ETV Bharat / lifestyle

పాలిచ్చే తల్లులూ.. ఈ విషయాల్లో జాగ్రత్త!

తల్లిపాలు పిల్లలకు ఎంతో ముఖ్యం. పసివాళ్లకు కావాల్సిన పోషకాలన్నీ తల్లిపాలలో ఉంటాయి. అందుకే తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని నిపుణులు చెబుతారు. ఇది బిడ్డకే కాదు తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. పిల్లలకు బ్రెస్ట్‌ఫీడింగ్ చేసే సమయంలో అమ్మలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం రండి.

breastfeed tips in telugu, tips for mothers
పాలిచ్చే తల్లులకు చిట్కాలు, తెలుగులో చిట్కాలు
author img

By

Published : Apr 21, 2021, 1:27 PM IST

పసి పిల్లలకు తల్లిపాలే ప్రాణాధారం అన్న విషయం తెలిసిందే. అందుకే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి వారికి సంవత్సరం లేదా సంవత్సరంన్నర వయసొచ్చేదాకా తల్లులు పాలిస్తూనే ఉంటారు. ఇది కేవలం బిడ్డకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో తల్లి చేసే కొన్ని పనులు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు చిన్న చిన్న అనారోగ్యాలకే మాత్రలు మింగడం, చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వంటి వాటివల్ల చిన్నారులకూ పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే పాలిచ్చే తల్లులు కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం ఇటు తల్లికీ, అటు పాపాయికీ ఇద్దరికీ మంచిది. మరి, బ్రెస్ట్‌ఫీడింగ్ మదర్స్ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి.

palichetalsudas6502.jpg
మాత్రలు వద్దు

ఆ మాత్రలు వద్దు..

బిడ్డకు పాలిస్తున్నంత కాలం మరోసారి గర్భం ధరించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనేది చాలామంది తల్లుల భావన. అయితే ఇది వంద శాతం నిజం కాదంటున్నారు నిపుణులు. కొంతమంది మహిళలు ఈ సమయంలో గర్భనిరోధక మాత్రల్ని ఆశ్రయిస్తుంటారు. పిల్లలకు పాలిచ్చే సమయంలో గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఇవి పాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా పాల ఉత్పత్తి ఆగిపోయే అవకాశాలూ లేకపోలేదు. కాబట్టి ఈ సమయంలో గర్భం ధరించకుండా ఉండాలంటే ఇలాంటి మాత్రలు ఉపయోగించడానికి బదులుగా ఇతర పద్ధతుల్ని పాటించడం మంచిది.

palichetalsudas6503.jpg
మాత్రలు మంచివి కాదు

నిర్ణీత వ్యవధిలో..

'పిల్లలకు ఆకలేసినప్పుడు పాలిద్దాంలే..', 'ఇప్పుడేగా వాడు పాలు తాగింది.. ఇంకా రెండు మూడు గంటల దాకా పాలివ్వాల్సిన పనేలేదు..' ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి ఆరు నెలల వయసొచ్చే వరకు రోజూ కనీసం పది నుంచి పన్నెండు సార్లు పాలివ్వడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. తద్వారా తల్లుల్లో పాల ఉత్పత్తి బాగా జరుగుతుందని వారి అభిప్రాయం. అలాగే ఇలా చేయడం వల్ల చిన్నారులకు అందాల్సిన అన్ని పోషకాలు తల్లి పాల ద్వారా వారికి అందుతాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. రాత్రుళ్లు ప్రతి రెండు గంటలకోసారి బిడ్డకు పాలు పట్టడం తప్పనిసరి. ఎందుకంటే రాత్రంతా పిల్లలకు పాలు పట్టకుండా ఉండడం వల్ల చిన్నారులు ఆకలికి తట్టుకోలేరు. అలాగే తల్లులు కూడా ఎక్కువ సమయం పాలివ్వకుండా ఉండడం వల్ల కొన్నాళ్లకు వారిలో పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. కాబట్టి పగలులాగే రాత్రుళ్లు కూడా నిర్ణీత వ్యవధిలో తల్లులు బిడ్డలకు పాలివ్వడం మర్చిపోకూడదు.

చిన్న చిన్న సమస్యలకు..

కొంతమందిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అది గర్భం ధరించిన సమయంలో, ప్రసవం తర్వాత అలాగే కొనసాగుతుంది. వాతావరణంలో కలిగే మార్పులు, ఇతర పరిణామాల వల్ల వారు త్వరగా జబ్బు పడే అవకాశాలుంటాయి. మరి, వీటి బారి నుంచి బయటపడడానికి వారే స్వయంగా ఏవో ఒక మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మందుల వల్ల పాల గ్రంథులు కుచించుకుపోయి పాల ఉత్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తద్వారా బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి కాకపోగా.. పాపాయికి లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి తల్లులు ఏ చిన్న ఆరోగ్య సమస్యతో బాధపడినా.. దానికి స్వయంగా మందులు తీసుకోవడం కాకుండా.. ఓసారి సంబంధిత వైద్య నిపుణుల్ని సంప్రదించి వారు సూచించిన మందులు వేసుకోవడమే తల్లీబిడ్డలిద్దరికీ శ్రేయస్కరం.

palichetalsudas6504.jpg
ఆహార నియమాలు పాటించాలి

ఇవి తింటున్నారా?

గర్భధారణకు ముందు, గర్భం ధరించిన తర్వాత.. ఇలా ప్రసవమయ్యే దాకా తల్లులు కఠినమైన ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. 'హమ్మయ్య.. బిడ్డ పుట్టింది.. ఇక ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సిన పనిలేదు..' అనుకొని చేతులు దులిపేసుకుంటే పొరపడ్డట్లే. ఎందుకంటే నిజానికి ప్రసవానంతరం అనుసరించాల్సిన ఆహార నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మరిన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చాక్లెట్లు, బిస్కట్లు, స్వీట్లు, శీతల పానీయాలు.. మొదలైన వాటిని బాగా తగ్గించాలి. ఎందుకంటే వీటిలో ఉండే కెఫీన్, చక్కెరలు తల్లుల్లో పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. అలాగే పిల్లలు తల్లిపాలు తాగడం వల్ల వారికీ దగ్గు, జలుబు, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పిల్లలకు పాలివ్వడం ఆపే వరకు తల్లులు ఇలాంటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఒత్తిడి అనర్థదాయకం!

బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల్లో ఒత్తిడి, ఆందోళనలు సహజం. ఓవైపు బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే.. మరోవైపు ఇతర పనుల్ని చక్కబెట్టుకోవాలి.. వీటితో పాటు సిజేరియన్ అయిన తల్లుల్లో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. వీటిన్నింటినీ తట్టుకొని ముందుకు సాగాలంటే చాలా ఓపిక అవసరం. కానీ కొందరు మహిళలు ఏకకాలంలో ఇవన్నీ నిర్వర్తించుకోవడానికి తెగ ఇబ్బంది పడిపోతూ టెన్షన్‌కి గురవుతుంటారు. కానీ ఇలా బిడ్డకు పాలిచ్చే సమయంలో ఒత్తిడికి గురవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల తల్లుల్లో పాల ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతుందనేది వారి అభిప్రాయం. ఇలా పిల్లలకు సరైన మొత్తంలో తల్లిపాలు అందకపోవడం వల్ల వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాలూ లభించకుండా పోతాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళనలకు గురికాకుండా నిరంతరం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం నచ్చిన పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు.. ఇలా మనసుకు నచ్చిన పనులతో ఆనందంగా ముందుకు సాగాలి.
చూశారుగా.. పాలిచ్చే తల్లులు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలో! మరి, మీరూ ఇవన్నీ పాటించి ఇటు మీ ఆరోగ్యాన్ని, అటు మీ పాపాయి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారు కదూ!!

ఇదీ చదవండి: జుట్టుకి జిడ్డు తగ్గించే మార్గాలివి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.