తినే పదార్థాలు రుచిగా ఉంటే సరిపోదు. అది వండే వంటిల్లు శుభ్రంగా ఉండాలి. వంటగది గందరగోళంగా ఉంటే వంట చేయాలనిపించదు. చికాకుగా అనిపిస్తుంటుంది. వంటలు రుచిగా వచ్చేందుకు.. వంటిల్లు ఆహ్లాదకరంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..
- ఇదీ చదవండి : మటన్ స్పెషల్: ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ
రాత్రి పనులన్నీ అయిపోయాక స్టవ్, ప్లాట్‌ఫాం శుభ్రం చేసేస్తే ఉదయం లేవగానే హాయిగా కాఫీ పెట్టేసుకోవచ్చు. కూరగాయల తొక్కు ఎప్పటిదప్పుడు బిన్‌లో పాడేస్తే... సమస్యే ఉండదు.
పోపు వేసేటప్పుడు స్టవ్‌మీద నూనె చిందడం మామూలే. దాన్ని వెంటనే టిష్యూ పేపరుతో తుడి చేస్తే శుభ్రంగా ఉంటుంది. ప్లాట్‌ఫాం మీద నీళ్లు, పాలు, నూనె లాంటివి పడితే మైక్రోఫైబర్ స్పాంజితో తుడిస్తే అద్దంలా ఉంటుంది.
సింక్‌లో ఉల్లిపొట్టు, టీపొడి లాంటివి పడకుండా ఫిల్టర్ వాడితే బ్లాక్ అవ్వదు. అప్పటికీ బ్లాక్ అయితే డ్రెయిన్ క్లీనర్ ఉపయోగించి నీళ్లు పోయేలా చేయాలి.
వంటింట్లో బొద్దింకలు కనిపిస్తే దుర్భరంగా ఉంటుంది. అవి రాకుండా వైట్ వెనిగర్ కలిపిన నీళ్లను పొయ్యిగట్టు మీద, కబోర్డ్స్‌లో చిలకరించండి.