ETV Bharat / opinion

టీకా విముఖతను అధిగమిస్తేనే.. కరోనా నుంచి రక్ష!

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లకు పైబడిన జనాభాలో కనీసం ఒక్క మోతాదు కొవిడ్‌ టీకా(Vaccination in india) పొందినవారు 80శాతం. ఇంతవరకు రెండు మోతాదులూ వేయించుకున్న వయోజనులు 40శాతమే. నిర్ణీత గడువు తరవాత రెండో మోతాదు పొందడానికి రావాల్సినవారిలో దాదాపు 11 కోట్లమంది విముఖత కనబరుస్తున్నారని కేంద్రం చెబుతోంది. ప్రపంచారోగ్యానికి దాపురించిన పది పెను ముప్పుల్లో 'వ్యాక్సిన్‌ విముఖత' ఒకటని రెండేళ్ల క్రితం డబ్ల్యూహెచ్‌ఓ చేసిన సూత్రీకరణ అక్షరసత్యమని ఇప్పుడు భారత్‌కు సోదాహరణంగా మళ్లీ అనుభవమవుతోంది.

india vaccine hesitancy
భారత్​లో టీకా విముఖత
author img

By

Published : Nov 16, 2021, 7:48 AM IST

భీకరంగా మృత్యుభేరి మోగిస్తూ ఆర్థిక వ్యవస్థల్ని భిన్న రంగాల్ని ఛిన్నాభిన్నం చేస్తూ విజృంభించిన కరోనా వైరస్‌ నియంత్రణ కోసం దేశంలో బృహత్తర వ్యాక్సినేషన్‌(Vaccination in india) ప్రక్రియ ప్రారంభమై పదినెలలు పూర్తయింది. జర్మనీ, సింగపూర్‌, బ్రిటన్‌, రష్యా, చైనా వంటిచోట్ల కొత్తగా కొవిడ్‌ కేసుల వ్యాప్తి ఆందోళన పరుస్తున్న తరుణాన, దేశీయంగా వ్యాక్సినేషన్‌(Vaccination in india) మందగించిన తీరు- ప్రమాద ఘంటికలు మోగిస్తోంది! తొలి పదికోట్ల కొవిడ్‌ టీకాల నమోదుకు 85 రోజులు పట్టగా- 90కోట్ల నుంచి 100 కోట్లకు కేవలం 19 రోజుల్లోనే చేరినట్లు అక్టోబరు మూడోవారంలో కేంద్రప్రభుత్వం సగర్వంగా విశ్లేషించింది. సెప్టెంబరు నెలలో సగటున రోజువారీ టీకాల సంఖ్య కోటి దాటిన మాట యథార్థం. ఇప్పుడా సంఖ్య 40-30 లక్షలకు పడిపోవడమే తీవ్రంగా కలవరపరుస్తోంది.

టీకాకు ముఖం చాటేస్తూ..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లకు పైబడిన జనాభాలో కనీసం ఒక్క మోతాదు కొవిడ్‌ టీకా(Vaccination in india) పొందినవారు 80శాతం. ఇంతవరకు రెండు మోతాదులూ వేయించుకున్న వయోజనులు 40శాతమే. ఇప్పటికీ 45-59 ఏళ్ల వయస్కుల్లో 43శాతం, అరవై సంవత్సరాలకు పైబడినవారిలో 37శాతం మేర రెండో డోసు వేయించుకోవాల్సి ఉందని సర్కారీ లెక్కలు చాటుతున్నాయి. ఆరోగ్య కార్యకర్తల్లోనూ 10శాతం వరకు మలి విడత కొవిడ్‌ టీకాకు ముఖం చాటేయడం విస్తుగొలుపుతోంది. ఝార్ఖండ్‌, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని 48 జిల్లాల్లో కొవిడ్‌ టీకాల కార్యక్రమం మందకొడిగా సాగుతున్నట్లు సమీక్షా సమావేశాల్లో నిగ్గుతేలినా- సత్వర దిద్దుబాటు చర్యలు ఇంకా ఊపందుకోలేదు. నిర్ణీత గడువు తరవాత రెండో మోతాదు పొందడానికి రావాల్సినవారిలో దాదాపు 11 కోట్లమంది(Vaccine second dose missed) విముఖత కనబరుస్తున్నారంటున్న కేంద్రం- రాష్ట్రాలవారీగా సబ్‌ డివిజన్‌ స్థాయిలోనూ జనచైతన్యం పెంపొందాలంటోంది. అందుకు ప్రధానంగా ప్రజాప్రభుత్వాలే చురుగ్గా పూనిక వహించాలి!

నిరాధార భయాందోళనలతో..

కరోనా నుంచి ప్రాణహాని వాటిల్లని రీతిలో అందరూ సురక్షితమైతేనే గాని, ఏ ఒక్కరూ దిలాసాగా ఉండే వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగడే హెచ్చరించింది. టీకా రెండు మోతాదులూ పొందినవారిలో ప్రాణహాని ముప్పు, వైరస్‌ ప్రభావ తీవ్రత తగ్గుతాయని పలు అధ్యయనాలూ వెలువడ్డాయి. తగినన్ని వ్యాక్సిన్‌ నిల్వలు అందుబాట్లో ఉన్నప్పటికీ- రకరకాల దుష్ప్రచారాలు, నిరాధార భయాందోళనలు(Vaccine hesitancy) కొన్ని వర్గాల పాలిట 'అదృశ్యశక్తి'గా పరిణమించడం దురదృష్టకరం. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య మూలాల్ని గుర్తించి స్థానికాధికార గణం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు విశేష ప్రభావం కనబరచాయి. ఔరంగాబాద్‌(మహారాష్ట్ర), నీలగిరి కొండలు(తమిళనాడు), తూర్పు చంపారన్‌(బిహార్‌) లాంటిచోట్ల గిరిజనులకు అర్థమయ్యే భాషలో సందేహాల(Vaccine hesitancy) నివృత్తికి జిల్లా యంత్రాంగం చేసిన ప్రణాళికాబద్ధ కృషి ఫలించి వ్యాక్సినేషన్‌ శాతం పెరిగింది. అదే, మైదాన ప్రాంతాల్లోను నగరాల్లోను టీకాలకు లక్షల మంది దూరంగా ఉన్నారంటున్న విశ్లేషణలు విస్మయపరుస్తున్నాయి.

టీకానే రక్షాకవచం..

ప్రపంచారోగ్యానికి దాపురించిన పది పెను ముప్పుల్లో 'వ్యాక్సిన్‌ విముఖత' ఒకటని రెండేళ్ల క్రితం డబ్ల్యూహెచ్‌ఓ చేసిన సూత్రీకరణ అక్షరసత్యమని ఇప్పుడు భారత్‌కు సోదాహరణంగా మళ్ళీ అనుభవమవుతోంది. విధిగా ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయి టీకా రక్షణ పొందేలా విస్తృత కార్యాచరణతోపాటు, వ్యక్తిగతంగా అందరూ స్వీయ జాగ్రత్తలు పాటించడమూ అత్యంత ఆవశ్యకం. యూకేలో కోరలు తొడుక్కుంటున్న డెల్టా రకం వైరస్‌ రూపేణా ఇక్కడా కొవిడ్‌ కేసుల మూడోదశ ఉద్ధృతి సంభవించకుండా, డిసెంబరు ముగిసేలోగా వయోజనులందరికీ సంపూర్ణ టీకా రక్షణ లభించేలా చూడాలి. చిన్న పిల్లలకూ టీకాలు త్వరితగతిన అందుబాటులోకివస్తే, యావత్‌ జాతికీ సార్వత్రిక రక్షాకవచం సాకారమవుతుంది. అందుకోసం- పౌరులు, ప్రభుత్వాల ఏకోన్ముఖ పోరాటమే శరణ్యం!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.