ETV Bharat / lifestyle

స్నేహితుల రోజు గురించి ఈ విశేషాలు విన్నారా? - ఫ్రెండ్‌షిప్ డేే

మనతో ఎలాంటి చుట్టరికం లేకపోయినా.. మన బాధలో, కష్టాల్లో, ఆనందంలో, ఆపదలో మనకు తోడుగా నిలిచేది ఫ్రెండ్ ఒక్కరే..! మనం తప్పు చేస్తే సరిదిద్దేది వాళ్లే..! బాధలో ఉన్నప్పుడు మన కన్నీళ్లు తుడిచేది వాళ్లే..! కుటుంబ సభ్యులతో పోటీగా కడదాకా మనపై ప్రేమను కురిపించేది వాళ్లే..! అలాంటి స్వచ్ఛమైన స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునేదే 'ఫ్రెండ్‌ఫిప్ డే'..!

some-interesting-facts-about-friendship-day-in-telugu
స్నేహితుల రోజు గురించి ఈ విశేషాలు విన్నారా?
author img

By

Published : Aug 1, 2020, 6:40 PM IST

Updated : Aug 2, 2020, 5:01 AM IST

'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..' అన్నాడో కవి. నిజమే కదా మరి.. ఈ సృష్టిలో శాశ్వతంగా నిలిచిపోయే బంధమంటే అది స్నేహమే. ఆస్తి, అంతస్తులతో పనిలేకుండా, లింగభేదం చూసుకోకుండా, నిస్వార్థంతో వ్యవహరించే అనురాగ బంధం ఇది. ఇంతటి మధురమైన అనుబంధం కాబట్టే దీనికంటూ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. ఆ రోజున స్నేహితులంతా ఒక్కచోట చేరి ఆనందంగా ఆడిపాడతారు. మరుసటి ఏడాది వరకూ గుర్తుండిపోయే మరెన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు. ఇంతటి నేపథ్యం ఉన్న స్నేహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడానికి స్నేహితుల దినోత్సవానికి మించిన సందర్భం మరొకటి ఏముంటుంది చెప్పండి..

ఫ్రెండ్‌షిప్ డేే కు ఆద్యుడు ఎవరంటే..!

స్నేహితుల దినోత్సవం పేరిట ఏటా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులంతా ఒక్కచోట చేరి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం వెనక ఉన్న అంతరార్థం గురించి చాలామందికి తెలియదు. 1958, జులై 20న డా. అర్టెమియోబ్రాకో అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. చాలాకాలం తర్వాత మిత్రుల్ని కలవడంతో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ వారంతా ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఈ ఎంజాయ్‌మెంట్ కేవలం ఈ రోజుకే పరిమితం కాకూడదని.. ప్రతి ఏడాది తామంతా కలుసుకోవాలని, తనలాగే ప్రజలంతా తమ స్నేహితులతో సంతోషంగా గడపాలనే ఆలోచన ఆ క్షణం ఆయన మనసులో మెదిలింది. అంతే.. వెంటనే ఈ విషయాన్ని అక్కడున్న మిత్రులతోపాటు ప్రజలకు సైతం తెలిసేలా చేశాడు. అలా సరిగ్గా పది రోజులకు అంటే జులై 30న మెక్సికో నగరంలోని ప్యుర్టో పినాస్కో అనే నగరంలో మొదటిసారిగా ఫ్రెండ్‌షిప్ డే సంబరాలు జరిగాయి. అందుకే అర్టెమియోబ్రాకోను ఫ్రెండ్‌షిప్ డేకు ఆద్యుడిగా పరిగణిస్తారు. ఇలా అప్పటినుంచి ఏటా జులై 30న యూఎస్‌తో పాటు పలు దేశాల్లో స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరికొన్ని దేశాల్లో మాత్రం వేర్వేరు తేదీల్లో ఫ్రెండ్‌షిప్ డే చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన దేశంలో ఏటా ఆగస్టు తొలి ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం.

అక్కడ మహిళలకు ప్రత్యేకంగా...

మహిళా దినోత్సవం, మదర్స్ డే.. వంటి రోజులు కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకం.. అదే స్నేహితుల దినోత్సవం అంటే.. ఆడ, మగ అనే లింగ భేదాలు లేకుండా జరుపుకొనే రోజు. కానీ మహిళలకంటూ ప్రత్యేకంగా ఫ్రెండ్‌షిప్ డే అంటూ ఒకటి ఉందన్న విషయం మీకు తెలుసా? అవును.. మీరు విన్నది నిజమే. వర్జీనియాలో 1897లో స్థాపించిన 'కప్పా డెల్టా' అనే సోషల్ క్లబ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్న దాదాపు 1.80 లక్షల మంది మహిళలంతా కలిసి తొలిసారిగా జాతీయ మహిళా స్నేహితుల దినోత్సవం జరుపుకొన్నారట. మహిళల కోసం మహిళలంతా కలిసి జరుపుకునే ఈ ప్రత్యేకమైన రోజుకు యూఎస్ రాష్ట్రాల్లోని గవర్నర్‌లు క్రమంగా మద్దతివ్వడంతో అక్కడ ఏటా సెప్టెంబర్‌లోని మూడో ఆదివారం నాడు జాతీయ మహిళా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున ఒకరికొకరు విలువైన బహుమతులు అందించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా మహిళలంతా కలిసి కట్టుగా ఉన్నామనే సందేశాన్ని ఈ ప్రత్యేక సందర్భం ద్వారా చెప్పకనే చెబుతున్నారు అక్కడి మహిళలు.

ప్రపంచ శాంతే లక్ష్యంగా..!

మనం జరుపుకొనే ప్రత్యేకమైన రోజుల్లో ఏదో ఒక ప్రత్యేకత దాగుంటుంది. మహిళా శక్తిని చాటడానికి మహిళా దినోత్సవం, మనసులోని ప్రేమను తెలియజేయడానికి ప్రేమికుల దినోత్సవం.. ఇలా ఒక్కో సందర్భానికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే స్నేహంలోని మాధుర్యాన్ని చాటుతూ ఏటా స్నేహితుల దినోత్సవాన్నీ జరుపుకుంటున్నాం. అయితే అగ్రరాజ్యమైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాత్రం స్నేహానికి కేవలం ఒక రోజును మాత్రమే కాదు.. ఫిబ్రవరి నెల మొత్తాన్నీ 'ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ మంత్'గా ప్రకటించాయి. అయితే ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? దేశాల మధ్య మంచి స్నేహబంధం చిగురించి శాంతి నెలకొనేందుకే యూఎస్ దీన్ని ఏర్పాటుచేసింది. అంతేకాదు.. ఈ నెల రోజుల పాటు అక్కడ స్నేహితుల కోసం సరదాగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటుచేస్తుంటారు. ఫ్రెండ్సంతా కలిసి క్రాఫ్ట్స్ రూపొందించడం, కలిసి బయటకెళ్లడం, ట్రిప్స్ పేరుతో వేర్వేరు దేశాలు సందర్శించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పార్టీలు.. ఇలా అనేక విధాలుగా తమ స్నేహ బంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాదు.. ఈ సందర్భంలో అక్కడి ప్రభుత్వాలు కూడా ప్రజలకు కొన్ని వెసులుబాట్లు, సౌకర్యాలు కల్పిస్తున్నాయంటే స్నేహానికున్న గొప్పతనమేంటో అర్థమవుతుంది.

ఫ్రెండ్‌షిప్ డే అంబాసిడర్ ఇది...

తన స్వార్థం తాను చూసుకోవడం కాకుండా.. ఇతరులకు సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి గుణమే 'విన్నీ ద పూ' అనే ఎలుగుబంటిది కూడా..! దీనిపై చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం పూ తన స్నేహితులు పిగ్లట్, టిగ్గర్, ఇయోరే, గుడ్లగూబ, కుందేలు.. వంటి ఇతర జంతువులతో కలిసి దాదాపు వంద ఎకరాల స్థలంలో నివసించేదట. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ కిష్టమైన తేనె, పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారాల్ని తీసుకొచ్చేదట! అంతేకాదు.. వాటికి అన్ని రకాలుగా సహాయం చేసేదట పూ. ఇలా తన స్నేహితులకు అన్ని రకాలుగా సహాయపడిన విన్నీ ది పూను ఎ.ఎ. మిల్నే అనే రచయిత 1997లో వరల్డ్ ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్‌గా ప్రకటించారు.

ఈ పువ్వులే ఎందుకిస్తారంటే..?

స్నేహితుల దినోత్సవం నాడు మిత్రులకు పసుపు రంగు రోజాపూలిచ్చి శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణమే. అయితే ఇవే ఎందుకిస్తారో తెలుసా? పసుపు రంగు.. గౌరవం, అభిమానం, ఆశావాదానికి ప్రతీక. స్నేహితులపై తమ ప్రేమను తెలియజేస్తూ అది కలకాలం శాశ్వతంగా ఉండిపోవాలని, వారు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ పువ్వును ప్రేమగా తమ ప్రియనేస్తాలకు అందిస్తుంటారు. దీంతోపాటు ఇద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని, తీపిగుర్తులను పంచుకుంటూ ఓ గులాబీ రోజాను కూడా అందిస్తే.. స్నేహబంధానికి పూర్తి అర్థాన్ని జోడించినవారవుతారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

Last Updated : Aug 2, 2020, 5:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.