వాటర్ మెలన్ ఫ్రూట్ స్త్లెసర్
ఇది యాపిల్ కట్టర్ లాగే ఉంటుంది. కానీ ఆకారంలో పెద్దది. పైగా దీని బ్లేళ్లు కూడా పదునుగా ఉంటాయి. పుచ్చకాయకు పైన ఈ స్త్లెసర్‌ను పట్టుకుని కిందికి నొక్కితే స్త్లెసర్ బ్లేళ్లు దాన్ని సమానమైన పక్షాలుగా తరిగేస్తాయి.. దీని వల్ల ప్రతి సారీ చాకులతో కుస్తీ అవసరం ఉండదు. బ్లేడు నాణ్యతను బట్టి దీని ధర రూ.249 నుంచి రూ.9,916 వరకు ఉంది.
మెలన్, ఫ్రూట్ క్యాంటలోప్
పుచ్చకాయ లేదా మరేదైనా పండుని తరిగినప్పుడు దాని పై పొర నుంచి పండు భాగాన్ని సమానమైన పోర్షన్లలో కట్ చేయడానికి ఇది పనికొస్తుంది. ఇది రెండు కొడవలి ఆకారం ఉన్న ప్లాస్టిక్/స్టీల్ రేకులను సమాంతరంగా ఉంచి, వాటి చివర్లను అరంగుళం పొడవున్న పదునైన కటింగ్ థ్రెడ్ లేదా బ్లేడ్‌తో జతచేసినట్లు ఉంటుంది. హ్యాండిల్‌ని పట్టుకుని బ్లేడ్/ థ్రెడ్ సహాయంతో పండుని కట్ చేయొచ్చు. తరిగిన ముక్కని పండు నుంచి వేరుచేసి, పట్టుకోవడానికి అనుకూలంగా ఈ క్యాంటలోప్‌ని డిజైన్ చేశారు. తయారు చేసిన మెటీరియల్‌ను బట్టి దీని ధర రూ.199 నుంచి రూ.6,634 వరకు ఉంది.
స్కూప్ మెలన్ బాల్స్
పుచ్చకాయను ముక్కలుగా కాకుండా చిన్న చిన్న గుండ్రటి బంతుల్లా కట్ చేయడానికి ఈ స్కూప్ ఉపయోగ పడుతుంది. ఐస్ క్రీం స్కూప్ ఆకారంలో కనిపించినా, పనితీరు చూశాక ఇది పుచ్చకాయ లాంటి పండ్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేసినట్లు అర్థమవుతుంది. స్కూపర్ నాణ్యతను బట్టి దీని ధర రూ.119 నుంచి రూ.7,210 వరకు ఉంది.
విండ్‌మిల్ రోలింగ్ మెలన్ కట్టర్
పేరుకు తగ్గట్టుగానే గాలి మర ఆకారంలో ఉండే ఈ కట్టర్ పుచ్చకాయను చిన్న చిన్న చదరపు ముక్కలుగా కోయడానికి పనికొస్తుంది. వాడటానికి కూడా ఇది సరదాగా ఉంటుంది. సగానికి తరిగిన పుచ్చకాయపై ఈ కట్టర్‌ని రోల్ చేసిన కొద్దీ ముక్కలు వరుసగా దీని హ్యాండిల్ వైపుకు వస్తుంటాయి. పుచ్చకాయను ముక్కలుగా తరిగి సర్వ్ చేయాల్సి వచ్చినప్పుడు దీనితో ఆ పని చాలా సులువౌతుంది. కట్టర్, బ్లేళ్ల నాణ్యతను బట్టి దీని ధర రూ.372 నుంచి 1200 వరకు ఉంది.
స్త్లెసర్ కట్టర్
పిల్లలతో పండ్లు తినిపించడానికి ఇబ్బందులు పడే తల్లులకు, సమ్మర్‌లో సాయంత్రం వేళ సరదాగా పార్టీ చేసుకోవాలనుకునే వారికీ, ఆహారాన్ని సర్వ్ చేయడంలో క్రియేటివిటీ ఇష్టపడే వారికీ ఈ కట్టర్లు తెగ నచ్చేస్తాయి. కుకీ కట్టర్లలాగే రకరకాల ఆకారాలలో ఉండే ఈ స్త్లెసర్ కట్టర్లను ప్రత్యేకంగా పండ్ల కోసంమే డిజైన్ చేశారు. పదునైన కటింగ్ అంచు, పట్టుకోవడానికి వీలుగా గ్రిప్‌లైన్ వీటి ప్రత్యేకత. కట్టర్ నాణ్యతను బట్టి వీటి ధర రూ.125 నుంచి రూ. 3,380 వరకు ఉంది.
వాటర్ మెలన్ ట్యాపింగ్ సెట్
పుచ్చకాయకే ఓ కుళాయి ఉండి దాన్నుంచి నేరుగా పుచ్చకాయ జ్యూస్ వస్తే భలే ఉంటుంది కదూ..! ఇలాంటి వింతలు చూశారంటే పిల్లలు మారాం చెయ్యకుండా జ్యూసులు తాగేస్తారు. అందుకే ఈ వాటర్ మెలన్ ట్యాపింగ్ అంతగా పాపులరవుతోంది.. దీన్నెలా వాడాలంటే..
పుచ్చకాయకు పైన గుండ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పైనున్న పొరకు గాట్లు పడకుండా లోపలి పండునంతా స్కూప్ చేయాలి (తొలిచేయాలి). ఇప్పుడు పుచ్చకాయ గుజ్జుతో జ్యూస్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. అది చల్లబడేలోపు ఈ ట్యాపింగ్ సెట్‌ని డొల్లగా ఉన్న పుచ్చకాయకు అమర్చాలి. చల్లబడ్డ జ్యూస్‌ను ఇందులో పోసి, ముందు కట్ చేసిన పుచ్చకాయ ముక్కను మూతగా పెట్టేస్తే సరి..! పంపు తిప్పితే సరాసరి పుచ్చకాయ నుంచే జ్యూస్ వస్తున్నట్లుగా ఉంటుంది. ట్యాప్ నాణ్యతను బట్టి దీని ధర రూ.3,729 నుంచి 7,749 వరకు ఉంది.