- సమస్య చిన్నదైనా పెద్దదైనా ముందు గొడవకు కారణం ఏంటో తెలుసుకోండి. విషయం ఏదైనా పారదర్శకంగా ఉన్నప్పుడు సమస్య సులువుగా పరిష్కారమవుతుందని గుర్తుంచుకోండి.
- ఇంటిపనీ, ఆఫీసు పనీ రెండూ చేసే మీకు ఒక్కోసారి అలసటగానూ ఉండొచ్ఛు అలాంటప్పుడు ‘పనిలో ఎవరైనా సాయపడితే బాగుండు’ అని అనిపిస్తుంది. అది మీ పెదవి దాటదు. అవతలివారికి అర్థం కాదు. మీ సమస్యను చెప్పి, పరిష్కారం కుటుంబ సభ్యులనే అడగండి. మీ అభిప్రాయాన్నీ చెప్పండి. పనిని పంచుకోగలిగితే మీపై ఒత్తిడి తగ్గుతుంది. ఎదుటివారూ మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు.
- కుటుంబ సభ్యులందరూ వారమంతా ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా గడిపేస్తారు. ఇలాగే జీవితం గడిచిపోతుంటే బంధాలు యాంత్రికమైపోతాయి. అందుకే వారంలో ఓ రోజైనా అందరితో కలిసి గడపండి. అప్పుడు అనుబంధాలు పెరుగుతాయి. అపార్థాలూ, అపోహలూ తగ్గుతాయి.
ఇదీ చదవండిః బయటికి చెప్పరు.. కానీ దీని గురించే గొడవ పడతారట !