అన్నం తినకపోతే బూచోడికి పట్టిస్తా.. మాట వినకపోతే టీచర్‌కు చెబుతా.. అంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లో తెలియని భయాలను కలిగించడం సరికాదంటారు మానసిక నిపుణులు.
పిల్లల్ని భయపెట్టి పనిచేయించాలనుకోవడం పొరబాటు. ఇలా తరచూ చేస్తుంటే మీ మాట లెక్క చేయని పరిస్థితీ ఎదురుకావొచ్చు. అలాకాకుండా కష్టం విలువ తెలియజేయండి. ఆ పని చేయకపోవడం వల్ల ఎదురయ్యే నష్టాలను అర్థమయ్యేలా చెప్పండి. మొదట్లో కాస్త వెనుకాడినా...క్రమంగా వాస్తవాలను అర్థం చేసుకోవడానికి అలవాటు పడతారు.
పిల్లలకు క్రమశిక్షణ అవసరమే కానీ...అనవసర ఆందోళనలు, భయాలు మంచి చేయకపోగా నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో వారు తీసుకునే నిర్ణయాలపై స్పష్టత కొరవడుతుంది. తోటివారితోనూ త్వరగా కలవలేకపోవచ్చు. చాలామంది మహిళలు తమకు ఏం కావాలో చెప్పడానికి భయపడతారు. అందుకే వారు కోరుకున్నది పొందలేరు.
- మడోన్నా పాప్ సింగర్
ఇదీ చదవండి: వేసవిలో చల్లచల్లని టీలు.. మీకోసమే!