స్నానం చేయించేటప్పుడు పిల్లలు మారాం చేయకుండా స్ప్రింక్లింగ్ టాయ్స్‌ను చేతికిస్తే ఎంచక్కా ఆడుకుంటూ స్నానం చేయించుకుంటారు. ఈ బొమ్మ చూడ్డానికి గుడ్డులా ఉంటుంది. దాన్ని నీళ్లలో పెట్టి తీయగానే అందులోంచి కోడి పిల్లా, బాతూ వంటి రకరకాల పక్షులు పై నుంచి బయటకు వస్తాయి. అప్పుడు దాన్ని చేత్తో నొక్కుతుంటే జల్లులా నీళ్లు బయటకు వస్తాయి. ఈ జల్లును పిల్లల మీదకు చల్లుతుంటే ఎంతో సంతోషిస్తారు. స్నానం చేయించేటపుడు ఇక ఏడవకుండా ఆడుకుంటారు. అలానే ఆ బొమ్మలు నోట్లో పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
నీళ్లలో పెడితే బొమ్మొస్తుంది.. బుజ్జాయి ఏడుపు మానేస్తుంది!
స్నానం చేయించేటప్పుడు కొందరు పిల్లలు తెగ మారం చేస్తుంటారు. వారిని మాటలతో బుజ్జగిస్తూ... రకరకాల బొమ్మలతో ఆడిస్తూ గబగబా స్నానం చేయించాల్సి ఉంటుంది. అలాంటి బుజ్జాయిలకి స్ప్రింక్లింగ్ టాయ్స్‌ను చేతికిస్తే ఎంచక్కా ఆడుకుంటూ స్నానం చేయించుకుంటారు.