ETV Bharat / lifestyle

potatoes milk: బంగాళాదుంప పాలు ఎప్పుడైనా టేస్ట్​ చేశారా..?

‘కాసిని పాలు తాగుతారా...’ అని ఇంటికి వచ్చినవాళ్లని ఎవరినైనా అడిగి చూడండి. ‘ఏ పాలు...’ అని ఎదురు ప్రశ్నిస్తారు. ఆశ్చర్యంగా చూస్తే... ‘పడటం లేదని డెయిరీ మిల్క్‌ మానేశామండీ... వేగన్‌ మిల్క్‌ మాత్రమే తాగుతున్నాం’ అంటూ వివరణ కూడా ఇస్తారు. అవునండీ... ఈమధ్య ప్లాంట్‌ మిల్క్‌ వాడకం క్రమంగా పెరుగుతోంది. అందులో భాగంగా కొత్తగా బంగాళాదుంపల పాలూ (potatoes milk) మార్కెట్లోకి వచ్చాయి. అదెలానో చూద్దామా...

new milk
new milk
author img

By

Published : Nov 21, 2021, 4:05 PM IST

పాలు అనగానే ఎవరికైనా ఆవువో గేదెవో మాత్రమే తెలుసు. కొందరు మాత్రం ఒంటె, మేక, గాడిద పాలూ తాగేవారు. కానీ ఇప్పుడు పాలు జంతువులు(డెయిరీ), మొక్కల(వేగన్‌)కు సంబంధించినవి అని రెండు రకాలు. ఈ మొక్కల పాలల్లో బాదం, సోయా, కొబ్బరి పాలు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి (potatoes milk). పల్లీలు, మొక్కజొన్న, బఠాణీ గింజలతో చేసినవీ అరటిపండు పాలూ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. కొత్తగా బంగాళాదుంపల నుంచీ పాలను తయారుచేస్తున్నారు. లండన్‌ విశ్వవిద్యాలయ పరిశోధనల ఆధారంగా- స్వీడన్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ, బంగాళాదుంపల పాలను మార్కెట్లోకి తీసుకొచ్చి వార్తలోకెక్కింది. డెయిరీ పాలల్లోని లాక్టోజ్‌ చాలామందికి పడకపోవడంతోపాటు డెయిరీఫామ్స్‌ వల్ల వాతావరణానికీ భారీయెత్తున నష్టం వాటిల్లడమే వేగన్‌ పాల వాడకం పెరగడానికి ప్రధాన కారణం... అయితే వీటిని కొనేటప్పుడు లేబుల్‌ను తప్పక పరిశీలించాలి. వాటిల్లో చక్కెర శాతం ఎంత ఉందీ, విటమిన్లూ క్యాలరీలు... వంటివన్నీ ఏ మేరకు ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే ఆయా ఉత్పత్తుల్లో సహజంగా ఉండే పోషకాల నుంచి చక్కెర శాతాన్ని తగ్గించి, అదనంగా కాల్షియం, విటమిన్‌-డి, అయొడిన్‌... వంటి పోషకాల్నీ చొప్పిస్తున్నారు. దాంతో మనకు అవసరమైన పోషకాలున్న పాలను నిశ్చింతగా తాగొచ్చన్నమాట.

బంగాళాదుంపలతో..

లు అన్నమాట వినగానే ముందుగా వేపుడు, మసాలా కూర, చిప్స్‌ గుర్తొస్తాయి. కానీ స్వీడన్‌కు చెందిన డగ్‌ కంపెనీ, బి12, విటమిన్‌-డి, ఫోలిక్‌ ఆమ్లం... వంటి విటమిన్లను చొప్పించి ఒరిజినల్‌, బరిస్టా, అన్‌స్వీటెన్డ్‌... అని మూడు రకాల పొటాటో పాలను తీసుకొస్తోంది (potatoes milk). ఎందుకంటే-బాదం, కొబ్బరి... వంటి వాటిలా బంగాళాదుంప మొక్క పెరగడానికి సంవత్సరాలు అక్కర్లేదు. సోయా, ఓట్స్‌, వరి... వంటి పంటల కన్నా తక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు ఒక గ్లాసు బాదం మిల్క్‌ కావాలంటే 120 లీటర్ల నీళ్లు కావాలి. అదే బంగాళాదుంప పాలకి అందులో సగం కూడా అక్కర్లేదు. ఎలా చూసినా ఈ పంట వల్ల పర్యావరణానికి కలిగే నష్టమూ తక్కువే. పైగా ఈ పాలను గేదె, ఆవు పాల మాదిరిగానే వంటల్లోనూ బేకరీ ఉత్పత్తుల్లోనూ లాటె డ్రింక్సులోనూ వాడుకోవచ్చట. దాంతో మార్కెట్లోకి వచ్చిన కొద్దిరోజులకే డగ్‌ పొటాటో మిల్క్‌కి ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇన్నొవేషన్‌ అవార్డు’ లభించింది. అంతేకాదు, అతికొద్ది సమయంలోనే ‘బెస్ట్‌ అలర్జీ ఫ్రెండ్లీ ప్రొడక్ట్‌’గానూ పాచుర్యం పొందింది. అలాగే తియ్యగా ఉండే చిలగడదుంపల్నీ ఉడికించి పాలరూపంలో వాడుతున్నారు. ముఖ్యంగా కొరియన్లు నారింజ, ఊదా రంగుల్లో ఉండే చిలగడదుంపల పొడితో లాటె డ్రింకులూ బబుల్‌ టీలూ తయారుచేసుకుంటున్నారు.

పాలదుంపతో...

కొన్ని రకాల దుంపలూ గింజలతో చేసిన పాల వాడకం పూర్వం నుంచీ మనదగ్గరా వాడుకలో ఉంది... అలాంటివాటిల్లో ఈ పాల దుంప(యారో రూట్)ఒకటి. పిల్లలకు తేలికగా జీర్ణమవుతుందన్న కారణంతోనూ తల్లిపాలు సరిగ్గా లేనివాళ్లకీ ఈ పొడిని నీళ్లలో కలిపి పాలకు బదులుగా పట్టిస్తుంటారు. ఫోలేట్‌ సమృద్ధిగా ఉండే ఈ దుంప, గర్భిణులకీ మంచి పోషకాహారం. ఆ సమయంలో ఇది మూత్ర సమస్యల్నీ తగ్గిస్తుందట. పైగా మిగిలిన దుంపలతో పోలిస్తే ప్రొటీన్‌ ఎక్కువ, క్యాలరీలు తక్కువ. పొటాషియం, ఐరన్‌ వంటి ఖనిజాలూ; థయామిన్‌, నియాసిన్‌... వంటి విటమిన్లూ ఎక్కువగా ఉండటంతో మంచానపడ్డ రోగులకీ దీన్ని తేలికపాటి ఆహారంగా ఇస్తుంటారు. మధుమేహులకీ మంచిదే. డయేరియాతో బాధపడే పిల్లలకు కాస్త పొడిని పాలల్లో కలిపి ఇస్తే ఫలితం ఉంటుందట. ఈ దుంపలు పిల్లల్లో మెదడు పెరుగుదలకీ తోడ్పడతాయనీ, పసివాళ్లకీ గర్భిణులకీ ఇది మంచి ఆహారమనీ చెబుతారు. అందుకే ఈ పొడితో పాలు తయారుచేసుకుని తాగుతున్నారు.

మొక్కజొన్నతో...

కాల్చుకునీ ఉడికించుకునీ మొక్కజొన్నని (Milk with corn ) తినడం తెలిసిందే. అలాగే వంటల్లో కార్న్‌ఫ్లోర్‌నీ వాడుతుంటాం. పోతే, ఇందులోని విటమిన్‌-ఎ, బి1, బి2, బి6, కోలీన్‌, బీటాకెరోటిన్‌ వంటి పోషకాలు కొలెస్ట్రాల్‌, రక్తహీనత తగ్గడానికీ; కంటి సమస్యలు, మధుమేహం వంటివి నిరోధించడానికీ తోడ్పడతాయి. కానీ ప్రతిరోజూ ఆహారంలో భాగంగా కార్న్‌ తినడానికి అందరూ ఆసక్తి చూపరు. అందుకే ఇప్పుడు మొక్కజొన్నని సైతం వేగన్‌ మిల్క్‌గా మార్చేస్తున్నారు. ముఖ్యంగా చైనాలో ఈ కార్న్‌ మిల్క్‌ వాడకం ఎక్కువట. అక్కడ రెస్టరెంట్లలో వేడివేడి కార్న్‌పాలను అందిస్తుంటే జనం ఎంతో ఇష్టంగా చప్పరిస్తుంటారట. పొట్టలో మంట ఉన్నవాళ్లకి మొక్కజొన్న మంచి ఉపశమనమని చైనా సంప్రదాయ వైద్యం పేర్కొనడమూ ఇందుకు కారణం కావచ్చు. ఈ విషయమే తెలిసిందో లేక ఇతర వేగన్‌ పాలల్లో భాగంగానో ఇప్పుడు కార్న్‌, స్వీట్‌కార్న్‌ గింజల్నీ పొడి రూపంలోనూ పాల రూపంలోనూ కూడా అమ్ముతున్నారు. సో, మొక్కజొన్న పొడిని నీళ్లలో కలుపుకుని పాలులా వాడుకోవడమే కాదు, ఇతరత్రా వంటల్లోనూ వేసుకోవచ్చన్నమాట.

పల్లీలతో...

డికించుకునో వేయించుకునో పల్లీల్ని నేరుగా తినడంతోపాటు రకరకాల వంటల్లోనూ వాడుతుంటాం. పైగా మిగిలిన నట్స్‌ అన్నింటితో పోలిస్తే ఇందులో ప్రొటీన్‌ శాతం ఎక్కువ. విటమిన్‌-ఇ, మెగ్నీషియం, విటమిన్‌-బి6 వంటి పోషకాలూ అధికమే. పాశ్చాత్య దేశాల్లో దీన్నుంచి తీసిన వెన్ననీ తింటుంటారు. ఇప్పుడు డెయిరీ ఉత్పత్తులకి ప్రత్యామ్నాయంగా వీటితో చేసిన పాలనే కాదు, మజ్జిగనీ తాగుతున్నారు. అలాగే ఈ పాలల్లో కొవ్వులూ క్యాలరీలూ ఎక్కువే అయినప్పటికీ ఇందులోని పీచు కారణంగా త్వరగా ఆకలి వేయదు. పైగా ఇందులోని ప్రొటీన్‌ క్యాలరీల్ని కరిగిస్తుంది. దాంతో బరువూ పెరగరు. పోషకాహారలోపంతో బాధపడేవాళ్లకి పల్లీపాలు ఎంతో బలవర్థకం అని నిపుణులూ చెబుతున్నారు. అందుకే నేరుగా మార్కెట్లో దొరికేవి కొనుక్కునే కాదు, ఇంట్లోనే స్వయంగా చేసుకునీ వేరుసెనగ పాలు తాగుతున్నారట. నిజానికి వీటిని మొట్టమొదట దక్షిణ అమెరికాలోని ‘ఇంకా’ నాగరికత కాలంలోనే తాగారట. పాతే కొత్త అన్నది ఫ్యాషన్‌కే కాదు, ఆహారానికీ వర్తిస్తుంది అంటే ఇదే మరి.

బఠాణీలతో...

డెయిరీ, సోయా పాలు సరిపడని వాళ్లకి బఠాణీల పాలు (Peanut milk ) మేలు అంటున్నారు న్యూట్రిషనిస్టులు. పైగా వాటికన్నా వీటిల్లో కాల్షియం 50 శాతం ఎక్కువ. ఒమేగా ఆమ్లాలు పుష్కలంగా ఉండే బఠాణీలు ఎండాక పసుపురంగులోకి మారతాయి. అప్పుడు వాటినుంచి పాలను తయారుచేస్తారు. బఠాణీల్లోని ప్రొటీన్‌కి అదనంగా డి2, బి12... వంటి కొన్ని రకాల సూక్ష్మపోషకాల్నీ; చిక్కదనం, ఫ్లేవర్‌ కోసం చాక్లెట్‌, వెనీలా వంటి కొన్ని పదార్థాల్నీ జోడించి మరీ ఈ పాలను తయారుచేస్తున్నారు. ఫుడ్‌ ఫోర్టిఫికేషన్‌ ద్వారా వీటిని తియ్యగానూ, తీపి లేకుండానూ కూడా తయారుచేస్తున్నారు. ఇటీవల నెస్లే కంపెనీ సైతం ‘వుండా’ పేరుతో ‘పీ మిల్క్‌’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అలాగే పిల్లలకోసం పీ ప్రొటీన్‌ను పొడి రూపంలోనూ వస్తోంది. ఇక, వీటిని ఇంట్లోనూ చేసుకోవచ్చు. బఠాణీలను నానబెట్టి ఉడికించాక రుబ్బి వడగడితే సరి.

అరటిపండ్లతో...

రటిపండులో (banana milk) పొటాషియంతోపాటు, బి12 వంటి విటమిన్లూ పుష్కలం. కొద్దిపాళ్లలో సోడియం కూడా లభిస్తుంది. కాబట్టి వేగన్లకే కాదు, వర్కవుట్స్‌ చేసేవాళ్లకీ అరటి పాలు మంచి ప్రత్యామ్నాయం. పైగా ఇది ఇతర వేగన్‌ పాల కన్నా జ్యూసీగానూ తియ్యగానూ ఉంటుంది కాబట్టి పిల్లలూ ఇష్టంగా తాగుతారు. ‘ములా’ అనే కంపెనీ ఇప్పటికే అరటిపండుతో పాలను తయారుచేస్తోంది. దాంతో బాదం, సోయా వంటి నట్స్‌ పడనివాళ్లకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా వాడుకలోకి వస్తోంది. పైగా పండిన పండ్లకి కాసిని నీళ్లు జోడించి ఇంట్లోనే బనానా మిల్క్‌ తయారుచేసుకోవచ్చు. ఫ్లేవర్‌ కోసం బాదం, దాల్చినచెక్క వంటివి జోడిస్తే గ్లాసు దించితే ఒట్టు.

చూశారుగా... ‘కావేవీ పాలకి అనర్హం’ అన్నట్లు మనకు తెలిసిన పండ్లూ గింజలూ దుంపలూ ధాన్యం... ఇలా అన్ని రకాల మొక్కల ఉత్పత్తులనీ పాల రూపంలో తాగేస్తున్నారు. సో, భవిష్యత్తులో పశువుల పాలకన్నా మొక్కల పాలదే పై చేయి అన్నమాట.

ఇదీ చూడండి: Salt Effects: ఉప్పు.. మెదడు ఆరోగ్యానికి ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.