నెలకో రెండు నెలలకో బరువు చూసుకుంటాం. బరువు అదుపులో ఉందనిపిస్తే మన ఫిట్‌నెస్‌కి(Health Tips in Telugu) వచ్చిన ఇబ్బందేమీ లేదులే అనుకుంటాం. నిజానికి మన ఫిట్‌నెస్‌కి బరువు ఒక్కటే ప్రామాణికం కాదు...
ఆయాసం వస్తోందా...
రెండు అంతస్తులు ఎక్కినా, రెండు కిలో మీటర్లు నడిచినా ఆయాసం వస్తోందా? అయితే మీరు అన్ ఫిట్!(fitness Tips in Telugu) 200 మీటర్లు నడవడానికి ఆరునిమిషాలూ, ఆపైన పడుతుంటే ఆలోచించుకోవాల్సిందే. సౌకర్యంగా కదులుతున్నారా... మన కండరాల్లో పట్టేసినట్టుగా కాకుండా కొంత సడలింపు ఉండాలి. ఈ సడలింపు వల్లే ఒక్కోసారి తూలినా సర్దుకోగులుగుతాం. ప్రతి కండరానికి ఈ సాగే గుణం ఎంతుంది అనేది వైద్యులు నిర్ధరిస్తారు. మనకీ కొంత అవగాహన రావాలంటే నేలమీద పడుకుని కాళ్లు రెండూ నెమ్మదిగా పైకి లంబకోణంలోకి వచ్చేంత వరకూ ఎత్తాలి(Health Tips in Telugu). ఇలా సునాయాసంగా ఎత్తగలుగుతున్నామంటే కండరాలకు సాగే గుణం బానే ఉన్నట్టు.
భుజాలు సాగుతున్నాయా?: మోకాళ్లు మడిచి వాటిపై కూర్చున్నప్పుడు పిరుదులు.. మడమలని తేలిగ్గా తాకగలగాలి. వెన్నెముక, మెడా నిటారుగా ఉంచి నిలబడాలి. ఇప్పుడు ఎడమ చేతిని ముందుకు చాపి.. కుడిచేతిని ఎడమ చేతి కింద నుంచి పైకి పెట్టడానికి ప్రయత్నించాలి. దీనివల్ల భుజాల్లో సాగే గుణం ఎంతుందో తెలుస్తుంది.
ఎగిరి చూడండి: కింద నుంచి పైకి నిటారుగా 20 సార్లు ఎగరాలి. అప్పుడు మరీ ఎక్కువ ఆయాసపడిపోకుండా ఉండాలి. కాళ్లు ఎగరడానికి సహకరించాలి. అప్పుడు కాలికండరాల సత్తువ తెలిసిపోతుంది. మహిళల్లో కొవ్వుశాతం 15 - 18 మధ్యలో ఉండాలి. దీంతోపాటూ... పించ్ టెస్ట్ చేసి చూడండి... అంటే చర్మాన్ని గిల్లినట్టుగా కాకుండా లాగడానికి ప్రయత్నించాలి. కాలూ, తొడా, నడుమూ, పొట్టా ఇలా కొవ్వు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లాగి చూస్తే రెండు అంగుళాల కంటే ఎక్కువగా చర్మం చేతికి దొరకకూడదు. అంతకంటే ఎక్కువగా చేతికి చిక్కుతుంటే వైద్యుల్ని కలవాల్సిందే.
కొవ్వు పేరుకుపోతుందా?
బరువు పెరగడం వల్ల పొట్టలో కొవ్వు(fitness tips in telugu) పేరుకుపోతుంది. గర్భిణీగా ఉన్న సమయంలో కండరాలు పక్కకు తొలగిపోవడం. చివరగా కాన్పు సిజేరియన్ ద్వారా జరిగి ఉంటే అక్కడ కణజాల పొరల్లో ఖాళీ ఏర్పడి, కుట్లు సరిగ్గా అతుక్కోక ఆ సందుల్లో నుంచి పొట్ట లోపలి అవయవాలు బయటకు ఉబ్బెత్తుగా రావడం జరగొచ్చు. దీన్ని ఇన్‌సెషనల్ హెర్నియాగా పిలుస్తారు. అయితే అత్యంత సాధారణ కారణమైతే కండరాల బలహీనతే. పరీక్షించి చూస్తే వీటిలో దేనివల్ల పొట్ట ఎత్తుగా కనిపిస్తోందో అర్థమవుతుంది. బెల్ట్ పెట్టుకున్నంత వరకు అది పొట్ట కండరాలకు ఆసరాగా, సౌకర్యంగా ఉంటుంది. కానీ అది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. నిజానికి బెల్టు వల్ల పొట్ట తగ్గదు. వదులైన కండరాలు తిరిగి పూర్వపు స్థితికి రావాలంటే వ్యాయామం తప్పనిసరి. పొట్ట, నడుము దగ్గర ఉండే కోర్ మజిల్స్ దృఢంగా మారడానికి క్రంచెస్, స్ట్రెయిట్ లెగ్ రైజింగ్, ప్లాంక్స్ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట తగ్గుతుంది. లైపో సెక్షన్ ప్రక్రియ ద్వారా అదనపు కొవ్వును తొలగించుకోవచ్చు. హెర్నియా ఉన్న వారికి శస్త్రచికిత్స ఒకటే మార్గం. అయితే ఇక సంతానం అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఇలాంటి సర్జరీలు చేయించుకుంటే మంచిది
ఇదీ చదవండి: ఇలా చేస్తే తొడల దగ్గర కొవ్వు కరుగుతుంది!