ETV Bharat / lifestyle

beauty: సహజసిద్ధమైన పదార్థాలతో మోము మెరిపిస్తుంది!

author img

By

Published : Jun 15, 2021, 10:43 AM IST

అందం కోసం ఎన్నో సౌందర్య ఉత్పత్తులను వాడుతుంటారు. మోమును మెరిపించాలనే ఉద్దేశంతో ప్రొడక్ట్స్‌తో సంబంధం లేకుండా వినియోగిస్తారు. చివరకు క్యాన్సర్ల బారిన పడతారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సహజ బ్రాండ్‌ను తయారు చేసింది 27 ఏళ్ల నందీతా మన్‌చన్‌దా. ఆమె ప్రారంభించిన సహజ బ్రాండ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి...

సౌందర్య ఉత్పత్తులు, బ్యూటీ చిట్కాలు
beauty products, natural beauty products

నందీతా మన్‌చన్‌దా యూఎస్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసింది. అక్కడ చదువుతున్నపుడు తన స్నేహితురాలికి చర్మ క్యాన్సర్‌ అని తేలింది. ఆ అమ్మాయికి అప్పటికి 21 ఏళ్లే. ఆమెను థెరపీలు, చికిత్సకు నందీతానే తీసుకెళ్లేది. డెర్మటాలజిస్ట్‌ ఆమె ఉపయోగించిన సౌందర్య ఉత్పత్తులోని రసాయనం క్యాన్సర్‌కి కారణమైందని చెప్పారు. ఆమె మనసు సౌందర్యోత్పత్తుల్లోని కెమికల్స్‌పైనే ఆగిపోయింది.

ఆలోచన ఇలా..

2010లో ఆమె భారత్‌కు తిరిగొచ్చినా... ఈ ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. పెళ్లైన తర్వాత బ్యూటీ సెలూన్‌నూ సొంతంగా ఏర్పాటు చేసుకుంది. కస్టమర్ల కోసం వాడే ఉత్పత్తుల్లో రసాయనాలుండేవి. కొంతమంది రసాయనాలు లేకుండా ఉంటే బాగుండనే అనుకునేవారు. అదేదో తనే చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దాని ఫలితమే ‘ఎన్స్‌ క్లోజెట్‌’. ఇది సాకారం కావడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. కస్టమర్ల అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు తన అనుభవాలనూ జోడించి పరిశోధన జరిపింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధ పదార్థాలతో 2018లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. దీనిలో రసాయనాలు, జంతువుల అవశేషాలు వంటివి లేకుండా చూసుకుంది.

‘నా ఆలోచనలు సంస్థ దిశగా సాగడంలో మా బామ్మదే ప్రధాన పాత్ర. చిన్నప్పటి నుంచి ఆహార పదార్థాలను సౌందర్య పోషణలో ఉపయోగించడం ఆమె నుంచే నేర్చుకున్నాను. పెరుగు, కాఫీ, పండ్లు, గోధుమ పిండి.. ఇలా ప్రతిదాన్నీ ముఖానికీ, జుట్టుకీ పట్టించేవాళ్లం. అదే ఈ ప్రొడక్ట్స్‌ రూపొందించడానికీ సాయపడింది. కొందరు సరకులు ఇచ్చే వాళ్లూ మొదట ఒకటి చూపించి, తర్వాత నాసిరకం పంపేవాళ్లు. నావద్ద తక్కువకు తీసుకుని ఎక్కువ రేట్లకు అమ్మే వాళ్లు. వీటన్నింటి నుంచి నెమ్మదిగా పాఠాలు నేర్చుకున్నాను. అందం ఒకొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. రంగుకి కాకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వమవ్వాలి.’

-నందీత

నో కెమికల్స్

ముందుగా లిప్‌స్టిక్‌ల తయారీపై దృష్టిపెట్టింది. అది మంచి ఫలితాన్నిచ్చాక చర్మం, జుట్టు, కళ్లపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం 60 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. నెయ్యి, పండ్లు, కూరగాయలు, వెన్న, కొబ్బరి.. మొదలైన వాటినే ఉపయోగిస్తుంది. వీటిని రసాయనాలు వేయకుండా పండించిన వారి నుంచే తీసుకుంటుంది. ప్రస్తుతం నైకా, అమెజాన్‌ వంటి ప్రధాన వెబ్‌సైట్లూ ఆమె ఉత్పత్తులను అమ్మకానికి ఉంచుతున్నాయి.
కానీ.. వ్యాపారంలో విజయం ఆమెకు సులువేమీ కాలేదు. ముడిపదార్థాల విక్రేతలు చిన్న అమ్మాయి, తనకేం తెలుస్తుందిలే అని మోసం చేయాలనుకునే వారు. వాటన్నింటినీ ఆమె అధిగమించింది.

ఇదీ చదవండి: FIRING: కడప జిల్లాలో కాల్పుల కలకలం, ఆస్తి వివాదాలే కారణం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.