కొంతమంది భాగస్వామి కోపంలో అన్న మాటలను పదేపదే గుర్తుచేసుకుని బాధపడుతుంటారు. అలా కాకుండా ఆ మాటలను అనడానికి గల కారణాలను తెలుసుకుని మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి.
ఒకరు ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు మరొకరు అంతే ఆవేశంగా జవాబివ్వకూడదు. మౌనంగా ఉండి వారి కోపం తగ్గిన తర్వాత పరిస్థితులను మెల్లగా వివరించాలి. ఒకరు ఎప్పుడూ కోప్పడుతుంటే మరొకరు భయపడుతూ ఉండాలనేది దీనర్థం కాదు. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్దుకుపోవాలి.