LIVE : తెలంగాణ భవన్ నుంచి ప్రత్యక్షప్రసారం - తెలంగాణ భవన్
🎬 Watch Now: Feature Video
Published : Jan 9, 2024, 5:20 PM IST
|Updated : Jan 9, 2024, 5:26 PM IST
BRS LEADERS PRESS MEET LIVE FROM TELANGANA BHAVAN : తెలంగాణ భవన్‌లో గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. నెలరోజులు గడుస్తున్నా.. సంక్షేమ పథకాల అమలుపై ఒక్క అడుగు పడలేదని ఆరోపించారు. దరఖాస్తుల పేరుతో కాలయాపన తప్పా చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ రివ్యూ అనంతరం వారంతా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ గళం, బలం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు స్పష్టం చేశారు. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదామని, త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకుందామని సూచించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల, నేతల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను పూర్తిగా తిరస్కరించలేదనడానికి గులాబీ పార్టీ సాధించిన ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.