ETV Bharat / lifestyle

దంపతుల మధ్య సమస్యలకు పరిష్కారం ఇలా సాధ్యం...! - eenadu stories

సంసారమన్నాక భార్యాభర్తల మధ్య వివిధ సమస్యలు రావడం.. వాటిని పరిష్కరించుకోవడం సర్వసాధారణం. అయితే కొంతమంది దంపతులు మాత్రం ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడంలో విఫలమవుతుంటారు. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల కారణంగా గొడవలు మితిమీరి చివరికి విడిపోయేందుకూ వెనకాడట్లేదు. మరి, భార్యాభర్తలిద్దరి మధ్య అప్పుడప్పుడు ఏర్పడే ఇలాంటి ప్రతికూల వాతావరణం వల్ల బంధం తెగిపోవాల్సిందేనా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులనూ అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. మరి.. అవేంటో తెలుసుకుందాం రండి..

How to overcome couples problems
సమస్యలకు పరిష్కారం ఇలా సాధ్యం...!
author img

By

Published : Apr 4, 2021, 6:08 PM IST

భార్యాభర్తలిద్దరిలో ఎవరి వల్ల సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంటుంది. కాబట్టి 'నీ వల్లే ఈ సమస్య.. అందుకే ఇన్ని కష్టాలు..' అని దెబ్బలాడుకోవడం మానేసి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే విషయం గురించి ఆలోచించాలి. ఒకవేళ అది మీ వారి వల్ల వచ్చిన సమస్యే అయినా, మొత్తం వారిపైనే వదిలేయకుండా.. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ పాడవకుండా ఉంటుంది. సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఫలితంగా భార్యాభర్తల అన్యోన్యత దెబ్బతినకుండా ఉంటుంది.

వింటున్నారా? లేదా?

ఏ సంబంధంలోనైనా అపార్థాలు రాకుండా ఉండాలంటే వ్యక్తుల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఇది దంపతులకు కూడా వర్తిస్తుంది. ఇరువురిలో ఎవరి వల్ల సమస్య తలెత్తినా మరొకరు వారిని ద్వేషించకుండా.. సమస్య గురించి నెమ్మదిగా, క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది సాధ్యం కావాలంటే ముందుగా ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినాలి. దీనికోసం ఇద్దరూ గొడవలు పెట్టుకోవడం ఆపేసి ఒక చోట కూర్చుని మాట్లాడుకోవాలి. సమస్యకు తగిన పరిష్కారం ఆలోచించాలి. ఒకవేళ అప్పటికప్పుడు మీకు ఏ పరిష్కార మార్గం దొరక్కపోయినా టెన్షన్ పడకుండా.. ఎదుటి వారిని టెన్షన్ పెట్టకుండా మీ స్నేహితులకు లేదంటే కుటుంబ సభ్యులకు సమస్య వివరించి తగిన సలహా తీసుకోవడం మంచిది. దీనివల్ల మీ బంధానికి కూడా ఎలాంటి అపాయమూ ఉండదు. అంతేకానీ నిరాశానిస్పృహలతో ఒకరినొకరు ద్వేషించుకుంటుంటే బంధం బలహీనపడడంతో పాటు మానసిక ఆందోళన, ఒత్తిడి కూడా పెరుగుతాయి.

నమ్మకంతో జయించండి!

ఒక బంధం బలపడాలంటే వ్యక్తుల మధ్య నమ్మకం ఎంత ముఖ్యమో.. భార్యాభర్తలకు ఎదురైన సమస్య పరిష్కారం కావాలన్నా ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండడం కూడా అంతే ముఖ్యం. కానీ కొంతమంది మాత్రం.. 'సమస్య నీ వల్లే వచ్చింది.. ఇక దాన్ని నువ్వేం పరిష్కరిస్తావులే..' అంటూ అపనమ్మకంతో వాళ్లను నిరుత్సాహపరుస్తుంటారు. దీంతో వాళ్లకుండే కాస్త ఉత్సాహం, చురుకుదనం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరూ కూడా పరస్పరం ఒకరిపై ఒకరు పూర్తిగా నమ్మకం ఉంచుకోండి.. సమస్యను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగండి.. తద్వారా ఒకరిపై మరొకరికి ప్రేమ, అభిమానం మరింతగా రెట్టింపై బంధం బలపడుతుంది.

ఆలోచనా విధానం...

నెగెటివ్‌గా ఆలోచిస్తే ఎంత చిన్న విషయమైనా నెగెటివ్‌గానే కనిపిస్తుంది. ఇలాంటి ప్రవర్తన సమస్యను పరిష్కరించడానికి ఎంతమాత్రం పనికిరాదు. అలాగే కొంతమంది వారి భాగస్వామి పట్ల ఎప్పుడు చూసినా నెగెటివ్ భావనతోనే ఉంటారు. ఈ క్రమంలో కనీసం వారు సమస్యలలో ఉన్నప్పుడైనా మీ ఆలోచనా విధానం మార్చుకోవాలి. వారి పట్ల సానుకూల ధోరణితో ఆలోచించాలి. సమస్యను అధిగమించే దిశగా మీ సలహాలను వారితో పంచుకుని వారికి మీ పూర్తి సహాయసహకారాలు అందించాలి. ఇలా ఇద్దరి ఆలోచనా విధానాలు కలిసినట్లయితే ఎలాంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించుకోవచ్చు.

ఒకరికొకరు...

మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా సరే.. ఎప్పుడో ఒకసారి అనుకోకుండా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం సాధారణం. అయితే ఇలాంటి సందర్భాల్లో కొంతమంది ముందూ వెనకా ఆలోచించకుండా.. అసలు సమస్య గురించి తెలుసుకోకుండా ఎదుటి వారిని ఇలా ఎందుకు చేశావని చెడామడా తిట్టేస్తుంటారు. ఇది సమస్యను మరింత పెద్దదిగా చేయడంతో పాటు ఉన్న సమస్యకు మరొకటి తోడయ్యేలా కూడా చేయచ్చు. కాబట్టి ముందు ఒకరి పరిస్థితులు మరొకరు అర్థం చేసుకోండి.. ఆ తర్వాత సమస్య పరిష్కారానికి సంబంధించిన బోలెడు మార్గాలు మీ ముందుంటాయని నమ్మండి.. దీనివల్ల మీ బంధానికి కూడా ఎలాంటి ఢోకా ఉండదు.

ఇదీ చూడండి: నా భర్తతో ఆ విషయం చెబుతానని బెదిరిస్తున్నాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.