ఎండలోకి వెళ్లినప్పుడు మన శరీరం సూర్యకిరణాల నుంచి విటమిన్-డిని సహజసిద్ధంగా తయారు చేసుకుంటుంది. మారిన జీవనశైలి కారణంగా కనీస ఎండ పొడ తగలకుండా... ఏసీ, చీకటి గదుల్లో గడిపేస్తున్నవారే ఎక్కువ. దాంతో చాలామందిలో ఇప్పుడు విటమిన్ డి లోపం కనిపిస్తోంది. వర్షాకాలం, శీతాకాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్లా కొందరిలో ఇది లోపిస్తుంది. శారీరక శ్రమ తక్కువ చేసేవారిలోనూ ఇది లోపిస్తోంది. ఈ విటమిన్ సరైన మోతాదులో శరీరానికి అందినప్పుడే అందం, అరోగ్యం.
విటమిన్ ‘డి’ శరీరంలోని కొవ్వు నుంచి తయారవుతుంది. సుప్రభాత వేళ సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు విటమిన్ ‘డి’ ఉత్పత్తికి ప్రధాన కారణం. అందుకే ఉషాకిరణాలు.. వ్యాధి నిరోధక బాణాలుగా పనిచేసే ఆయుధాలని చెప్పుకోవచ్చు. దీని లోపం ప్రారంభంలో పెద్దగా తెలీదు. కానీ పోనుపోనూ కీళ్లనొప్పులు, నడుం నొప్పి, అలసిపోవడం, డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలొస్తాయి. బరువు పెరగడం, విటమిన్ లోపం, ఇమ్యూనిటీ, ఎముకల బలం తగ్గడానికీ కారణమవుతుంది. కాబట్టి, వారానికి కనీసం రెండు రోజులు ఉదయాన్నే ఎండలో కొంత సమయం గడపాలి. కనీసం 15-20 నిమిషాలుండేలా చూసుకోవాలి. దీంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే.. ఈ లోటును కొంత వరకూ భర్తీ చేసుకోవచ్చు.
అవేంటంటే..
* రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు లేదా నాలుగు లవంగాలను పరగడుపున లేదా రాత్రి భోజనం తర్వాత తీసుకోవాలి. వారానికోసారి మష్రూమ్‌ను తీసుకుంటే శరీంలో విటమిన్ డి స్థాయులను నిలకడగా ఉంచుతుంది. రాగి రోటీ, ఆవాలు, పసుపులను ఆహారంలో చేర్చుకున్నా ఫలితం ఉంటుంది.
- రోజూ చిన్నముక్క డార్క్ చాక్లెట్‌ను తీసుకోవాలి. కొత్తిమీర, ఆరెంజ్, యోగర్ట్, చీజ్‌లనూ ఎంచుకోవచ్చు. ఇవి ఇమ్యూనిటీని పెంచడానికీ సాయపడతాయి. మరీ అవసరమైతే ట్యాబ్లెట్లనూ తీసుకోవచ్చు. దీనికి వైద్యుల సలహాను తీసుకోవడం తప్పనిసరి.
- చేపలు, చేప నూనెలు (కాడ్ లివర్ ఆయిల్), గుడ్డు పచ్చసొన, చీజ్, కాలేయం, చికెన్, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, సూక్ష పోషకాలు కలిసిన నూనెలు(ఫోర్టిఫైడ్), చిరుధాన్యాలు, పప్పులు, సోయా, నువ్వుల నుంచి విటమిన్-డి అందుతుంది.
- మాంసాహారం: కాలేయం, చేపలు
- ఆకుకూరలు: తోటకూర, మునగాకు
- చిరుధాన్యాలు: మొక్కజొన్న, రాగులు
- పప్పులు: సోయా, రాజ్మా, బొబ్బర్లు
- కూరగాయలు: బీన్స్, టమాట
- పండ్లు: దానిమ్మ, ఎండు ద్రాక్ష, బొప్పాయి
- సుగంధద్రవ్యాలు: లవంగాలు, యాలకులు
బిజీబిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది ఉదయపు సూర్యకాంతికి అంతగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇకనైనా రోజు ఉదయం సూర్యకాంతి మీ శరీరంపై పడేలా చూసుకోండి. దీంతో పాటు విటమిన్ ‘డి’ పుష్కలంగా ఉండే పాలు, చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్లు, పుట్టగొడుగులు, ఓట్స్, రొయ్యలు, వెన్న, జున్ను, కమలాలు వంటి ఆహార పదార్థాలను మీ డైట్‌లో తీసుకోండి. కరోనా మహమ్మారిని విటమిన్ ‘డి’ అనే ఆయుధంతో పోరాడి విజేతలు కండి.
ఇదీ చూడండి: ఎండలో పనిచేసేవాళ్లలో క్యాన్సర్ సోకే ప్రమాదం తక్కువట!