ETV Bharat / lifestyle

మీ పిల్లలను చిరుతిళ్ల నుంచి దూరం చేయండిలా..!

మీ పిల్లలు ఏది పెట్టినా తినట్లేదా? ఎంతసేపు చిరుతిళ్లు, చాకెట్లనే ఇష్టపడుతున్నారా? వారికి పోషకాహారాన్ని అలవాటు చేయాలంటే ఈ చిట్కాలు పాటించేయండి!

Keep your children away from snacks using these tips
మీ పిల్లలను చిరుతిళ్ల నుంచి దురం చేయండిలా..!
author img

By

Published : Oct 6, 2020, 9:34 AM IST

చిన్నారులకి ఏడు నెలల నుంచే ఘన పదార్థాలను చాలా మెత్తగా చేసి పెట్టొచ్చు. రకరకాల ఆహార పదార్థాలను పరిచయం చేయడానికి ఇదే సరైన సమయం. ఆహారాన్ని మెత్తగా, బరకగా, గుజ్జుగా చేసి పెట్టొచ్చు. విభిన్నమైన రంగుల్లో, పలు రుచుల్లో పరిచయం చేయొచ్చు. ఏడు నెలల నుంచి సంవత్సరం నిండేలోపు దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలను రుచి చూపించాలి. చిన్నప్పట్నుంచే వీటిని మొదలుపెడితే చిన్నారికి అన్నీ అలవాటు అవుతాయి.

మూడేళ్ల మీ చిన్నారిని మీతోపాటు భోజనాల బల్లపై కూర్చోపెట్టండి. తనే కొద్దికొద్దిగా తినేలా నేర్పించండి. ముందు తినకుండా ఇబ్బంది పెట్టినా మెల్లగా అలవాటు అవుతుంది. అయితే వాళ్ల పొట్ట చాలా చిన్నది. కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టాలి. ఇంట్లో స్వీట్స్‌, బిస్కట్స్‌, చాక్లెట్స్‌ అస్సలు పెట్టొద్దు. అన్ని రకాల ఆహార పదార్థాలతో కూడిన ప్రణాళిను రూపొందించుకోండి. మెత్తగా ఉడికించిన కూరగాయల ముక్కలు, ఆకుకూరల పేస్ట్‌, పండ్ల గుజ్జు, మెత్తగా చేసిన ఉప్మా, ఇడ్లీ, కిచిడీ, పొంగలి... చాలా మెత్తగా ఉడకబెట్టిన కీమా, చికెన్‌.. ఇవన్నీ కొద్దికొద్దిగా ఏడాది వయసు నుంచే అలవాటు చేయాలి.

ఇప్పటికైనా ఫరవాలేదు మెల్లగా మొదలుపెట్టండి. చిన్నారులు సహజంగా రంగురంగుల ఆహారాన్ని ఇష్టపడతారు. కాబట్టి మీ బాబుకు పండ్లను రకరకాల ఆకారాల్లో కోసి పెట్టొచ్చు. పండ్లరసాలు, పాలను పారదర్శకంగా ఉండే కప్పుల్లో పోసిస్తే చక్కగా తాగుతారు. అందమైన బొమ్మలున్న ప్లేట్లలో ఆహారాన్ని చక్కగా డెకరేట్‌ చేసి పెట్టండి. కలర్‌ఫుల్‌ రైస్‌, క్యారెట్‌, బీట్‌రూట్‌ చపాతీలు, ఎగ్‌ పుడ్డింగ్‌, వెజిటబుల్‌ కట్‌లెట్‌ చేసి పెట్టండి. మామిడి, బొప్పాయి పండ్ల జామ్‌లు, ఫ్రూట్‌ జెల్లీలను, మిల్క్‌షేక్‌లను ఇంట్లోనే సహజంగా తయారుచేసి పెట్టొచ్ఛు చిన్నారికి ఏం కావాలో తెలుసుకుంటూ చేసిపెట్టండి.

ఇదీ చదవండిః చినుకు కాలంలో... చిన్నారి ఆరోగ్యం భద్రమిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.