* వేడుకలేవైనా భారీ జరీ, పట్టు చీరలకు ప్రాధాన్యమిస్తుంటాం. ఫంక్షన్లప్పుడు బయటకు తీసి తర్వాత వాటి సంగతే మర్చిపోతుంటాం. ఈ కాలంలో కట్టుకుంటే వాటిని పూర్తిగా ఆరేంతవరకూ వేలాడదీసి, ఐరన్ చేశాకే భద్రపరచండి. తేమ చేరకుండా మస్లిన్ లేదా కాటన్ క్లాత్‌లో చుట్టి పెట్టండి. నాఫ్తలీన్ గోళీలు కరిగి వాటి రంగు దుస్తులకు పట్టొచ్చు. బదులుగా సిలికా జెల్ సాచెట్‌లను ఉంచండి. లేదంటే కాటన్ వస్త్రంలో చుట్టి పెట్టొచ్చు. ఇవి ముక్క వాసనను దూరం చేస్తాయి, తేమనూ పీల్చుకుంటాయి.
* తేమ వల్ల గిల్టు నగల రంగు వెలిసిపోవడమే కాకుండా ఫంగస్ కూడా పెరుగుతుంది. బ్యాగుల రింగులూ తుప్పూ పడుతుంటాయి. కాబట్టి నగలు, బ్యాగులను అట్టపెట్టెలు లేదా క్లాత్ బ్యాగుల్లో ఉంచండి. బ్యాగుల్లో పేపర్లను ఉంచండి.
* వార్డ్‌రోబ్‌ల్లో చాక్‌పీస్‌లు, వేపాకులు ఉంచినా తేమను దరిచేరనివ్వవు. ర్యాకుల్లో పేపర్లను రెండు పొరలుగా వేసి, అప్పుడు బట్టలు పెట్టుకుంటే మంచిది.
ఇదీ చూడండి: Umbrella : ఎక్కడికెళ్లినా.. గొడుగు తీసుకెళ్తున్నారా?