ETV Bharat / lifestyle

తరచూ పీడకలలు పీడిస్తుంటే...!

author img

By

Published : Feb 23, 2021, 9:02 AM IST

మమ్మల్నీ తరచూ పీడకలలు వస్తున్నాయా..? రాత్రిళ్లు మెలకువ వచ్చి.. ఆ భయంతో నిద్ర పట్టడం లేదా..?. ఆ కలలో వచ్చినవి నిజమవుతాయా?

nightmares
nightmares

లలు సాధారణంగా నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని, మనచుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని ప్రతిబింబిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన మానసిక స్థితికి అద్దం పడతాయి. ఇల్లూ, పిల్లల చదువులు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు... ఇలా మధ్య వయసులో చాలారకాల సమస్యలు చుట్టుముడతాయి. ఓ వైపు పిల్లలు కెరీర్‌లో నిలదొక్కుకునేలా చూడటం, మరోవైపు ఆరోగ్యంలో వస్తున్న మార్పులను గమనించుకోవడం, ఆర్థిక సమస్యలని అధిగమించడం లాంటివాటితోపాటూ జీవితంలో అనుకున్నవి సాధించలేకపోయామనే అసంతృప్తి కూడా వెంటాడే సమయమిది. వీటన్నింటితో సతమతమవుతూ చాలామందిలో ఆందోళనా, నిర్లిప్తత, దిగులు, దుఃఖం లాంటివి చోటు చేసుకుంటాయి. అలా మనలో కలిగే ఆందోళనా, భయం, ఆవేదనలే పీడకలల్లా వచ్చి మనల్ని భయపెడతాయి. ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన పడేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది.

అయితే కలల్లో వచ్చిన సంఘటనలన్నీ భవిష్యత్తులో వాస్తవంగా జరగవు. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళనకు గురికావొద్దు. ప్రస్తుతం మీకున్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, సమస్యలను మార్చుకోగలిగితే మీకున్న ఆందోళన తగ్గుతుంది. దాంతో పీడకలలూ క్రమంగా తగ్గిపోతాయి. ఒకవేళ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాకపోతే ఓసారి మానసిక వైద్యులను సంప్రదించండి. వారు తగిన మందులు, చికిత్సలను సూచిస్తారు. కంగారు పడాల్సిన పనిలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.