ETV Bharat / lifestyle

అబార్షన్ ‌అయ్యింది... ఏం తినాలి? - woman health news

మా అమ్మాయికి మూడో నెలలో గర్భ స్రావమైంది. అప్పటి నుంచి బాగా నీరసించిపోయింది. తను త్వరగా కోలుకుని, తిరిగి శక్తి పుంజుకోవడానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి?- నారాయణమ్మ, హైదరాబాద్‌

abortion
అబార్షన్ ‌అయ్యింది... ఏం తినాలి?
author img

By

Published : Mar 2, 2021, 11:06 AM IST

నిపుణులు

ర్భస్రావమైనప్పుడు ఎక్కువ మొత్తంలో రక్తం పోవచ్చు. దాంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోతారు. వీరు వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూనే త్వరగా శక్తిని పొందడానికి పోషకాహారాన్ని తీసుకోవాలి. మీ అమ్మాయి విషయానికి వస్తే... ముందు ఆమె రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం ఎంత ఉందో పరీక్ష చేయించాలి. ఎత్తుకు తగిన బరువు ఉందా... అబార్షన్‌ తర్వాత బరువు తగ్గడం లేదా పెరగడం జరిగిందా వంటివి గమనించాలి, రక్తంలో చక్కెరస్థాయుల్లో ఏమైనా మార్పులు వచ్చాయేమో తెలుసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండి రక్తహీనతను అధిగమించాలంటే...ఆహారంలో మేలైన మాంసకృత్తులతోపాటు ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌-సి వంటివి ఉండేలా చూసుకోవాలి. బరువు మాత్రమే తగ్గితే ఎక్కువ శక్తి, పోషకాలు ఇచ్చే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఒకవేళ ఆమె ఇంతకుముందే అధిక బరువుంటే తక్కువ కెలొరీలు, ఎక్కువ పోషకాలు అందించాలి.

ఏం తినాలి...

ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్డు, పాలు, పెరుగు, మాంసం, చేపలు తినొచ్చు. శాకాహారులైతే పాలపదార్థాలు, సోయా నగ్గెట్స్‌, పప్పుదినుసులు, వేరుసెనగలు ఇవ్వొచ్చు. ఆకుకూరలు జామ, నిమ్మ జాతి పండ్లను ఇవ్వండి. టొమాటో, కీర, నిమ్మలతో సలాడ్‌లూ మంచివే. పొట్టు ధాన్యాలు, మొలకెత్తిన గింజలతో పాటు ముడిబియ్యం, రాగులు, సజ్జలు తీసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.