ETV Bharat / lifestyle

చల్లని వెదర్​లో.. నోరూరించే వేడివేడి సూప్​లు - chicken soup recipe

చల్లచల్లటి వాతావరణంలో వెచ్చటి సూప్‌లు నోరూరిస్తాయి. ఆకలి వేయాలన్నా... జీర్ణక్రియ సాఫీగా సాగాలన్నా సూపులు తాగాల్సిందే. ఆరోగ్యంతోపాటు నోటికి రుచులను పంచుతూ సూపర్‌ అనిపిస్తాయివి. వెజ్‌, నాన్‌వెజ్‌ల సమ్మిళిత రుచులను ఓ సూపు చూసేయండి మరి.

Soups, Veg Soups, Non Veg Soups
సూప్​లు, వెజ్ సూప్​లు, నాన్​వెజ్ సూప్​లు
author img

By

Published : Jul 4, 2021, 12:13 PM IST

మటన్‌తో...

ఓ సూపు సూసేద్దామా!
మటన్‌ సూప్

మసాలా కోసం కావాల్సినవి: జీలకర్ర, మిరియాలు- చెంచా చొప్పున, ధనియాలు- పెద్ద చెంచా, వెల్లుల్లి రెబ్బలు- అయిదారు, చిన్న ఉల్లిపాయలు - పది.

తయారీ: మిక్సీజార్‌లో జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసి పొడిలా చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయలను కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

సూప్‌ తయారీకి కావాల్సినవి: నూనె- రెండు చెంచాలు, లవంగాలు, దాల్చినచెక్క- కొన్ని, సోంపు- అర చెంచా, బిర్యానీ ఆకు- ఒకటి, మాంసం ముక్కలు (చిన్నగా)- పావుకిలో, టొమాటో- ఒకటి, పసుపు- అర చెంచా, గరంమసాలా- పెద్ద చెంచా, కల్లుప్పు- తగినంత, కరివేపాకు- కొద్దిగా, నీళ్లు- మూడు కప్పులు, కొత్తిమీర- కొద్దిగా.

తయారీ: పొయ్యి వెలిగించి కుక్కర్‌ పెట్టాలి. నూనె పోసి అది వేడయ్యాక లవంగాలు, దాల్చినచెక్క, సోంపు, బిర్యానీ ఆకు, మటన్‌ వేసి బాగా కలియబెట్టాలి. దీంట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఇందులోనే టొమాటో ముక్కలు, పసుపు వేసి కలపాలి. గరంమసాలా పొడి, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి. మూడు కప్పుల నీళ్లు పోయాలి. మూత పెట్టి ముక్కలు ఉడికేవరకు చిన్న మంటపై ఉడికించాలి. దీనిపై కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్‌ చేస్తే ఘుమఘుమల మటన్‌ సూప్‌ రెడీ.

చికెన్‌తో...

ఓ సూపు సూసేద్దామా!
చికెన్‌ సూప్

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌- పావుకిలో (చిన్న ముక్కలు), ధనియాలు- రెండు చెంచాలు, జీలకర్ర, మిరియాలు- చెంచా చొప్పున, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు- అయిదారు చొప్పున, పసుపు- పావు చెంచా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి- ఒకటి చొప్పున (చిన్న ముక్కలు), టొమాటోలు- రెండు, కరివేపాకు- కొద్దిగా, దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు- కొన్ని, నూనె, ఉప్పు- తగినంత, కొత్తిమీర- కొద్దిగా.

తయారీ: ధనియాలు, జీలకర్ర, మిరియాలను కాస్త బరకగా నూరి పక్కన పెట్టుకోవాలి. అల్లంముక్కలు, వెల్లుల్లి రెబ్బలనూ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పొయ్యి మీద కుక్కర్‌ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని జత చేయాలి. పచ్చివాసన పోయాక టొమాటో, చికెన్‌ ముక్కలూ, పసుపు వేయాలి. తగినంత ఉప్పును కలపాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇందులో ముప్పావు లీటరు నీళ్లు పోసి మూడు, నాలుగు కూతలు వచ్చేవరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే వేడి వేడి చికెన్‌ సూప్‌ రెడీ.

కూరగాయలతో...

ఓ సూపు సూసేద్దామా!
కూరగాయల సూప్

కావాల్సినవి: క్యాబేజీ, బీన్స్‌ తరుగు; క్యారెట్‌ ముక్కలు- పావు కప్పు చొప్పున, ఉల్లికాడల తరుగు- కొద్దిగా, వెల్లుల్లి తరుగు- చెంచా, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- చెంచా, మొక్కజొన్న పిండి, వెన్న- రెండు పెద్ద చెంచాల చొప్పున.

తయారీ: స్టవ్‌పై పాన్‌ పెట్టి వెన్న వేసుకోవాలి. అది వేడయ్యాక వెల్లుల్లి, ఉల్లిపాయ, ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి. దీంట్లో క్యారెట్‌ ముక్కలు, బీన్స్‌, క్యాబేజీ తరుగు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో మొక్కజొన్నపిండి వేసి కొన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని సూప్‌లో పోస్తూ బాగా కలపాలి. చివరగా ఉల్లికాడలతో గార్నిష్‌ చేసుకుంటే వేడి వేడి వెజ్‌టేబుల్‌ సూప్‌ రెడీ.

పుట్టగొడుగులతో...

ఓ సూపు సూసేద్దామా!
పుట్టగొడుగుల సూప్

కావాల్సినవి: పుట్టగొడుగులు- 200 గ్రా., వెన్న- రెండు చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి (చిన్న ముక్కలుగా కోసుకోవాలి), సన్నగా తరిగిన వెల్లుల్లి- రెండు రెబ్బలు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- రెండు చెంచాలు, ఉల్లి తరుగు- కొద్దిగా.

తయారీ: పొయ్యిపై పాన్‌ పెట్టి వెన్న వేయాలి. దీంట్లో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. ఇందులోనే పుట్టగొడుగు ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ మష్రూమ్స్‌ను చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. దీన్ని మిక్సీజార్‌లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా చేసుకోవాలి. అలా తయారుచేసుకున్న సూప్‌ను మరొక పాన్‌లోకి తీసుకుని కొన్ని నీళ్లు కలపాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకుని కాసేపు మరిగించాలి. గిన్నెలోకి తీసుకుని ఉల్లి తరుగుతో గార్నిష్‌ చేసుకోవాలి.

టొమాటో క్యారెట్‌తో...

ఓ సూపు సూసేద్దామా!
టొమాటో, క్యారెట్ సూప్

కావాల్సినవి: టొమాటోలు- నాలుగు, క్యారెట్‌- రెండు, ఉప్పు- తగినంత, నెయ్యి- చెంచా, మిరియాల పొడి- పావు చెంచా, చక్కెర- చెంచా, వెల్లుల్లి రెబ్బలు- అయిదారు, క్రీమ్‌, కొత్తిమీర - కొద్దిగా.

తయారీ: టొమాటో, క్యారెట్‌లను ముక్కలుగా కోసుకోవాలి. వీటిని కొన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీజార్‌లో వేసి మిక్సీ పట్టి వడకట్టుకోవాలి. దీనికి కొన్ని నీళ్లు కలపాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టాలి. నెయ్యి వేసి అది వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో తయారుచేసి పెట్టుకున్న టొమాటో, క్యారెట్‌ సూప్‌ పోసి చిన్నమంటపై మరిగించాలి. చక్కెర, మిరియాల పొడి జత చేసి పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. చివరగా క్రీమ్‌తో గార్నిష్‌ చేసుకుంటే సరి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.