ETV Bharat / lifestyle

New Relation : కలహాల కాపురానికి బై.. కొత్త బంధాలకు సై - people saying god bye to bad relationships

చిన్న వయస్సులో పెళ్లి.. వయసుకు మించిన బాధ్యతలు.. భాగస్వామితో కలహాలు.. జీవితం ఎటు పోతుందో అర్థం కాకముందే పిల్లలు.. వారి చదువులు.. పిల్లల వివాహాలు.. ఇలా తమకంటూ కాస్త సమయం వెచ్చించుకునే అవకాశం కూడా లేకుండా ఎంతో మంది దంపతులు తమ జీవితాలను వెల్లదీస్తున్నారు. కాపురంలో నిత్యం గొడవలే జరుగుతున్నా.. తాము సంతోషంగా లేకున్నా.. పిల్లల కోసమో సమాజం ఏం అంటుందోననో సర్దుకుపోయి జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. తమకేం కావాలో తెలుసుకోవడమే కాదు.. దాని కోసం ధైర్యం చేసి ఓ అడుగు ముందుకేస్తున్నారు. నిత్యం కలహాలతో కలిసి బతికే బదులు విడిపోయి ఎవరికి వారు జీవించడానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. అంతే కాకుండా.. కొత్త బంధాలకు స్వాగతం పలుకుతున్నారు.

people-are-daring-to-free-from-abusive-relationship
కలహాల కాపురానికి బై.. కొత్త బంధాలకు సై
author img

By

Published : Jul 11, 2021, 10:43 AM IST

  • ‘ఇప్పటి వరకూ పిల్లలు స్థిరపడాలని బాధలు భరిస్తూ వచ్చాను. మిగిలిన కొద్దికాలమైనా నా కోసం బతకాలనుకుంటున్నా. చట్టబద్ధంగా మా వారి నుంచి విడాకులు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ముందుగానే ఈ విషయం పిల్లలతో పంచుకున్నా. కొడుకు వద్దని వారించాడు.. నీ ఇంటికి రానన్నాడు. కూతురు మాత్రం మంచి నిర్ణయమంటూ గుళ్లో జరిగిన పెళ్లికి పెద్దగా వచ్చింది. అల్లుడు కూడా మాకు శుభాకాంక్షలు చెప్పాడు’’.
  • 45 ఏళ్ల వయసులో భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లితో మరో ప్రయాణానికి సిద్ధమైన సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని అంతరంగం. 15 ఏళ్లకే పెళ్లయింది.. ఆ తరువాత చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా.. అయినా రోజూ వేధింపులు. నా తలరాత ఇంతే అనుకున్నా. సమాజంలో వస్తోన్న మార్పుతో నాలోనూ ధైర్యం పెరిగింది. పదేళ్లుగా తెలిసిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు కారణమైందంటూ ఆమె వివరించారు.
స్నేహబంధం.. భావోద్వేగ అనుబంధం..

స్నేహబంధం.. భావోద్వేగ అనుబంధం..

కాపురంలో నిత్య కలహాలతో బాధపడటం కంటే విడిపోయి ఎవరి జీవితం వారు బతుకుదామనే అభిప్రాయానికి దంపతులు వస్తున్నారు. పరువు, ప్రతిష్ఠలను మించి వ్యక్తిగత సంతోషానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తల్లిదండ్రులు మరొక భాగస్వామిని ఎంచుకోవడాన్ని పిల్లలు జీర్ణించుకోలేకపోయేవారు. మారుతున్న పరిస్థితుల్లో తామే దగ్గరుండి కొత్త బంధాలకు ఆహ్వానం పలుకుతున్నారు. కన్నవారి సంతోషం కోసం తీసుకునే నిర్ణయాలను ఆమోదిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివాహ పరిచయ వేదికలు, మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లు రెండోపెళ్లికి తోడు వెతికే మధ్యవయసు వారికి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కొన్నేళ్లుగా సమాజం కూడా గృహిణుల నిర్ణయాన్ని సానుకూలంగా స్వీకరిస్తోంది. మహిళలు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేస్తున్నారు. వీటన్నింటినీ మించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు స్వేచ్ఛగా, ధైర్యంగా నిర్ణయం తీసుకునేలా చేస్తున్నాయంటున్నారు న్యాయవాది సునీతాదేవి.

భద్రత.. ఆత్మీయత

ఏదైనా కారణంగా భర్తకు దూరమైన మహిళలు జీవితాంతం ఒంటరిగా ఎవరో ఒకరిపై ఆధారపడాల్సి వచ్చేది. సమాజం ఏమనుకుంటుందనే భయం వెంటాడేది. ఇప్పుడు విడాకులు/అనారోగ్యం/ప్రమాదవశాత్తూ భర్త దూరమైనా వయసుతో సంబంధం లేకుండా 50ల్లోనూ తగిన తోడు కోసం వెతుకుతున్నారు. పిల్లల బాధ్యతలు పూర్తిచేసి నరకంలాంటి సంసారంలో ఉండటం కంటే ఆత్మీయతను పంచే భాగస్వామితో కలసి నడుద్దామనే ఆలోచనలు అతివలను మరో అడుగు ముందుకేసే ధైర్యాన్ని ఇస్తున్నాయంటారు కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ రాంచందర్‌. శారీరకమైన ఆకర్షణను మించిన మానసిక బంధాలు ఆ పెళ్లి బంధంలో ఎక్కువగా ఉంటాయని విశ్లేషించారు.

సమాజం అంగీకరిస్తోంది..

- రాజేశ్వరిదేవి, తోడు-నీడ వ్యవస్థాపకురాలు

సమాజం అవసరాలకు తగినట్టుగా మారుతోంది. వంటగదికే పరిమితమైనంత కాలం మహిళలు భర్త, పిల్లలపై ఆధారపడాల్సి వచ్చేది. చదువులు, ఉద్యోగ అవకాశాలతో ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది. పదేళ్ల క్రితం రెండోపెళ్లి చేసుకున్న మహిళలంటే చిన్నచూపు ఉండేది. క్రమంగా వారి సంఖ్య పెరగటంతో సమాజం కూడా అంగీకరిస్తోంది. ప్రస్తుతం భర్త నుంచి వేరుపడిన 50 ఏళ్లు దాటిన 100 మంది మహిళలు మనువు కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఒంటరితనం, మానసిక భావోద్వేగాలను పంచుకునే వారుంటే చాలనుకుంటున్నారు.

నచ్చినట్లుగా.. కొత్త బంధాలు

- డాక్టర్‌ హరికుమార్‌, మనస్తత్వ నిపుణులు

ఆయు ప్రమాణాలు పెరిగాయి. 50, 60 వయసులోనూ కొత్త బంధాలను వెతుక్కుంటున్నారు. సమ వయసు ఉన్నవారితో వివాహం, లేకుంటే సహజీవనం కొనసాగిస్తున్నారు. ఈ వయసులో ఆరోగ్య సమస్యలు, చిన్నచూపు, ఆత్మాభిమానం దెబ్బతినటం, కన్నబిడ్డల ఈసడింపులు తదితర ఇబ్బందులతో ఉండే ఒంటరి మహిళ/పురుషులు తోడు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు, పిల్లల సమస్యలు తీరాయని భావించినపుడు రెండో సగం జీవితం తనకు నచ్చినట్టు బతుకుదామనే నిర్ణయానికి వస్తారు. వృద్ధాశ్రమాలకు ప్రత్యామ్నాయంగా జీవిత భాగస్వామితో కలసి ఉండటానికి మొగ్గుచూపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.