సాధారణంగా ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన వారికి డెలివరీ అయిన ఆరు వారాల్లో బీపీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. కానీ బీపీ రావడానికి రిస్క్ అధికంగా ఉండే వారికి ఇది ఇలాగే కొనసాగవచ్చు. సాధారణ స్థితికి రావడానికి మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. వారు మీకు ఆహార నియమాలు, వ్యాయామం, ఒకవేళ బరువు అధికంగా ఉంటే ఎంత తగ్గాలి? ఎలా తగ్గాలి? అన్న విషయాలు కూడా సూచిస్తారు. అలాగే రక్తపోటు తగ్గించడానికి మందులు అవసరమైతే అవి కూడా రాసిస్తారు. మళ్లీ ప్రెగ్నెన్సీ వస్తే బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉండచ్చు.
ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే తగ్గుతుందా? లేదా? - health news
హాయ్ మేడం. నాకు ప్రెగ్నెన్సీలో బీపీ సమస్య వచ్చింది. డెలివరీ అయి ఆరు నెలలవుతోంది. ఇప్పుడు నా బీపీ 140/90గా ఉంది. రక్తపోటు తిరిగి సాధారణ స్థితికి రావాలంటే నేనేం చేయాలి? అలాగే నాకు మళ్లీ ప్రెగ్నెన్సీ వస్తే ఏమైనా సమస్యలెదురవుతాయా? చెప్పండి. - ఓ సోదరి