ETV Bharat / lifestyle

కరోనాను తరిమికొట్టండి.. కుటుంబంతో సరదాగా గడపండి - lockdown in telangana

మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.. లాక్‌డౌన్‌ విధించాయి.. ప్రజలు తమవంతుగా ఇంట్లో ఉంటూ.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి. అసలు మీకో విషయం తెలుసా ఇల్లే ఓ స్వర్గ సీమ. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపొచ్ఛు. పిల్లలతో ఆడుకోవచ్ఛు. హాయిగా నిద్రపోవచ్ఛు. బోలెడంత విశ్రాంతి తీసుకోవచ్ఛు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు పది రోజుల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉందాం. ‘ఇల్లే స్వర్గం.. కరోనా దూరం’ అని నిరూపిద్దాం. ఓరుగల్లు స్ఫూర్తిని చాటుదాం.

spending-time-with-family-on-lockdown
కరోనాను తరిమికొట్టండి.. కుటుంబంతో సరదాగా గడపండి
author img

By

Published : May 13, 2021, 6:40 AM IST

Updated : May 13, 2021, 7:05 AM IST

ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, మాస్కులు సరిగా ధరిస్తే కరోనాను సులువుగా కట్టడి చేయచ్ఛు కానీ ఈ రెంటిని పక్కకు పెట్టడం వల్లే ఇప్పుడీ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విపత్కర స్థితి నుంచి బయటపడాలని ప్రభుత్వం పదిరోజుల లాక్‌డౌన్‌ విధించింది. ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో ఇల్లే ఒకస్వర్గ సీమలా భావించండి. ఇంటిల్లిపాదితో గడపడానికి ఇదో అవకాశంగా భావించండి.. మధురమైన అనుభూతిని పొందండి.. కాలు మాత్రం బయటపెట్టకండి. కరోనా పోరాటంలో మనవంతుగా కృషి చేద్దాం.. మహమ్మారిని తరిమికొడదాం..

నాడు.. కాకతీయుల పురిటిగడ్డ ఓరుగల్లు. తమ సామ్రాజ్యంపై దండెత్తడానికి వచ్చిన శత్రువులను ఎదిరించారు.. ఖడ్గాలను చేతపట్టి పోరాడారు. తరిమితరిమికొట్టారు. మంచి పాలన అందించారు.. చరిత్రలో నిలిచిపోయారు..

నేడు.. అదే గడ్డపై కరోనాసురుడు విలయతాండవం చేస్తున్నాడు. ప్రజలపై పగపట్టాడు. కంటికి కనిపించకుండా దాడి చేస్తున్నాడు.. భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.. ప్రాణాలూ తీస్తున్నాడు.. మహమ్మారిని అంతం చేయడానికి కత్తులు పట్టాల్సిన అవసరం లేదు. కొవిడ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి. ఇందుకు ఒకటే మార్గం.. వైరస్‌కు చిక్కకుండా ఇంట్లో ఉండాలి. కరోనా రహిత సమాజంగా మార్చాలి.

కళను బయటకు తీయండి..

కళాకారుడిని మేల్కొల్పండి

చిన్ననాడు కొన్ని కళల్లో ప్రవేశం ఉంటుంది. కానీ ప్రావీణ్యం సంపాదించలేదనే ఓ చిన్న నిరాశ మిగిలి ఉండే ఉంటుంది. మీలోని కళాకారుడిని మేల్కొల్పండి. కుంచెతో చిత్రాలు వేయండి, గాత్రంతో పాటలు ఆలపించండి. డైలాగులతో మీలోని నటసార్వభౌముణ్ని మీ కుటుంబ సభ్యులకు పరిచయం చేయండి.

థియేటర్‌గా భావించండి..

అందరితో కలిసి

ఇన్నాళ్లు పనిలో బిజీబిజీగా ఉండే ఉంటారు. సినిమాలు చూడటానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రస్తుత రోజుల్లో 24/7 సినిమాలు వచ్చే ఛానళ్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొత్తవి వస్తున్నాయి. ఎందుకాలస్యం.. మీ ఇంటినే థియేటర్‌లా భావించండి. కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాలు చూస్తూ ఆనందించండి.

పలకరించండి..

బాల్య స్మృతులు నెమరువేసుకోండి

నిత్యం పని ఒత్తిళ్లతో స్నేహితులు, బంధువులతో పలకరింపులు కూడా తగ్గుతున్నాయి. ఇప్పుడా ఆ లోటును పూడ్చండి. మీ బాల్య స్నేహితులకు ఫోన్లు చేయండి.. వారితో మాట్లాడుతూ.. నాటి మధురానుభూతులను నెమరువేసుకోండి. బంధువుల యోగక్షేమాలను తెలుసుకోండి. ఈ కష్టకాలంలో ఓ పలకరింపు సైతం ఎంతో ఓదార్పునిస్తుంది.

గృహమే ఓ రెస్టారెంట్‌..

చెఫ్​గా మారండి

గతంలో అందరూ సరదాగా రెస్టారెంట్లకు వెళ్లి.. నచ్చిన ఫుడ్‌ తినే వాళ్లు. కరోనా వచ్చి వాటిని బంద్‌ చేయించింది. రెస్టారెంట్లు లేవని బాధపకండి.. మీ ఇల్లే ఓ రెస్టారెంట్‌ అనుకోండి. లాక్‌డౌన్‌ వేళ మీరే చె‌ఫ్​గా మారండి. కొత్త రుచులను మీకుటుంబ సభ్యులకు పరిచయం చేసి మార్కులు కొట్టేయండి. యూట్యూబ్‌లో ఎన్నో వంటల కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని చూసి చేయండి.. అందరూ కలిసి ఆరగించండి.

పుస్తకాలు చదవండి..

పుస్తకాలకు ప్రాముఖ్యం

పుస్తకాలు చదవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ సమయం దొరకక చదవలేకపోతున్నారని చెబుతుంటారు. ఇప్పుడు సమయం వచ్చింది. మీకు నచ్చిన పుస్తకాన్ని తెచ్చుకొని చదువుకోండి. వివిధ వెబ్‌సై ట్‌లలో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. చదువుకునేందుకు కూడా సమయం కేటాయించుకోవచ్చు.

వ్యాయామ శాలగా..

ఇంట్లోనే జిమ్

చాలామందికి ఉదయాన్నే వాకింగ్‌, జిమ్‌లకు వెళ్లడం అలవాటు. ఈ విపత్కర పరిస్థితుల్లో జిమ్‌లు బంద్‌ అయ్యాయి. ట్రెడ్‌మిల్‌, సైక్లింగ్‌ తదితర వాటితో పాటు జిమ్‌కు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయండి. మీ ఇంటినే వ్యాయామ శాలగా మార్చుకోండి. అందరూ కలిసి కసరత్తులు చేయండి. మీ ఇంటి ఆవరణలో నడవండి. ఇలా ఉదయం, సాయంత్రం కనీసం 20 నిమిషాల పాటు చేసేలా ప్రణాళిక రూపొందించుకుంటే మేలు.

విద్యాలయంగా..

సందేహాలు నివృతి చేయండి

విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. తరగతి గదిలో కూర్చొని పాఠాలు విని చాలా రోజులవుతోంది. ఇప్పుడు మీ ఇంటిని విద్యాలయంగా మార్చి పిల్లలకు విద్యను నేర్పించండి. మీకు తెలిసిన విషయాలను వారితో పంచుకోండి. చదువులో సందేహాలుంటే నివృత్తి చేయండి. పుస్తకాలపై ఆసక్తి కలిగేలా చైతన్యపర్చండి. మీ చిన్ననాటి పాఠశాల, విద్యా విధానాలు, ఆనాటి సౌకర్యాలు చిన్నారులకు చెప్పండి.

వైద్యశాలగా..

మెడికల్ కిట్​

ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య విషయాలపై అవగాహన చాలా అవసరం. ప్రతి చిన్న విషయాన్ని ఆసుపత్రులకు వెళ్లడం కూడా అంత మంచిది కాదు. మందుల కోసం ప్రతిసారి మెడికల్‌ షాపులకు కూడా వెళ్లవద్ధు పల్స్‌ ఆక్సిమీటర్‌, షుగర్‌, బీపీ, హార్ట్‌బీట్‌లను తెలుసుకునేందుకు పరికరాలను అందుబాటులో ఉంచుకోండి. వైద్యుల సలహాలతో కావాల్సిన మందులు ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకోండి. ఇంటినే వైద్యశాలగా మార్చుకోండి.

ఇదీ చూడండి: ఉచిత టీకా​ కోసం మోదీకి విపక్ష నేతల లేఖ

Last Updated : May 13, 2021, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.