* రోజూ ఎనిమిది గంటలు నిద్రపోండి. నిద్రను మించిన సౌందర్య సాధనం లేదు.
* ఉదయం వేళ కొద్ది సేపైనా ఆరు బయట సూర్యకాంతి తగిలేలా పని చేయండి. వ్యాయామం చేస్తే ఇంకా మంచిది. దీనితో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా ఉంచుకోవచ్చు.
* రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగండి. ఇది చర్మ నిగారింపుకి తోడ్పడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలోని అన్ని సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందనడంలో అతిశయోక్తి లేదు. నీరు అధికంగా తీసుకోండని సెలబ్రిటీలు ఎందుకు సలహాలిస్తారో ఇప్పుడు అర్ధమయింది కదూ.!
* సన్ స్క్రీన్ లోషన్ వాడకుండా అడుగు బయట పెట్టకండి. నిత్యం దీనిని వాడటం వల్ల ట్యానింగ్ బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మాయిశ్చరైజర్ కూడా వాడండి. అప్పుడే చర్మం తేమగా, పొడిబారకుండా ఉంటుంది.
* నిద్రకు ఉపక్రమించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మేకప్‌తో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకూడదు.
* వ్యాయామం, యోగా లాంటి వాటిని మీ దిన చర్యలో ఓ భాగం చేసుకోండి. ఈ కసరత్తులతో రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
* క్రమం తప్పకుండా బరువు చూసుకోండి. అలాగే అవసరమైన వైద్య పరీక్షలు (మమోగ్రామ్, పాప్‌స్మియర్ వంటివి) చేయించుకోండి. తద్వారా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. బరువు పెరుగుదలకు సంబంధించి కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
* తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో తరుచుగా మాట్లాడుతూ ఉండండి. వాళ్ళ బాగోగులను అడిగి తెలుసుకోండి. మనస్సు విప్పి మాట్లాడండి.
* రెండు మూడు నెలలకోసారైనా మసాజ్ చేయించుకోండి. అది మీ శరీరతత్వానికి సరిపడేదిగా ఉండాలి. శరీర కండరాలకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. నొప్పులూ గిప్పులూ ఉంటే పరారైపోతాయి. శరీరానికి, మనస్సుకి చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది.
* ఈ భూమ్మీద ఎక్కడేం జరిగినా ఇప్పుడు మన మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. సమస్త సమాచారం అర చేతిలోనే లభిస్తుంది. సాధ్యమైనన్ని మార్గాల ద్వారా వివిధ అంశాల గురించి మీ విజ్ఞానం పెంచుకోండి.
చివరగా - రోజూ కనీసం ఓ గంటైనా ఫోన్‌ను పక్కన బెట్టండి. సోషల్ మీడియానే ప్రపంచంగా భావించకండి. ఆ సమయాన్ని ఓ మంచి పుస్తకం చదవడానికో, మీ కుక్క పిల్లతో గడపడానికో కేటాయించండి. మీకిష్టమైన డిష్‌ను ఆరగించండి. ఆ తర్వాతనే ఇన్‌స్టాగ్రామ్ అయినా మరేదైనా!
ఇదీ చూడండి : స్ఫూర్తినిస్తున్న 'శ్రీకారం' పాట.. యష్ 'గజకేసరి' టీజర్