం తగ్గకుండా సవాళ్లు రువ్వుతున్న పరిస్థితుల్లో ఉభయ పక్షాల మధ్య వేడి పెరుగుతోంది. ఆ ప్రభావం అంతర్జాతీయ రాజకీయాలపై ప్రసరిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా తనమాట చెల్లుబాటయ్యే అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను చైనాకు వ్యతిరేకంగా మలచేందుకు పావులు కదుపుతోంది. జి-7 విస్తరణ ఆలోచనలను ఈ కోణంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కూటమిలో చేరితే సంపన్నమైన జి-7 దేశాలతో సమాన ఫాయాలో గుర్తించి, గౌరవిస్తామన్న హామీలకో; వాగ్దానాలకో భారత్‌ పొంగిపోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.

అదే భారత్​ బలం..

పాశ్చాత్య ప్రపంచం తమ అవసరం మేరకు ఈ ప్రతిపాదనలు తీసుకువస్తుందేగానీ- భారత్‌పై ప్రేమతో కాదు! ప్రపంచంలో ప్రబల ఆర్థిక, రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తున్న భారత్‌ ఇప్పుడు అమెరికాసహా పాశ్చాత్య ప్రపంచానికి ఓ తిరుగులేని అవసరం. కొత్త కూటమితో చేతులు కలిపినప్పటికీ భారత్‌ ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది. చైనాకో, రష్యాకో వ్యతిరేకంగా పాశ్చాత్య ప్రపంచం ప్రయోగించే ఆయుధంగా భారత్‌ మిగిలిపోరాదు. జి-7 దేశాలతోనూ, కొత్తగా ఈ కూటమిలోకి ఆహ్వానం పలుకుతున్న ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలతోనూ భారత్‌కు బ్రహ్మాండమైన ఆర్థిక సంబంధాలున్నాయి. నూతన కూటమిలో చేరితే ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది.

మరింత బలోపేతం..

కరోనా మహమ్మారి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల నడ్డి విరిచిన తరుణంలో కొత్త ఆర్థిక సంకీర్ణాలు, కూటములతో చేయి కలిపి పునర్‌వైభవంవైపు అడుగులు వేయాలి. వైరస్‌ సృష్టించిన బీభత్సం, భౌగోళిక రాజకీయ సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు చైనానుంచి తరలిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. విదేశీ కంపెనీలకు ఇబ్బంది లేని వాతావరణం కల్పించడంతోపాటు- పెట్టుబడులకు ఆకర్షణీయ స్థలిగా భారత్‌ను తీర్చిదిద్దే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటోంది. జి-7 కూటమిలో భాగస్వామ్యం దీర్ఘకాలంలో భారత్‌ను మరింత బలోపేతంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చొరబాట్లు ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలను రాజేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బహుళ పక్ష కూటములతో భాగస్వామ్యం నెరపడం భారత్‌కు వ్యూహాత్మక అవసరం కూడా. వైరస్‌ వ్యాప్తికి కారణమనే పేరిట ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకాకిగా మారుతున్న చైనాకు ఆ రకంగా గట్టి సంకేతాలూ పంపించినట్లవుతుంది.

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని, రచయిత్రి - అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు

ఇదీ చదవండి: జీ7 సదస్సుకు మోదీని ఆహ్వానించడంపై చైనా ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.