నాంపల్లి గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ - hyderabad Exhibition
🎬 Watch Now: Feature Video
Published : Jan 1, 2024, 5:38 PM IST
|Updated : Jan 1, 2024, 5:59 PM IST
CM Revanth Reddy Opening Numaish Exhibition in Hyderabad : భాగ్యనగరంలో ఎన్నో ఏళ్లుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాంపల్లిలో ఏర్పాటైన న్యూమాయిష్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎగ్డిబిషన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఏర్పాట చేసిన స్టాళ్లను సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సందర్శిస్తున్నారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ పారిశ్రామిక ప్రదర్శనలో దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికులు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌కు వివిధ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియనుంది.
నుమాయిష్‌కు భారీ సంఖ్యలో జనాలు వస్తారన్న అంచనాతో ప్రత్యేకంగా మెట్రో రైళ్లు, బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా నగర ప్రజలు ఎగ్జిబిషన్లో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులు సూచించారు.