తరచూ బయటకి వెళ్లేవారు...వారానికి ఓసారి ఈ ప్యాక్ వేసుకుంటే...చర్మం శుభ్రపడుతుంది. టాన్ పట్టకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనకు చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం పిండి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనివ్వాలి. ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరి. మీరు కోరుకున్న ఫలితం ఉంటుంది.
జుట్టుకి కండిషనర్‌గా:
జుట్టు కొన్నిసార్లు నిర్జీవంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ ఎగ్ హెయిర్‌ప్యాక్‌ని ప్రయత్నిస్తే ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక మెంతికూర కట్టను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు కోడిగుడ్లలోని తెల్లసొన, కొద్దిగా పెరుగు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూత వేసి ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా కనీసం పదిహేను రోజులకోసారి చేస్తే ఫలితం ఉంటుంది.
చర్మం బిగుతుగా:
గుడ్డులోని తెల్లసొన తీసుకుని దానికి చెంచా నిమ్మరసం కలిపి గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. దీనికి కాస్త బియ్యప్పిండి, కొద్దిగా తేనె కలిపి అవసరాన్ని బట్టి గోరువెచ్చని నీళ్లతో పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని ఆరనిచ్చి కడిగేయాలి. వారానికోసారైనా ఇలా చేస్తుంటే ముడతలు, గీతలు తగ్గి నవయౌవనంగా కనిపించొచ్ఛు.
- ఇదీ చూడండి బ్రౌన్ షుగర్‌తో తియ్యగా మెరిసిపోండిలా...