ETV Bharat / lifestyle

RELATIONSHIP: అతని భార్య కనిపించడం లేదు.. మేం పెళ్లి చేసుకోవచ్చా? - vasundhara

ఓ వ్యక్తికి పెళ్లైంది. వివాహమైన కొన్నాళ్లకే ఆమె అతడిని వదిలి పెట్టి వెళ్లిపోయింది. ఇది జరిగి ఇప్పటికీ మూడేళ్లవుతోంది. తాజాగా మరో అమ్మాయి అతడిని ప్రేమిస్తోంది. పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులను కూడా ఒప్పించారు. అయినప్పటికీ... ఎక్కడో కాస్త భయం. అందుకే ఇలా పెళ్లి చేసుకోవచ్చా అంటూ లాయర్ సలహా కోసం ప్రయత్నం చేసింది.

can-i-marry-a-married-man-who-has-left-his-wife
అతని భార్య కనిపించడం లేదు.. మేం పెళ్లి చేసుకోవచ్చా?
author img

By

Published : Aug 6, 2021, 12:26 PM IST

నేనో వ్యక్తిని ప్రేమించాను. అతనికి ముందే పెళ్లయ్యింది. కొద్దికాలానికే ఆవిడ ఎటో వెళ్లిపోయింది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆవిడ ఆచూకీ తెలియదు. పోలీసు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇప్పుడు మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం? మా మూడు కుటుంబాలూ సుముఖంగానే ఉన్నాయి. మేం ఎలా ముందుకు వెళ్లవచ్చు?

జి. వరలక్ష్మి, న్యాయవాది

మీరు ప్రేమించిన వ్యక్తికి ఇంతకుముందే పెళ్లయిందని అంటున్నారు కదా! ఆవిడ వెళ్లిపోయినప్పుడు అతను ఎందుకు విడాకులు తీసుకోలేదు. ఆవిడ ఆచూకీ తెలియనంత మాత్రాన విడాకులు చట్టప్రకారం తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే చెల్లదు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌(13) రెండు సంవత్సరాలు కలవకుండా వేర్వేరుగా ఉంటే ఇందులోని సబ్‌క్లాజ్‌(1బీ) ప్రకారం... దాన్ని కారణంగా చూపించి విడాకులు తీసుకోవచ్చు. భార్య/భర్త కనీసం ఏడేళ్లు కనిపించకుండా పోతే సబ్‌క్లాజ్‌(6) ప్రకారం వారు బతికి ఉన్నారని తెలియకపోయినా డైవోర్స్‌ పొందొచ్చు. అయితే ఆ విషయాన్ని కోర్టు ద్వారా నిరూపించాలి.

మీ నుంచి ఏమైనా దాస్తున్నాడేమో తెలుసుకోండి?

ఇందుకోసం ఇంతకుముందు ఉన్న చిరునామా లేదా తల్లిదండ్రుల అడ్రస్‌ ఆధారంగా విడాకులకు ప్రయత్నించవచ్చు. ఇందుకు కోర్టులో ఒరిజినల్‌ పిటిషన్‌ వేయమనండి. వాళ్ల తండ్రి/తల్లి కూడా మాకు తనెక్కడ ఉందో తెలియదని కోర్టుకి చెబితే న్యాయస్థానం ద్వారా పత్రికా ప్రకటన వేయించండి. అలా కూడా రాకపోతే ఎక్స్‌పార్టీ ఆర్డర్‌ తీసుకోవచ్చు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటేనే చెల్లుబాటు అవుతుంది. ముందు అతడు మీ నుంచి ఏమైనా దాస్తున్నాడేమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

ఇదీ చూడండి: PROPERTY ISSUE: ఇల్లొదిలి వచ్చేశాను.. భర్త ఆస్తి నాకొస్తుందా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.