ETV Bharat / lifestyle

కేశాలకు నిగారింపునిచ్చే నూనెలివి... - తెలంగాణ వార్తలు

జుట్టు సంరక్షణ కోసం మహిళలు ఎన్నో పాట్లు పడతారు. అందమైన జుట్టు కోసం చాలా చిట్కాలు పాటిస్తారు. జుట్టు పోషణలో నూనె ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అవేెంటో చూద్దాం రండి...

different types oils, tips for women
వివిధ రకాల నూనెల ఉపయోగాలు, ఆరగ్యకరమైన కేశాల కోసం టిప్స్
author img

By

Published : Apr 24, 2021, 2:15 PM IST

జుట్టు సంరక్షణలో నూనెది ప్రధాన పాత్ర. సాధారణంగా కొబ్బరి, బాదం వంటివే ఎక్కువగా వాడుతుంటాం. ఇవే కాదు... ఇంకా మరెన్నో రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అప్పుడప్పుడూ వాటినీ ప్రయత్నించొచ్చు. మరి మీకు సరైనదేదో చూడండి!

ఆర్గన్‌ ఆయిల్‌: దీన్ని లిక్విడ్‌ గోల్డ్‌ అనీ అంటారు. చాలా తేలికగా ఉంటుంది. దీనిలో విటమిన్‌-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. పొడి జుట్టు ఉన్నవారు ఈ నూనెను ప్రయత్నించొచ్చు.

ఆనియన్‌ బ్లాక్‌ సీడ్‌ ఆయిల్‌: దీన్ని క్రమం తప్పక వాడుతుంటే జుట్టు పెరుగుతుంది. చుండ్రు, వెంట్రుకలు నెరవడం వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.

ఆలివ్‌ ఆయిల్‌: దీన్ని నేరుగా కంటే కొబ్బరి, బాదం వంటి వాటితో కలిపి పెట్టుకుంటే ప్రయోజనం ఎక్కువ. ఈ నూనె నిర్జీవంగా మారిన జుట్టుకి నిగారింపునిస్తుంది.

భృంగరాజ్‌ ఆయిల్‌: ఆయుర్వేద మూలికలన్నింటిలో దీన్ని రాజుగా పరిగణిస్తారు. దీనిలో యాంటీ మైక్రోబియల్‌, యాంటీఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి చుండ్రు, సొరియాసిస్‌ వంటి సమస్యల్ని తగ్గించి మాడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. తల స్నానానికి గంట ముందు వేడిచేసి రాసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఆముదం: ఇది అందరికీ సుపరిచితమే. దీనిలో ఉండే రిసినోలిక్‌ యాసిడ్‌ చుండ్రుని తగ్గిస్తుంది. ఇది కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. కాస్త వేడి చేసుకుని మాడుకి పట్టిస్తే అలసట తగ్గుతుంది. వెంట్రుకలు పట్టుకుచ్చులా మెరిసిపోతాయి. గాఢమైన వాసన కారణంగా రోజువారీ ఉపయోగానికి సంకోచిస్తున్నారా? అయితే సెలవురోజుల్లో వాడిచూడండి.

ఇదీ చదవండి: లాక్​డౌన్​లో సరికొత్త వెంచర్లు.. కళల్లో నైపుణ్యం.. ఫోర్బ్స్​లో చోటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.