- మాట్లాడండి: ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నచ్చే, నచ్చని ఏ విషయమైనా విడమరిచి చెప్పాలి. మొదట చిన్నగా అనిపించినవే పోనుపోనూ చిరాకుగా అనిపించొచ్చు. ఏదైనా తెలియకపోయినా అడగొచ్చు. అంతేకానీ ప్రశ్నించినట్లు ఉండొద్దు. కావాలంటే నెమ్మదిగా చర్చించొచ్చు.
- గుర్తించండి: దాంపత్యంలో ఒకరికోసం ఒకరు చేసేవి చాలానే ఉంటాయి. కానీ అన్నింటినీ ఇది మామూలేగా అన్నట్లు చూడొద్దు. మీ కోసం సమయం తీసుకునిమరీ ఏదైనా తీసుకొచ్చారనుకోండి! థాంక్స్ చెప్పిచూడండి. చాలా సంతోషిస్తారు. చిన్నవే అయినా మీ గుర్తింపు వారికి ఆనందమిస్తుంది. తిరిగి మీరు చేసేవాటినీ గమనిస్తారు.
- సమయమివ్వండి: భార్యాభర్తలిద్దరూ ఒకటే అయినా.. ఎవరికి వారికి వ్యక్తిగత సమయం అవసరమవుతుంది. వారి స్నేహితులు, బంధువులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. భిన్న అభిరుచులూ ఉండొచ్చు. అలాంటప్పుడు వారికి కాస్త సమయమివ్వండి. మీ మీద గౌరవం పెరుగుతుంది.
- వదిలేయండి: చిన్న చిన్న గిల్లికజ్జాలు ఏ బంధంలోనైనా సాధారణమే. కానీ అవి అప్పటికప్పుడు పరిష్కరించుకునేలా ఉండాలి. విభేదాలొచ్చిన ప్రతిసారీ పాత సంఘటనలన్నీ ఏకరువు పెడితే చిన్న అపార్థం కాస్తా పెద్ద గొడవగా మారే ప్రమాదముంటుంది.
ఇవీచూడండి: అన్వేషి.. అభిమానుల మది అమాంతం దోచేసి!