పనిచేస్తేనే ఫలితం:
ఎదుటి వారి దగ్గర ఉన్నవి తనకూ కావాలని పిల్లలు మారాంచేస్తే చాలు వాటిని తమ పిల్లలకూ కొని పెట్టాలని కొంతమంది తల్లులు తాపత్రయపడుతుంటారు. ఇది ఎంత మాత్రం సరికాదు. పిల్లలు అడిగిన వెంటనే కొనేయకుండా ఫలానా పని చేస్తేనే కొనిస్తానని చెప్పాలి. అప్పుడు.. కష్టపడి పనిచేస్తేనే కోరుకున్నది సాధించవచ్చనే ఆలోచన ఆ చిన్నారి మనసులో ఉదయిస్తుంది.
ప్రత్యేక సందర్భాలు:
మంచి మార్కులు తెచ్చుకోవడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి అమ్మకు సాయపడటం చేసినప్పుడు పిల్లలు అడిగినవి కొనివ్వడంలో తప్పులేదు. ఇతరులను చూసి అవే కావాలనప్పుడు మాత్రం వెంటనే ఇచ్చేయకూడదు. అప్పుడప్పుడూ పెద్దవాళ్లు ఇచ్చిన డబ్బును పొదుపు చేస్తే.. వాటితో వారికి కావలసిన వస్తువులను వారే కొనుక్కోవచ్చనీ పిల్లలకు చెప్పవచ్ఛు దీనివల్ల డబ్బు పొదుపు చేయడమూ మెల్లగా అలవాటు అవుతుంది. ఒకవేళ అంత డబ్బును వాళ్లు పొదుపు చేయలేకపోయినా కొంత మొత్తాన్ని మీరూ వేసి కొనిపెట్టవచ్ఛు.