రెండు టేబుల్‌స్పూన్ల దానిమ్మ రసంలో టేబుల్‌స్పూన్ చొప్పున వెన్న, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. దానిమ్మ గింజల రసాన్ని వడకట్టకుండా బరగ్గానే వాడాలి.
తేమగా ఉండాలంటే
దానిమ్మ రసం రెండు టేబుల్‌స్పూన్లు తీసుకుని దీంట్లో టేబుల్‌స్పూన్ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పొడిబారిన చర్మం తేమగా మారడమే కాకుండా మెరుస్తుంది కూడా.
వయసు ఛాయలిక దూరం
మూడు టేబుల్‌స్పూన్ల దానిమ్మ రసంలో రెండు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జు కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. కలబందలోని పోషకాలు వయసు పైబడటం వల్ల ముఖంలో వచ్చే మార్పులను నియంత్రిస్తాయి.