LIVE : తెలంగాణ భవన్ బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - KTR Live
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 6:01 PM IST
|Updated : Jan 3, 2024, 6:41 PM IST
BRS Live : భారత రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికల కార్యాచరణ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ్టి నుంచి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ సభాపతి మధుసూధనాచారి, మాజీ మంత్రులు తదితర ముఖ్యనాయకులు సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సన్నాహక సమావేశాల్లో చర్చించారు. సమావేశంలో 'కాంగ్రెస్ 420 హామీలు' పేరుతో బీఆర్ఎస్ బుక్‌లెట్ విడుదల చేసింది. హామీల అమలును గుర్తుచేసేలా బుక్‌లెట్ తయారుచేసిందని నాయకులు తెలిపారు. ఆరు గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్లు అంటూ ఇచ్చిన హామీలతో బుక్‌లెట్ తయారు చేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే హామీలు నెరవేర్చాలని పార్టీ డిమాండ్ చేసింది. హామీలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తామన్నారు. సన్నాహక సమావేశాల అనంతరం క్షేత్రస్థాయిలో ప్రచార పర్వాన్ని బీఆర్ఎస్ చేపట్టనుంది. అనంతరం తొలి రోజు సమావేశం అనంతరం బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు.