ETV Bharat / opinion

'రాజపక్స'ల ఏలుబడిలో శ్రీలంక పయనమెటు?

author img

By

Published : Aug 12, 2020, 2:13 PM IST

శ్రీలంకలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి విజయ దుందుబి మోగించారు మహింద రాజపక్స. దేశ భద్రత, రక్షణ, రాజ్యంగ సవరణే ప్రధానాంశంగా ఎన్నికల బరిలో దిగారు. తనతో పాటు కుటుంబంలో ఐదుగురు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. స్వయంగా సోదరులిరువురూ అధ్యక్ష, ప్రధాని స్థానాలను అలంకరించడం.. విపక్ష, ప్రతిపక్షాలు గల్లంతవడం అనూహ్య పరిణామం. ఈ పరిస్థితులు.. ఇరువురు రాజపక్సల తీరు తెన్నులను ఎలా ప్రభావితం చేయనున్నాయన్నది ఆసక్తికరం. రాజకీయంగా ఎదురులేని ఈ వాతావరణం వారిని నియంతలుగా మారుస్తుందా అన్న భయానుమానాలూ లేకపోలేదు.

A political landslide that deepens Sri Lanka's dynastic politics
ఎదురులేని 'రాజ'పక్స కుటుంబం- నియంతలుగా మారతుందా!

శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న మీమాంస.. ఎన్నో రోజుల పాటు సాగింది. ఈ నిరీక్షణకు తెర దించుతూ అక్కడ ఎన్నికలు నిర్వహించటం... కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావటం చకచకా జరిగిపోయాయి. మహింద రాజపక్స నేతృత్వంలోని ఎస్​ఎల్​పీపీ ఘనవిజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మిగతా పార్టీలన్నింటినీ పూర్తిగా వెనక్కి నెట్టి.. రేసులో ముందంజలో నిలిచింది.

ఇదీ చదవండి: ప్రధానిగా నాలుగోసారి పగ్గాలు చేపట్టిన మహింద

ప్రధానమంత్రిగా రాజపక్స ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇప్పుడు అందరి దృష్టి రాజ్యాంగ సవరణపైనే ఉంది. ఎన్నికల్లో ఇదే విషయం ప్రస్తావించి విస్తృతంగా ప్రచారం చేశారాయన. ఈ అంశంపై ఆయన ఎలా వ్యవహరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. దేశభద్రతకు ప్రాధాన్యత, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టటం లాంటి లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.

సంకల్ప విజయం

రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికలు వాయిదా పడటం వల్ల... ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిర్వహించే తీరాలన్న సంకల్పంతో ముందుకెళ్లిన శ్రీలంక... అనుకున్నది సాధించింది. ఆగస్టు 5న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 225 సీట్లకు 145 స్థానాలు దక్కించుకుని విజయం సాధించిందీ మహింద రాజపక్స సారథ్యంలోని శ్రీలంక పొదుజన పెరమున(ఎస్​ఎల్​పీపీ) పార్టీ. మొత్తం 71% ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల భారీ ఆధిక్యంతో విజయదుందుబి మోగించింది. అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తున్న 19వ రాజ్యాంగ సవరణ ఎత్తివేయడమో లేదా మార్పులు తీసుకురావడమో చేస్తామన్న హామీ ఇచ్చారు రాజపక్స. ఆయన విజయంలో ఈ హామీ ప్రధాన పాత్ర పోషించింది.

సవరణ ఎత్తివేయాలా? సంస్కరించాలా?

మహింద రాజపక్స సోదరుడు... గొటబాయ రాజపక్స రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగా... ప్రధానిగా మహింద బాధ్యతలు చేపట్టారు. కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఈ 14న జరగనుంది. 26కు మించకుండా మంత్రుల సంఖ్య ఉండనుందని అంచనా. మరో 36మంది మంత్రులు బాధ్యతలు చేపట్టగానే... రాజ్యాంగ సవరణలు, కరోనాతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థకు మళ్లీ బలం చేకూర్చటం లాంటి అంశాలపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. 19వ రాజ్యాంగ సవరణ కింద ప్రభుత్వ ఏర్పాటుకు 45 మంది మంత్రులతో కొత్త క్యాబినెట్‌కు రూపలక్పన చేసే వీలవుతుంది. అయితే... ఈ సవరణ పూర్తిగా ఎత్తివేయటమా... సంస్కరించటమా అనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. అదే సమయంలో మిత్రపక్షాలు లేకుండానే ఓ స్వతంత్ర క్యాబినెట్‌ ఏర్పాటుపైనా చర్చలు జరుగుతున్నాయి.

సోదర ద్వయం మధ్యే

తన సోదరుడు గొటబాయ రాజపక్స అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితుల్లో... ప్రధానిగా తన అధికారాలకు, పార్లమెంటు విశేష అధికారాలకూ కోతపెడతారా..? అధ్యక్షుడికి అగ్రాసనం కట్టబెట్టేందుకు మహింద ఎంతమేరకు ముందుకు వస్తారు..? శ్రీలంకలో ఇప్పుడు ఈ అంశాలపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కుటుంబ రాజకీయాల ముద్ర పడినప్పటికీ... దేశ ప్రయోజనాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామన్న ధీమా ప్రజల్లో కలిగించటంలో విజయం సాధించింది రాజపక్స కుటుంబం. నిజానికి శ్రీలంకలో వర్గ భేదాలు ఎక్కువ. కానీ, ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే పరిస్థితుల్లో కొంతమేర మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ఫలితాలు ప్రజల్లోని జాతీయతా భావం, జాతీయ భద్రత పట్ల ఆకాంక్షలను ప్రతిబింబించాయన్నది నిపుణుల మాట.

కుటుంబంలో ఐదుగురు

గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రజల ఆలోచనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 1977లో యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్​పీ) భారీ విజయం సాధించినప్పుడు మినహా అన్ని ఎన్నికల్లోనూ బొటాబొటీ మెజార్టీతోనే ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇన్నాళ్లకు ఎస్​ఎల్​పీపీ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. మహింద రాజపక్స 5 లక్షలకు పైగా ఓట్లు సాధించారు.

ఇదీ చదవండి: శ్రీలంకతో స్నేహబంధం కావాలి దృఢతరం

ఆయనతో పాటు కుటుంబంలో ఐదుగురు ఎన్నికయ్యారు. ఇందులో మహింద రాజపక్స సోదరుడు చమల్, కుమారుడు నమల్, మేనల్లుళ్లు శశీద్ర రాజపక్స, నిపుణ రణవక ఉన్నారు. అధ్యక్ష పదవిలో మరో సోదరుడు గొటబాయ ఉండనే ఉన్నారు. గతేడాది ఈస్టర్ సండే నాడు జరిగిన బాంబు పేలుళ్లు జాతీయ భద్రతపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాయి. అందుకే...ఈ సారి మహింద రాజపక్స...దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా...ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఓ పార్టీకి మెజార్టీ ఇచ్చారన్నది ఓ విశ్లేషణ.

కొత్త రాజ్యాంగమే

1978 నాటి రాజ్యాంగాన్ని సవరిస్తామన్నదే రాజపక్స చెబుతున్న మాట. అయితే...ఇలా చేయటం వల్ల గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది. కానీ, రాజపక్స మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించటం లేదు. పైగా శ్రీలంకకు కొత్త రాజ్యాంగం అవసరమని ఈటీవీ భారత్‌తో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజల అభీష్టాల మేరకు దేశం అన్నివిధాలా పురోగతి సాధించాలంటే ఇది అవసరమనీ విశ్వసిస్తున్నారు ఆయన. ముఖ్యంగా 19వ రాజ్యాంగ సవరణ కారణంగానే... ఇన్నాళ్లూ ప్రభుత్వం సాఫీగా కార్యకలాపాలు సాగించేందుకు వీలు కాలేదని చెబుతున్నారు.

'ఇదే వారి ఓటమికి కారణం!'

2015లో 19వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో పదేళ్ల పాటు పరిపాలన సాగించిన మహింద రాజపక్స ఓటమిపాలు కాగా యూఎన్‌పీ అధికారంలోకి వచ్చింది. మైత్రిపాల సిరిసేన అధ్యక్షుడిగా... రనిల్ విక్రమసింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు చేసిన రాజ్యాంగ సవరణతో అధ్యక్షుడి అధికారాలకు కోతపడింది. అవన్నీ ప్రధానమంత్రికి బదిలీ అయ్యాయి. అప్పట్లో ఈ చర్యలన్నింటినీ బహిరంగంగానే విమర్శించారు మహింద రాజపక్స. అందుకే ఇప్పుడు సరికొత్త రాజ్యాంగం అవసరమన్న అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో యూఎన్​పీ పరాజయానికి కారణం...ఈ రాజ్యాంగ సవరణే అని మరోసారి గుర్తు చేశారాయన.

నియంతలుగా మారుస్తుందా!

మైత్రిపాల సిరిసేన, విక్రమసింఘే మధ్య అంతర్గత పోరు ముదిరి పాకానపడటం... ఈస్టర్‌ పర్వదినాన ఉగ్రదాడుల్లో 290కిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవటం.. ఈ రెండు పరిణామాలు... 2019 నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబాయ రాజపక్స విజయం సాధించేలా చేశాయి. యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్​పీ) ప్రస్తుత ఎన్నికల్లో 3% ఓట్లు కూడా సాధించలేకపోయింది. స్వయంగా సోదరులిరువురూ అధ్యక్ష, ప్రధాని స్థానాలను అలంకరించడం.. విపక్షాలు దాదాపు గల్లంతవడం ఆసక్తికర పరిణామం. ఇక ప్రతిపక్షాలకూ తావు లేకుండా పోవటం మరో కీలకాంశం. ఈ పరిస్థితులు.. ఇరువురు రాజపక్సల తీరు తెన్నులను ఎలా ప్రభావితం చేయనున్నాయన్నది ఆసక్తికరం. రాజకీయంగా ఎదురులేని ఈ వాతావరణం వారిని నియంతలుగా మారుస్తుందా అన్న భయానుమానాలూ లేకపోలేదు.

ఇదీ చదవండి: దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం: ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.