ETV Bharat / lifestyle

మలి వయసులో తోడు కావాలనుకోవడం తప్పా?! - relationship latest news

విడాకులు తీసుకున్నా, వితంతువుగా మిగిలిపోయినా.. మహిళలు రెండో వివాహం చేసుకుంటామంటే మాత్రం ఎందుకో ఈ లోకం ఒప్పుకోదు. ఇక కాస్త లేటు వయసులో రెండో పెళ్లంటే ‘ఈ వయసులో నీకు అవసరమా?’ అన్న సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సిందే! కానీ ఏ వయసులోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరికైనా సరే ఓ జీవిత భాగస్వామి తోడు అవసరమని, అందుకే తాను 73 ఏళ్ల వయసులో వరుడి కోసం అన్వేషిస్తున్నానని చెబుతోంది కర్ణాటకకు చెందిన ఓ రిటైర్డ్‌ టీచర్‌. ఈ క్రమంలోనే ‘వరుడు కావలెను’ అంటూ తానిచ్చిన ఓ మ్యాట్రిమోనియల్‌ ప్రకటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తనది రెండో పెళ్లని ఏమాత్రం రాజీ పడకుండా, పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధమే లేదన్న సానుకూల దృక్పథంతో.. తనకు ఎలాంటి లక్షణాలున్న వరుడు కావాలో తన యాడ్‌లో స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలా తన నిర్ణయాన్ని కొందరు విమర్శిస్తున్నా.. చాలామంది మాత్రం తన ధైర్యానికి, సానుకూల దృక్పథానికి సలాం కొడుతున్నారు. ఇలా ఆమె ప్రకటన చూసి.. ‘మీకు తగిన వరుడిని నేనే’ అంటూ ఓ 69 ఏళ్ల వ్యక్తి స్పందించడం ఇక్కడ కొసమెరుపు.

barriers women who got second marriage
మలి వయసులో నాకో తోడు కావాలనుకోవడం తప్పా?!
author img

By

Published : Apr 20, 2021, 12:02 PM IST

కర్ణాటకలోని మైసూరుకు చెందిన 73 ఏళ్ల కిరణ్‌ రాణే (పేరు మార్చాం) టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అందరమ్మాయిల్లాగే యుక్త వయసులో ఎన్నో కలలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినా అక్కడ ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. దీంతో తన భర్త నుంచి విడాకులు తీసుకొని తన తల్లిదండ్రుల చెంతకు చేరారామె. ఇలా తొలి వివాహ బంధం మిగిల్చిన చేదు అనుభవాలు ఆమెకు పెళ్లంటేనే అయిష్టత కలిగేలా చేశాయి. దీంతో ఇన్నాళ్లూ అమ్మానాన్నల వద్దే ఉంటూ కాలం గడిపారు కిరణ్‌. అయితే వాళ్లు కాలం చేయడంతో ఒక్కసారిగా ఒంటరయ్యారామె. దీంతో ఆప్యాయంగా పలకరించేవారు, ఆమె క్షేమ సమాచారాలు కనుక్కునేవారే కరువయ్యారు. ఎక్కడికెళ్లినా ఒంటరిగా, బెరుకుగా వెళ్లాల్సి వచ్చేది.

వరుడు కావలెను!

అయితే ఇలాంటి ఒంటరితనం ఆమెను తీవ్రంగా బాధించేది. అందుకే ఎలాగైనా దీన్నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు కిరణ్‌. ఈ క్రమంలో తోడు కోసం ఇన్నాళ్లూ తాను ఎలాంటి బంధానికైతే దూరంగా ఉంటూ వచ్చారో ఆ అనుబంధాన్నే ఎంచుకున్నారు. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న ఆమె.. తనకు తగిన జీవిత భాగస్వామితో మలి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అందుకోసం తనకు ఎలాంటి లక్షణాలున్న వరుడు కావాలో స్పష్టం చేస్తూ ఓ మ్యాట్రిమోనియల్‌ ప్రకటన కూడా ఇచ్చారామె. ఇందులో భాగంగా ‘నాకు సంప్రదాయ కుటుంబానికి చెందిన, ఆరోగ్యవంతుడైన, నా కంటే వయసులో పెద్దవాడైన వరుడు కావాలి..’ అంటూ వివరంగా తానిచ్చిన ప్రకటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక ఈ ప్రకటన చూసిన ఓ 69 ఏళ్ల రిటైర్డ్‌ ఇంజినీర్‌ ‘మీకు తగిన వరుడిని నేనే.. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ స్పందించడంతో కిరణ్‌ ఎదురుచూపులకు తెరపడినట్లయింది. ఇక వీరిద్దరూ త్వరలోనే ఒక్కటవ్వాలని ఎంతోమంది నెటిజన్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరికొంతమందేమో ‘ఈ వయసులో పెళ్లి చేసుకోవడం అవసరమా?’ అంటూ విమర్శిస్తున్నారు.

అమ్మకు మళ్లీ పెళ్లి!

కిరణ్‌ ఒక్కరే కాదు.. మహిళల పెళ్లి గురించి సమాజంలో నెలకొన్న మూసధోరణులు బద్దలు కొట్టిన స్త్రీలు మరికొంతమంది ఉన్నారు. కారణమేదైనా వివాహబంధం నుంచి బయటికొచ్చి తమ పిల్లలే ఊపిరిగా బతుకుతోన్న త్యాగ మూర్తులెందరో! కానీ తాము పెళ్లి చేసుకొని వెళ్లిపోతే తమ తల్లి ఒంటరవుతుందన్న ఉద్దేశంతో ఈ సమాజపు కట్టబాట్లను కాలదన్ని తమ తల్లికి మళ్లీ పెళ్లి చేసింది ఆస్తా వర్మ అనే ఓ అమ్మాయి. వివిధ కారణాల వల్ల వైవాహిక బంధాన్ని తెంచుకొని తన కోసమే జీవిస్తోన్న తన తల్లికి ఓ తోడు కావాలని నిర్ణయించుకొని.. ‘టిండర్‌’ అనే డేటింగ్‌ యాప్‌లో ఓ ప్రకటన పోస్ట్‌ చేసింది. ‘మా అమ్మ కోసం 50 ఏళ్ల అందమైన వరుడు కావలెను. అతడు వెజిటేరియన్‌ అయి ఉండాలి.. మందు అలవాటు ఉండకూడదు.. జీవితంలో బాగా స్థిరపడి ఉండాలి..’ అంటూ వరుడికి ఉండాల్సిన లక్షణాలను పొందుపరిచి మరీ చేసిన ఈ మ్యాట్రిమోనియల్‌ ప్రకటన అప్పట్లో తెగ వైరలైంది. తన తల్లి గురించి తాను తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి అందరూ ఆమెను అభినందించారు.

ఆ టార్చర్‌ ఎందుకు భరించాలి?!

ఆస్తా లాగే తన తల్లి క్షేమం గురించి ఆలోచించి, మలి వయసులో ఆమెకో తోడు ఉండాలని ఆకాంక్షించాడు కేరళకు చెందిన గోకుల్‌ శ్రీధర్ అనే ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌. తన తండ్రి ఆమెను పెట్టే టార్చర్‌ను చూడలేకపోయిన అతను.. తల్లిని తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. ఆపై ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి పేరుతో మహిళలు హింసాత్మక బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని, దానికి స్వస్తి పలికి మళ్లీ పెళ్లి చేసుకోవడంతో తప్పే లేదంటూ తన తల్లికి మరో పెళ్లి చేశాడు గోకుల్‌. ఈ క్రమంలో ‘అంత టార్చర్‌ భరిస్తూ అమ్మ నా కోసమే జీవిస్తోంది. నా కోసం ఇంకా కష్టాలు భరించడానికి సిద్ధంగా ఉంది. అది చూడడం నా వల్ల కాలేదు! అందుకే అమ్మ చేయి పట్టుకొని ఇంట్లో నుంచి వచ్చేశాను. అప్పుడే అమ్మకు పునర్వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నా. నా కోసం తన సమస్తాన్ని త్యాగం చేసిన అమ్మకు తనకంటూ కొన్ని కోరికలు, ఆశయాలు ఉంటాయి. వాటిని ఆమె నెరవేర్చుకోవాలి.. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అమ్మా!’ అంటూ తన తల్లి రెండో పెళ్లికి సంబంధించి అతడు పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. గోకుల్‌ విశాల దృక్పథానికి నెటిజన్లు భావోద్వేగంతో కామెంట్లు పెట్టారు.. ప్రశంసలతో అతడిని ఆకాశానికెత్తేశారు.

అందులో తప్పేముంది?!

ఏదేమైనా రోజులు మారుతున్న కొద్దీ మహిళల ఆలోచనలూ మారుతున్నాయి. అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలి, అదీ జీవితంలో ఒక్కసారే చేసుకోవాలి, నచ్చినా నచ్చకపోయినా అదే బంధంలో కొనసాగాలి.. అంటూ ఏళ్లకేళ్లుగా సమాజంలో వేళ్లూనుకుపోయిన మూసధోరణుల్ని బద్దలు కొట్టడానికీ వారు వెనకాడట్లేదు. అందుకు ఇలాంటి మహిళలే ప్రత్యక్ష ఉదాహరణ! వీళ్లే కాదు.. పలువురు సెలబ్రిటీలూ వయసుతో సంబంధం లేకుండా, వ్యక్తిగత కారణాల రీత్యా రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ‘మనసు చెప్పిందే విన్నాం.. సంతోషంగా ఉన్నాం’ అంటూ చాటుకున్నారు. మహిళలకు రెండో పెళ్లి, అదీ మలి వయసులో అంటే.. వారేదో పాపం చేస్తున్నట్లుగా భావించే ఈ సమాజానికి ‘పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని, రెండోసారి వివాహం చేసుకోవడం అంతకంటే తప్పు కాద’ని నిరూపించారు.

అయితే ఇలా వీరు తీసుకున్న నిర్ణయానికి కొంతమంది సమర్థిస్తే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి, మలి వయసులో మహిళలు ఇలా తమకంటూ ఓ తోడు ఉండాలనుకోవడం తప్పా? స్త్రీలు ఒక నిర్దిష్ట వయసులోనే పెళ్లి చేసుకోవాలా? లేటు వయసులో పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఇలా చాలామందిలో చాలా రకాల ప్రశ్నలు మెదులుతున్నాయి. మరి, వీటన్నింటిపై మీ అభిప్రాయాలేంటి? కింది కామెంట్‌ బాక్స్‌ ద్వారా పంచుకోండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.