ETV Bharat / lifestyle

అమ్మయ్యాక కూడా ఇలా అందంగా మెరిసిపోదాం! - easy tips for mother's health

అమ్మతనం మనలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈ దశలో అటు శారీరకంగానే కాదు.. ఇటు సౌందర్యపరంగానూ పలు మార్పులు రావడం మనం గమనించచ్చు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు-మచ్చలు, చర్మంపై పిగ్మెంటేషన్‌-స్ట్రెచ్‌ మార్క్స్‌, విపరీతంగా జుట్టు రాలిపోవడం.. ఇలా కొత్తగా తల్లైన వారు అందం పరంగా వివిధ రకాల సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. బిడ్డ పుట్టాక తల్లుల శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి హార్మోన్ల స్థాయులు ఒక్కసారిగా పడిపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. అలాగని ఈ సమస్యల్ని పరిష్కరించుకోలేమా అంటే? అందుకు చిన్న చిన్న చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

tips for mother's beauty
అమ్మ అందానికి చిట్కాలు
author img

By

Published : Apr 19, 2021, 3:47 PM IST

అమ్మాయిలు యవ్వనదశలో ఉన్నప్పుడు తమ అందాన్ని ఎంత సున్నితంగా కాపాడుకుంటారో.. పిల్లలకు తల్లి అయిన తర్వాత ఆ అందంపై అంత ఆసక్తి ఉండదు. శారీరక మార్పులే ఇందుకు కారణం కావచ్చు. చిన్నపాటి చిట్కాలను పాటిస్తే అమ్మయ్యాక కూడా అలాంటి అందాన్ని మళ్లీ పొందవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

ఎలాంటి సమస్యలొస్తాయంటే..?!

tips for mother's beauty
జుట్టు విపరీతంగా రాలడం
  • గర్భిణిగా ఉన్న సమయంలో హార్మోన్ల స్థాయుల్లో పెరుగుదల కారణంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది. అదే డెలివరీ తర్వాత హార్మోన్ల స్థాయులు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం/తగ్గుదల వల్ల జుట్టు రాలడం అధికమవుతుంది. అయితే ఇది తాత్కాలికమే అని.. మహా అయితే 6-12 నెలల పాటు ఈ సమస్య ఎక్కువగా ఉండచ్చంటున్నారు.
  • ప్రసవం తర్వాత హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి, అలసట.. వంటివన్నీ ముఖంపై మొటిమలు రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా ఈ దశలో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయుల్లో వచ్చే మార్పుల వల్ల సెబేషియస్ గ్రంథులు ఎక్కువ నూనెల్ని విడుదల చేస్తాయి. తద్వారా ముఖంపై మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ఏర్పడుతుంటాయి.
    tips for mother's beauty
    శరీరంపై మచ్చలు, శరీరాకృతిలో మార్పులు
  • ప్రసవం తర్వాత సౌందర్యపరంగా వచ్చే మరో సమస్య పిగ్మెంటేషన్‌/మెలస్మా. ఈ క్రమంలో చర్మంపై నల్లటి ప్యాచుల్లాంటి మచ్చలు ఏర్పడడం మనం గమనించచ్చు.
  • ఇక బిడ్డ పుట్టాక నిద్రలేమి, హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, విపరీతమైన అలసట.. వంటివన్నీ కళ్లు ఉబ్బడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడం.. వంటి సమస్యలకు దారితీస్తాయి.
  • గర్భం ధరించిన సమయంలో నెలలు నిండుతున్న కొద్దీ క్రమంగా బరువు పెరుగుతాం. ఇందులో భాగంగా రొమ్ములు, పొట్ట, పిరుదులు.. తదితర శరీర భాగాల్లో పెరుగుదల కనిపించడం సహజమే! ఈ క్రమంలో చర్మం సాగి స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడుతుంటాయి. అయితే డెలివరీ తర్వాత ఈ భాగాలన్నీ ఒక్కసారిగా తిరిగి సాధారణ స్థితికి రావడంతో అక్కడి చర్మం వదులుగా మారుతుంది. దాంతో చాలామంది మహిళలు ఆత్మన్యూనతకు గురవుతుంటారు.

ఈ చిట్కాలతో అందాన్ని తిరిగి పొందచ్చు!

అయితే ఈ సమస్యలన్నీ కొత్తగా తల్లైన మహిళల్లో సాధారణంగా తలెత్తేవేనని, అలాగని బాధపడిపోకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రసవానంతరం తిరిగి సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

tips for mother's beauty
చర్మం మెరిసిపోతుందిలా!

చర్మం మెరిసిపోతుందిలా!

* ప్రసవానంతరం ఎదురయ్యే మొటిమల సమస్యను దూరం చేసుకోవాలంటే రోజుకు రెండుసార్లు గాఢత తక్కువగా ఉండే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోమంటున్నారు నిపుణులు. ఇక ఇలాంటి వారు ఉపయోగించే ఫేస్‌ప్యాక్స్‌లో కలబంద, యూకలిప్టస్‌ ఆయిల్‌.. వంటి పదార్థాలను చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు.. బయటికి వెళ్లేటప్పుడు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం తప్పనిసరి.. అది కూడా ఆయిల్‌ రహితమైనదై ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

* పిగ్మెంటేషన్ సమస్యను తొలగించుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యేకమైన మాయిశ్చరైజర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణుల సలహా మేరకు వాడితే సరి. అలాగే పసుపు-నిమ్మరసం, కలబంద గుజ్జు, బంగాళాదుంప, కమలాఫలం తొక్కల పొడి.. వంటివి మీరు వాడే ఫేస్‌ప్యాక్స్‌లో చేర్చుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది.

* ఇక కంటి అలసటను, కళ్ల కింద నల్లటి వలయాలను దూరం చేసుకోవడానికి సమయం దొరికినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడం ఒక్కటే మార్గం. ఈ క్రమంలో పాపాయి పడుకున్నప్పుడే మీరూ నిద్రకు ఉపక్రమించేలా చూసుకోండి. అలాగే నిపుణుల సలహా మేరకు ఐ క్రీమ్‌ని కూడా వాడచ్చు.

tips for mother's beauty
స్ట్రెచ్​ మార్క్స్​ పడకుండా

* స్ట్రెచ్‌మార్క్స్‌ రాకుండా గర్భం ధరించిన సమయం నుంచే మహిళలు జాగ్రత్తపడుతుంటారు. ఈ క్రమంలో నిపుణులు సూచించిన ఆయిల్స్‌, క్రీమ్స్‌.. వంటివి వాడుతుంటారు. అయితే ప్రసవానంతరం ఒకవేళ స్ట్రెచ్‌మార్క్స్‌ సమస్య తలెత్తినా ఇవే చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేం కానీ.. క్రీమ్స్‌/ఆయిల్స్‌తో పాటు చక్కటి పోషకాహారం, బ్రిస్క్‌ వాక్‌ - యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు.. ఈ మార్క్స్‌ని తొలగించడంలో కొంతవరకు సహాయపడచ్చని చెబుతున్నారు.

* ఇక ఇంట్లో తయారుచేసుకున్న స్క్రబ్‌తో వారానికోసారి చర్మాన్ని మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల కూడా ప్రసవానంతర సౌందర్యాన్ని తిరిగి పొందచ్చు. ఇలా చేయడం వల్ల పొలుసులుగా మారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.. మొటిమలు-మచ్చలు.. వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

జుట్టుకు మర్దన!

tips for mother's beauty
జుట్టుకు మర్దన
  • ప్రసవానంతరం జుట్టు రాలే సమస్యను అదుపు చేయాలంటే మనం తీసుకునే ఆహారంతోనే అది సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీస్‌, పాలకూర, డార్క్‌ చాక్లెట్‌, నట్స్‌.. వంటివి తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. ఎందుకంటే ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చుతాయట!
  • వారానికి రెండుసార్లు గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలే సమస్యను అరికట్టచ్చట!
  • జుట్టు కుదుళ్లు దృఢంగా మారడానికి మసాజ్‌ ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ క్రమంలో ఆలివ్‌/కొబ్బరి.. వంటి నూనెలతో కుదుళ్లను మసాజ్‌ చేయడం వల్ల ఆ భాగానికి రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు దృఢంగా మారతాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.
  • జుట్టు తడిగా ఉన్నప్పుడు బిగుతుగా ముడేయడం, హెయిర్‌ డ్రయర్స్‌ వాడడం అస్సలు సరికాదు.
  • జుట్టుకు రంగు వేసుకోవడం, హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌ టూల్స్‌ వాడడం వల్ల కూడా జుట్టు అధికంగా రాలిపోతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండడమే మంచిది.
  • సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు ‘బి’, ‘సి’ విటమిన్‌ సప్లిమెంట్లు సైతం వాడచ్చట!
    tips for mother's beauty
    అమ్మయ్యాక కూడా అందంగా ఉండొచ్చు

ప్రసవానంతరం తలెత్తే వివిధ సౌందర్య సమస్యల్ని ఎదుర్కొని అందాన్ని తిరిగి పొందాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నారుగా! అయితే ఈ దశలో మీరు మీ చిన్నారులకు పాలివ్వడంతో పాటు వారికి దగ్గరగా మెదులుతుంటారు కాబట్టి ఏది వాడినా నిపుణుల సలహా తీసుకున్నాకే వాడటం మంచిది. తద్వారా మీరు ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తుల ప్రభావం వారి ఆరోగ్యంపై పడకుండా జాగ్రత్తపడచ్చు.

ఇదీ చదవండి: '50 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే అనుమతివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.