ETV Bharat / lifestyle

TIPS FOR COUPLES: సంతోషాలకు సప్తపది!

భార్యాభర్తలు పాలూ నీళ్లలా కలిసిపోవాలి. ఒకరి నొకరు అర్థం చేసుకోవాలి. ఎదుటి వారిని గౌరవించాలి. చెప్పేది పూర్తిగా వినాలి. అప్పుడే కాపురం కలతలు లేకుండా సాగుతుంది. అందమైన బంధంలోకి అడుగుపెట్టిన జంటకు మరికొన్ని మార్గదర్శకాలు...

author img

By

Published : Sep 8, 2021, 11:34 AM IST

TIPS FOR COUPLE
సంతోషాలకు సప్తపది!

పెళ్లంటే నూరేళ్ల పంట. విభిన్న అభిరుచులు కలిగిన కుటుంబాల నుంచి వచ్చి... ఇరువురూ కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే ఈ దాంపత్య జీవితంలో అనుబంధాలతో పాటు అనేక ఒడుదొడుకులు ఉంటాయి. అప్పుడే బేధాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో మీ బంధం పదిలంగా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.!

  • మీరు ఎంత బిజీగా ఉన్నా ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవాలి. రోజులో కొన్ని పనులు కలిసి చేసే, కలిసి ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది.
  • వీలైనంతవరకూ రోజులో ఎక్కువసార్లు భాగస్వామికి మీ ప్రేమను చేతల్లో చూపండి. పనుల్లో సాయం చేయడం, ఇద్దరూ పనులు పంచుకోవడం, తనకిష్టమైనవి చేయడం... లాంటివన్న మాట.
  • మీ భావాలను ఎదుటివారితో పంచుకోవాలి. సంతోషం, దుఃఖం, బాధ... ఇలా ప్రతిదీ షేర్‌ చేసుకోవాలి.
  • ఒకరికోసం మరొకరు అన్నట్లుగా ఉండాలి. ఎదుటివారి కోసం కొన్ని వదులుకోవడానికి, మరికొన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
  • భాగస్వామిపై చెప్పలేనంత ప్రేమ ఉన్నా తనకంటూ కొంత సమయం/స్పేస్‌ను ఇవ్వాలి. ఆలుమగలన్నాక అప్పుడప్పుడు చిరు గొడవలు సహజమే... అయితే వాటిని చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. అంతే తప్ప మేమే గొప్ప అనే అహాన్ని ఇరువురూ ప్రదర్శించకూడదు. ఇలా చేస్తే సున్నితమైన మీ బంధం క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉంది.
  • ఇతరులతో ఎప్పుడూ పోల్చొద్దు. ఉన్నంతలో సంతోషంగా, కలహాలు, కలతలు లేకుండా ఉండేందుకు ఇద్దరూ కృషి చేయాలి.
  • భాగస్వామి కోసం అప్పుడప్పుడు సర్‌ప్రైజ్‌లను ప్లాన్‌ చేయాలి. ఆ సమయంలో ఎదుటి వారి కళ్లలోని ఆశ్చర్యానందాలను మీరెప్పటికీ మరిచిపోలేరు.

భార్యాభర్తల కుటుంబ నేపథ్యం, చదువు, అలవాట్లు వంటివన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఏడడుగులు నడిచిన తర్వాత కూడా ఇరువురి పద్ధతులు, జీవనశైలి వేరేగా ఉండొచ్చు. అయితే ఇద్దరూ జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని అనుకోవడం మాత్రం తప్పనిసరి. అది వారి ఉద్యోగానికి సంబంధించినదైనా కావొచ్చు. లేదా కుటుంబానికి చెందినదైనా అవ్వొచ్చు. ఉన్నత విద్యాభ్యాసంపై ఆసక్తి, ఆర్థికంగా నిలబడాలనే ఆశ వంటివి ఒకరికొకరు పంచుకోవాలి. పరస్పరం ఆశయాల సాధనలో ప్రోత్సహాన్ని అందించుకోలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.

ఇదీ చూడండి: Relationships: దాంపత్య జీవితం రొమాంటిక్​గా సాగాలంటే.. ఇలా చేయండి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.