ప్రొటీన్లూ, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలూ, పీచూ యాంటీఆక్సిడెంట్లూ, ఖనిజాలూ పుష్కలంగా ఉన్న అవిసెల నుంచి నూనెని కూడా తీస్తుంటారు. దీన్ని కొంచెంగా తీసుకుని కుదుళ్లకు పట్టించి పావుగంటసేపు ఉంచి అప్పుడు తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఊడటం తగ్గడమే కాదు, ఇందులోని బి, ఇ విటమిన్లు జుట్టు వేగంగా పెరిగేందుకు తోడ్పడతాయి. అంతేకాదు, అవిసెలు తలలో రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు త్వరగా తెల్లగా కాకుండా చూస్తాయి. ఇందులోని ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు పొడి బారిపోకుండానూ చూస్తాయి. చుండ్రునీ నివారిస్తాయి. వెంట్రుకలు తెగిపోకుండా ఉంటాయి. అలాగే అవిసెల్ని పొడి రూపంలో ఆహారంలో భాగంగా తీసుకుంటే ఇవి కణాల్లోని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి జుట్టు పొడవుగా దృఢంగానూ పెరిగేందుకు కారణమవుతాయి.
ఇదీ చూడండి: సంపూర్ణ సౌందర్యానికి 'సహజ' మంత్రమేస్తున్నారు!