ETV Bharat / opinion

వృద్ధులపై కొరవడుతున్న శ్రద్ధ.. సాంత్వనేదీ? - వృద్ధులు

తల్లిదండ్రులను 'కనిపించే దేవుళ్లు'గా పూజించిన నిన్నటి తరం క్రమేపీ కనుమరుగవుతోంది. బాధ్యతారాహిత్యం పెరుగుతూ వద్ధులపై శ్రద్ధ సన్నగిల్లుతోంది. ఉరుకులు, పరుగులతో సాగే బతుకుపోరాటంలో పెద్దల యోగక్షేమాల్ని విచారించాల్సిన విధ్యుక్త ధర్మాన్ని, విచక్షణను పిల్లలు విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులపై ప్రత్యేక కథనం.

A special story on Lack of attention to the elderly people
వృద్ధులపై కొరవడుతున్న శ్రద్ధ
author img

By

Published : Aug 16, 2020, 10:25 AM IST

వృద్ధాప్యం మనిషి జీవితంలో అత్యంత విలువైన దశ. కాలంతోపాటు వయసు పెరగడం, వృద్ధాప్యంలోకి అడుగు పెట్టడం అనివార్యమైన సహజ ప్రక్రియ. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 12శాతం వరకు ఉన్న వృద్ధులు 2050వ సంవత్సరం నాటికి 22శాతం కానున్నారని అంచనా. మనదేశంలో వృద్ధులు 12 కోట్ల మంది ఉన్నట్లు 'ఐక్యరాజ్యసమితి జనాభా నిధి' 2019లో ప్రకటించింది. వీరిలో మూడు వంతులు గ్రామీణ భారతంలో నివసిస్తున్నారు. అందులో సగంమంది పేదరికంతో సతమతమవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మన భారతీయ సంస్కృతిలోని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వృద్ధులకు ఆసరాగా ఉంటూ, వారికి చరమాంకంలో రక్షణగా ఉంది.

ఉద్యోగాల కోసం వలసలు, పట్టణీకరణ, మారుతున్న జీవన శైలి- వృద్ధులకు, దేశానికి సామాజిక సమస్యగా మారింది. వృద్ధాప్యంతో జీవనం సాగించే వారి శాతం కేవలం ధనిక దేశాలకు మాత్రమే పరిమితం అయి ఉండేది. ప్రస్తుతం జపాన్‌ జనాభాలో 30శాతం 60 ఏళ్ల వయసు పైబడిన వారే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మెరుగవుతున్న వైద్య ప్రమాణాలు, ప్రభుత్వాల ద్వారా వృద్ధులకు అందుతున్న సంక్షేమ ఫలాలు, ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌లపై పెరుగుతున్న చైతన్యం పేద, మధ్య ఆదాయ దేశాల్లోనూ వృద్ధుల శాతం పెరిగేందుకు కారణమవుతున్నాయి.

ముదిమికి సాంత్వన అవసరం

వృద్ధాప్యానికి ఆరంభంగా భావించే 60 సంవత్సరాల వయసులో ఆహ్లాదకరంగా ఉంటున్నట్లు వృద్ధుల జీవన విధానంపై జరిగిన అధ్యయనాల ద్వారా విశదమవుతోంది. ఉద్యోగ విరమణతో పాటు పిల్లలు చేతికి అందిరావడం తమ సంతోషానికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ప్రజాహిత కార్యక్రమాలకు సమయం కేటాయించి, సమాజ సేవలో ఉత్సాహంగా పాలు పంచుకోవచ్చు అన్నది మరి కొందరి అభిప్రాయం. ఈ కార్యక్రమాలు తమకు సంతృప్తిని ఇస్తూ, మానసికోల్లాసానికి కారణమవుతున్నట్లు వారు అంటున్నారు.

వ్యక్తులు వృద్ధాప్యంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలతో సతమతమవుతున్నారు. స్వేచ్ఛనూ కోల్పోతున్నారు. ఈ దశలో అవసరమైన ఊతమందించి, బలిమి చేకూర్చినట్లైతే వారికి సాంత్వన లభించగలదని వృద్ధాప్య విజ్ఞాన శాస్త్రవేత్తలు (గెరాంటాలజిస్టులు) సూచిస్తున్నారు. వృద్ధుల్లో 92 శాతం ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మతతో, 77శాతం ఒకటి కంటే ఎక్కువ సమస్యలతో బాధ పడుతున్నట్లు 'జాతీయ వృద్ధాప్య మండలి' పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం, కేన్సర్‌, గుండె జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులవల్ల మూడు వంతుల మంది వృద్ధులు కన్ను మూస్తున్నట్లు పై పరిశోధనల సారాంశం.

భావోద్వేగాలనూ పరిరక్షించాల్సి ఉంది!

సంవత్సరానికి కనీసం ఒక్క పర్యాయమైనా వైద్య పరీక్షలు చేసుకుంటూ, సమతుల ఆహారం భుజిస్తూ, నడక, వ్యాయామం, యోగా సాధనపై దృష్టి కేంద్రీకరించినట్లైతే- ఈ తరహా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని 'జాతీయ దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణ సంస్థ' సూచిస్తోంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా భుజించడంతో పాటు- ఉప్పు, హాని కలిగించే కొవ్వు పదార్థాలను ఆహారంలో తగ్గించడంవల్ల వృద్ధు.ల్లో రోగ నిరోధక శక్తి పెరిగి పలు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నేడు విశ్వవ్యాప్తంగా వృద్ధుల ఆరోగ్యంపై చర్చ ఊపందుకుంది. శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణతో పాటు వారి భావోద్వేగాలనూ పరిరక్షించాల్సి ఉంది.

ఆ తరం కనుమరుగు..

తల్లిదండ్రులను 'కనిపించే దేవుళ్లు'గా పూజించిన నిన్నటి తరం క్రమేపీ కనుమరుగవుతోంది. బాధ్యతారాహిత్యం పెరుగుతూ పండుటాకులపై శ్రద్ధ సన్నగిల్లుతోంది. ఉరుకులు, పరుగులతో సాగే బతుకుపోరాటంలో పెద్దల యోగక్షేమాల్ని విచారించాల్సిన విధ్యుక్త ధర్మాన్ని, విచక్షణను పిల్లలు విస్మరిస్తున్నారు. మరోవైపు టీవీలు, కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఎలెక్ట్రానిక్‌ వస్తువుల మాయలో కుటుంబ బంధాలకు యువత దూరమవుతూ ఉంది. అభిమానంతో కూడిన నాలుగు మాటల కంటే ఫోన్‌ ద్వారా సందేశాలు, చాటింగ్‌లపై మక్కువ చూపుతున్న నాగరికత- వృద్ధుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సంపాదనకే ప్రాధాన్యం ఇవ్వడంతో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భవిష్యత్తులో వృద్ధుల శాతం గణనీయంగా పెరగనుండటంతో వారి సమస్యల పరిష్కారానికి సహాయ కేంద్రాల ఆవశ్యకతా ఎక్కువవుతోంది. వీటి ద్వారా వారికి ఆరోగ్య సలహాలతో పాటు మానసిక ఆనందానికి అవసరమైన సూచనలు ఇవ్వాలి. 'సీనియర్‌ సిటిజన్‌' పేరులో ఉన్న గౌరవం వారి జీవితాల్లో వెల్లివిరియాలి.

క్రమశిక్షణ కీలకం

వృద్ధులకు కుటుంబంలో, సమాజంలో ఎదురయ్యే అవమానాలను, సమస్యలను నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) భావిస్తోంది. మానవ జీవితానికి వృద్ధాప్యం ఒక బహుమతిగా ఉండాలి కానీ, శాపం కాకూడదని వృద్ధాప్య విజ్ఞాన శాస్త్ర పండితుడు జాన్‌ ఇర్వింగ్‌ అభిప్రాయపడుతున్నారు. వార్ధక్యం ప్రతి మనిషి జీవితంలో ఆహ్వానించదగిన అనుభవంగా మారాలంటే, వారి ఆరోగ్యానికి, జీవనశైలికి ప్రత్యేక భరోసా ఉండాలని అప్పుడే అది హుషారైన వృద్ధాప్యం (యాక్టివ్‌ ఏజింగ్‌) అవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ భావిస్తోంది.

అనివార్యమైన చివరిదశ గురించి ఆందోళన చెందకుండా ఆశావహ దృక్పథాన్ని అలవరచుకోవాలి. వయసులో ఉన్నప్పుడు కుటుంబం, స్నేహితులు, చుట్టుపక్కల వారితో కలిసి మెలిసి జీవించినట్లైతే వృద్ధాప్యంలో వెలితి ఉండదని అర్థం చేసుకోవాలి. ఇంటిపని, తోటపని మొదలైన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తూ సంతృప్తిగా జీవించాలి. క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య విధానాలను బాల్యం నుంచి అలవరచుకుంటే వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది. సమతుల్యమైన ఆహారాన్ని మితంగా భుజిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ధూమ, మద్య పానాలకు దూరంగా ఉంటూ, కుటుంబ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటే ఆఖరి మజిలీ ఆనందభరితం అవుతుంది.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌, వైద్య రంగ నిపుణులు

ఇదీ చూడండి: 'కరోనాపై భయాన్ని తొలగించి.. అవగాహన కల్పించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.